Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్‘..! జోరుగా ప్రచారం.., జరిగితే శుభమే..!!

April 20, 2026 by M S R

.

శ్రేయాస్ అయ్యర్… ఇండియా టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంగ్లిష్ మీడియా రాస్తోంది… అవకాశముందా..? అసలు తనను జాతీయ జట్టుకు దూరం చేస్తున్న కారణాలేమిటి..? తన వ్యక్తిగత నేపథ్యమేమిటి..? ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.,. ఎందుకంటే..? ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుసగా తను లీడ్ చేస్తున్న పంజాబ్ జట్టు అయిదు మ్యాచులు గెలిచి, పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి టాప్ వన్ ప్లేసులో ఉంది కాబట్టి..!

ఒక క్రెడిట్ మాత్రం శ్రేయాస్‌కు ఉంది… తను ఏ జట్టులో ఉంటే ఆ జట్టుకు ఐపీఎల్ కప్పు రావడమో, లేకపోతే ఫైనల్స్ దాకా రావడమో తప్పనిసరి అని..! ఇప్పుడూ అదే బాటలో దూసుకుపోతున్నట్టుంది పంజాబ్ జట్టు..! నిజానికి కెప్టెన్ వ్యక్తిగత ప్రదర్శన, కెప్టెన్సీ మాత్రమే విజయాల్ని అందించవు, చాలా కారణాలు జతకలవాలి… టీమ్‌లో అందరూ రాణించాలి ప్రధానంగా… కాకపోతే క్రెడిట్ కెప్టెన్‌కు దక్కుతుంది, ఈ ఫీల్డ్‌లో సహజమే…

Ads

తన పర్సనల్ ప్రొఫైల్ చూద్దాం ఓసారి… ఇంట్రస్టింగు… తను పుట్టింది, పెరిగింది, చదివింది, ఆడింది అంతా ముంబై… కానీ తండ్రి సంతోష్ అయ్యర్ తమిళుడు… తల్లి రోహిణి తులు ప్రాంతం (కర్నాటక)… ఈ కుటుంబం పూర్వీకులు కేరళలోని త్రిసూర్ ఏరియా… భారత జట్టు తరఫున టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచులు కూడా ఆడాడు… చెప్పుకోదగిన స్కోర్లే ఉన్నాయి… మరి జట్టుకు ఎందుకు దూరమయ్యాడు..?

గౌతమ్ గంభీర్‌తో విభేదాలు అనే ప్రచారం ఉంది కానీ, నిజానికి చాలా కారణాలున్నాయి… ముఖ్యంగా బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి దూరం చేయడానికి…!

1. దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడం … బీసీసీఐ ఆదేశించినప్పటికీ, రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడం అయ్యర్‌పై వేటుకు ప్రధాన కారణమైంది… ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బోర్డు స్పష్టం చేసినా, అతను ఆ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్యాంప్‌లో కనిపించడం ఆగ్రహానికి గురిచేసింది…

2. ఫిట్‌నెస్ సమస్యలు, గాయాలు … వెన్నునొప్పి (Back Injury)…: అయ్యర్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు… సెప్టెంబర్ 2025లో, తన శరీరం Red Ball Cricket ఒత్తిడిని తట్టుకోలేకపోతోందని, అందుకే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు అతను బీసీసీఐకి తెలిపాడు…

  • తీవ్రమైన గాయం (Spleen Injury)…: అక్టోబర్ 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు… అతని ప్లీహం దెబ్బతినడంతో సర్జరీ అవసరమైంది… దీనివల్ల అతను సుమారు రెండు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు…

3. కమ్యూనికేషన్ గ్యాప్ … అయ్యర్‌కు బోర్డుతో సరైన కమ్యూనికేషన్ ఎప్పుడూ లేదు… తన గాయాలు, ఫిట్‌నెస్, ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాడనే వివరాలు ఎప్పుడూ సరిగ్గా కమ్యూనికేట్ చేయడు…

అయితే, గాయాల నుంచి ఎప్పటికప్పుడు శ్రేయాస్ వేగంగా కోలుకుంటాడు… మొన్నటి మ్యాచులో తను పట్టిన ఓ క్యాచ్ అబ్బురం… ముంబై ప్లేయర్లు సహా స్టేడియంలోని ప్రేక్షకులంతా అలా ఆశ్చర్యంగా చూశారు ఆ క్యాచ్‌ను… ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 52 సగటుతో 208 పరుగులు చేసి, మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు…

టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ అనే ప్రచారం ఎందుకొస్తున్నదీ అంటే… శ్రేయాస్ ఓ కెప్టెన్‌గా తన ఐపీఎల్ జట్టకు అందిస్తున్న విజయాలతోపాటు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం కూడా ఓ కారణమే… 2025 డిసెంబర్ వరకు సూర్య కుమార్ యాదవ్ వరుస ఫెయిల్యూర్స్… 25 ఇన్నింగ్సుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు… 2026 ప్రారంభంలో న్యూజిలాండ్ సిరీస్‌లో,  వరల్డ్ కప్‌లోనూ ఫామ్‌లోకి వచ్చాడు… మళ్లీ ఇప్పుడు ఐపీఎల్‌లో అంత పర్‌ఫామెన్స్ ఏమీ కనబరచడం లేదు… నిజంగానే శ్రేయాస్ @ ‘సర్పంచ్ సాబ్‘ గనుక టీ20 కొత్త కెప్టెన్ అయితే… మంచి నిర్ణయమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వందోసారి చూస్తున్నా సరే… కఠినాత్ముడైనా సరే… కళ్లు తడుస్తాయి…
  • టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్‘..! జోరుగా ప్రచారం.., జరిగితే శుభమే..!!
  • లెన్స్‌కార్ట్ బాగోతాల అసలు దోషి ఓనరే… అడుగడుగుకో అబద్ధం, వంచన…
  • ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?
  • బ్యాక్ టు బేసిక్స్..! పుస్తకాలు- పెన్నులు మళ్లీ…! మనమూ మారదాం..!!
  • మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ లింక్… ఇదుగో క్లారిటీ…
  • తెలంగాణపై విషం కాదు తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమి…
  • సంక్రాంతి విందులో ఖర్జూరాలు..! మరో వివాదంలో లెన్స్‌కార్ట్..!!
  • B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!
  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions