.
నవీన్ చంద్ర … తమిళ మూలం, తెలుగు జననం, బళ్లారి జీవనం… మూడు రాష్ట్రాలకూ లింకున్న నటుడు… 2006 నుంచీ ఫీల్డులో ఉన్నాడు… హీరోగా, కేరక్టర్ ఆర్టిస్టుగా మధ్యలో ఐదారేళ్లు మినహా ఏవో సినిమాలు చేస్తూనే ఉంటాడు, టీవీ షోలూ చేస్తుంటాడు… కానీ దక్కాల్సినంత ఫేమ్ రాలేదేమో అనిపిస్తుంది…
మంచి నటుడే… పెద్దగా కామెడీ చేసినట్టు గుర్తులేదు… కానీ ఇప్పుడు షో టైమ్ అనే సినిమాతో వచ్చాడు… రాజా రవీంద్రకు కామెడీ టైమింగు తెలుసు… వీకే నరేష్ కామెడీ గురించి చెప్పనక్కర్లేదు… సరదాగా కథ నడిపిస్తూనే కాస్త భయపెట్టే కథనంతో దర్శకుడు మదన్ కొంత సక్సెస్ అయినట్టే చెప్పాలి…
Ads
కామాక్షి హీరోయిన్… మలయాళం, తమిళం భాషల్లో కొన్ని సినిమాలు వస్తుంటాయి… ఒకే రాత్రి కథ… ఒకే రోజు కథ… ఒకే గదిలో కథ… ఇలా… అందులోనే ప్రేక్షకుడిని రంజింపచేయాలి… అంటే మంచి స్క్రీన్ ప్లే అవసరం… ఈ సినిమా కూడా అంతే… వన్డే మ్యాచ్… అంటే ఒకేరోజు కథ…
ఓ ఇల్లు… రాత్రి పదకొండు… కుటుంబం మొత్తం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు… ఓ సీఐ వచ్చి ఏమిటీ న్యూసెన్స్ అని హంగామా చేస్తాడు… కుటుంబ సభ్యులతో వాగ్వాదం… అనుకోని కేసు వచ్చి మీద పడుతుంది… వాళ్లను ఓ లాయర్ ఎలా రక్షించాడనేది సినిమా… కొత్తగానే ఉంది కథ…
ట్రీట్‌మెంట్ కూడా బాగుంది… ఫస్టాఫ్ చకచకా ముగించి, కాస్త ఇంట్రస్ట్ క్రియేట్ చేసి, సెకండాఫ్ అసలు కథలోకి తీసుకుపోతాడు దర్శకుడు… తరువాత కొన్ని మలుపులు… ఒకే రూమ్‌లో కథ నడుస్తుంది… అక్కడక్కడా కాస్త కథనంలో తడబడినట్టు కనిపించినా, ఎక్కడికక్కడ కవర్ చేస్తూ స్థూలంగా మెప్పిస్తాడు దర్శకుడు…
నిజానికి ఇలాంటి కథలు రక్తికట్టేలా ప్రజెంట్ చేయడం పెద్ద టాస్కే… కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే ప్రేక్షకులూ ఇలాంటివే ఇష్టపడతారు కూడా… ప్రజెంట్ ట్రెండ్… క్లైమాక్స్ రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీ… నవీన్ చంద్రకు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు కొత్తేమీ కాదు… అలవోకగా చేసేశాడు… సీనియర్ నరేష్ పాత్ర కూడా కీలకమే…
కొన్నాళ్లుగా నరేష్ ఇన్నింగ్స్ మాంచి జోరు మీదుంది… రకరకాల పాత్రలు ట్రై చేస్తున్నాడు… బోలెడంత అనుభవం కదా, ప్రతి పాత్రనూ రక్తికట్టిస్తున్నాడు… సరే, రాజా రవీంద్ర, కామాక్షి పర్లేదు… నాలుగు డబ్బులు మిగిలితే అది దర్శకుడి క్రెడిటే… పెద్ద స్టార్లతో ఇలాంటి కథ తీసుకున్నా టాకిల్ చేయగలడు…!! ఎలాగూ ఈరోజు వచ్చిన తమ్ముడు ఫ్లాప్… త్రీబీహెచ్‌కే స్లో మూవీ… సో, ఈ సినిమాకు ఇంకాస్త మేలు జరుగుతుందేమో…
Share this Article