Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!

June 17, 2025 by M S R

.

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్. BRS ప్రత్యర్థి పార్టీలతో పాటు ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు. తెలంగాణ, ఏపీలో 1000 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు.

తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్. 2018 నుంచి 2023 వరకు ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు…

Ads

.

……. ఇదీ ప్రస్తుతం బాగా సర్క్యులేట్ అవుతున్న ఓ వార్త… బహుశా ఇంత అరాచకంగా ఫోన్ల ట్యాపింగు జరిపిన ఏ రాష్ట్ర ప్రభుత్వమూ లేదేమో దేశంలో… చిన్నాచితకా ప్రతి పార్టీ నాయకుల ఫోన్లు… తెలంగాణ మాత్రమే కాదు, ఏపీ నాయకులవి కూడా… ఇంకా తవ్వితే సూత్రధారి గనుక నోరు విప్పితే ఇంకెన్ని అరాచకాలు బయటపడతాయో…

ఫోన్ ట్యాపింగుకు షర్మిల, కవిత మాత్రమే కాదు… కేసీయార్ చుట్టూ తిరిగే ఉపగ్రహాల ఫోన్లు సైతం… ఇదంతా ఒకెత్తు… సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి, ఆ ట్యాపింగ్ టీమ్ మెంబర్లు సాగించిన అరాచకాలు మరో ఎత్తు… ఫోన్ రికార్డుల ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్ గట్రా…

అందుకే అనేది తెలంగాణపై కేసీయార్ చేసిన చేతబడులు అన్నీ ఇన్నీ కావు… దేశమంతా పెద్ద రచ్చ నడిచింది చాన్నాళ్లు… మోడీ ప్రభుత్వం పెగాసస్ ప్రయోగిస్తోందని… ముఖ్య నాయకులు, ఎడిటర్లు, మీడియా ఓనర్లు సహా సమాజ ప్రసిద్ధుల ఫోన్లను ట్యాప్ చేశారని…

ఎస్, సంఘ వ్యతిరేక శక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తే అర్థముంది… చేయాలి కూడా… అది అరాచక శక్తుల అణిచివేతకు, ఏరివేతకు అవసరం… కానీ ఆ ట్యాపింగే ఓ అరాచకశక్తిగా మారితే… అదీ కేసీయార్ తెలంగాణపై రుద్దిన తప్పు…

చిన్నాచితకా మీడియా సంస్థల ప్రతినిధులు, ఎడిటర్లు, మేధావులు, కళాకారులు… ఎవరు కాదు..? ఫోన్ ట్యాపింగుకు గురికాని ప్రముఖులెవరూ లేరనుకుంటా… అప్పట్లో ఓ కీలకాధికారి చెప్పాడు కదా, తెలంగాణలోని ప్రతి వ్యక్తి జాతకమూ మా చేతుల్లో ఉందని…

వీళ్లేనా..? రాష్ట్రానికి వచ్చీపోయే కేంద్ర ప్రతినిధులు, నాయకులు, కీలకాధికారుల ఫోన్లనూ ట్యాప్ చేశారా..? ఇక్కడ సిట్ ఏదో దర్యాప్తు చేస్తోంది సరే, కానీ కేంద్రం కూడా ఓ కన్నేయాల్సిన వ్యవహారం ఇది… దీని తీవ్రత చూసే కావచ్చు బహుశా చంద్రబాబు హయాంలో వెంకటేశ్వరరావు ప్రభృతులు ఇజ్రాయిల్ నుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ట్యాపింగ్, రికార్డింగ్ పరికరాల కోసం ప్రయత్నించింది…

ఈ దర్యాప్తును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ లాజికల్ ఎండ్ వరకు తీసుకెళ్లాలని తెలంగాణ సమాజం కోరిక… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడటం తెలంగాణకు ఈ కోణంలో మంచి చేసినట్టే… లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగులు వంటివి ఇంకెంత వికృతరూపం ధరించేవో… ఇంకెంత అరాచకం ప్రబలేదో..!!

బాధితుల ఎదుట ప్రభాకరరావును ప్రశ్నించి, రికార్డు చేయాలనే దర్యాప్తు అధికారుల ఆలోచన కూడా సరైనదే… బాధితుల స్టేట్‌మెంట్లు రికార్డు చేయడంతోపాటు వారి గోప్యతను కూడా గౌరవించాలి సిట్..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions