సీనియర్ నరేష్ భార్య అప్పుల బాగోతం పోలీసు కేసుల దాకా పోవడం ఏమో గానీ, నరేష్ పాత పెళ్లిళ్లు, పెటాకులన్నీ సోషల్ చర్చలోకి వచ్చినయ్… నిజంగానే కామన్ రీడర్‌కు నరేష్ పాత పెళ్లిళ్ల గురించి తెలియదు… తాజా పవిత్రాలోకేష్తో బంధమూ తెలియదు… ఈ చర్చ సాగుతూ ఉండగా, ఒకాయన ‘‘నరేష్ కథలు సరే, కానీ ఎవరు శుద్ధపూసలు..? ఈ రంగుల ప్రపంచంలో ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తయ్ కదా… లవ్వు, బ్రేకప్పు, లివ్ఇన్, డేటింగ్, పెళ్లి, పెటాకులు చాలా కామన్ అయిపోయాయ్ కదా…
ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, క్యాస్టింగ్ కౌచ్ బాపతా, టెంపరరీ వాడకం బ్యాచా వంటి చర్చలు కూడా ఇండస్ట్రీలో సర్వసాధారణమే కదా… ఒక్కసారి సిద్ధార్థ్ కథలు తవ్వండి, తనెంతటి గ్రంథసాంగుడో తెలుస్తుంది… సమంతను వెక్కిరిస్తూ ట్వీటాడు కదా… చైతూతో పెళ్లి పెటాకులయ్యాయని శాడిస్టిక్ ఆనందాన్ని కనబరిచాడు కదా… మరి తన కథలేమిటి..?’’ అని కామెంట్ చేశాడు… ఔనా..? సిద్ధార్థుడికీ బోలెడు కథలున్నాయా..? అని ఆరా తీస్తే ‘‘సుడిగాలి సిద్ధార్థ్’’ అన్నట్టుగానే కనిపిస్తున్నాడు…
Ads
ఆమధ్య ఇండియాటుడే సిద్ధార్థ్ ప్రేమాయణాల మీద ఓ పెద్ద కథనాన్నే ప్రచురించింది… ఆకర్షిస్తాడు, కలిసిపోతాడు, ఆనందిస్తాడు, కానీ ఏ బంధాన్నీ కాపాడుకోలేడు, తను కాదు, తన సహచరులే తనని అసహ్యించుకుని వెళ్లిపోతారు… ఇదీ మనకు అర్థమయ్యేది… ఫస్ట్ ఆఫ్ ఆల్… మేఘన… ఢిల్లీ అమ్మాయి… సిద్ధార్థ్‌కు బాల్యస్నేహితురాలు, తరువాత ప్రేమికురాలు… 2003లో పెళ్లి చేసుకున్నారు… 2006 నుంచీ దూరం ఉంటూ, చివరకు 2007లో విడాకులు…
ఆ తరువాత పెళ్లి దాకా వెళ్లనివ్వలేదు ఏ వ్యవహారాన్ని కూడా…! రంగ్దేబసంతిలో తనతో నటించిన సోహా అలీ ఖాన్‌తో యవ్వారం తన మొదటి భార్య పసిగట్టింది, అదిలించింది… మారకపోవడంతో చివరకు వదిలేసింది… ముంబైలోని సోహా ఇంట్లో చాన్నాళ్లున్నాడు… ఆమె కూడా ఈ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించింది… సిద్ధార్థ్‌తో అనేక అంశాల్లో అభిప్రాయభేదాలు ముదిరి, ఆమె కూడా వదిలేసింది… తరువాత కొన్నాళ్లకే సిద్ధార్థ్ ట్రాప్‌లో మరొకరు…
ఆమె పేరు శృతిహాసన్… అప్పట్లో బాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేస్తున్న కాలమది… మొత్తానికి సిద్ధార్థ్, శృతి ఒక్కటయ్యారు… శృతి కలిసింది… అలా కలిపేస్తాడు తను… సహజీవనం కూడా స్టార్ట్ చేశారు… తండ్రి కమల్‌హాసన్ కూడా ఈ టైపే కదా… ఎంకరేజ్ చేశాడు… కానీ ఇదీ నిలవలేదు… ఇక్కడా సిద్ధార్థ్ వైఖరితోనే సమస్య… ఏడాదిన్నర సహజీవనంతో శృతికి అర్థమైపోయింది… సూట్‌కేసు సర్దుకుని బయటికి వచ్చేసింది… ఇది 2011లో… ఇద్దరి నడుమ మాటలు కూడా లేవట ఇప్పుడు…
వెంటనే సమంత దొరికింది సిద్ధార్థ్‌కు… అప్పట్లో జబర్దస్త్ అనే సినిమా చేశారు ఇద్దరూ… అక్కడ పడేశాడు… దాదాపు రెండున్నరేళ్లు బంధం కొనసాగింది… ఇక పెళ్లిచేసుకుందాం అని కూడా అనుకున్నారు… ఇనక్కుల్ ఒరువన్ అనే సినిమాలో సిద్దార్థ్ పక్కన నటించిన దీప సన్నిధితో ఆయన కలిసి తిరుగుతున్నాడనీ, ఈ వుమనైజర్ను పెళ్లి చేసుకుంటే నువ్వే కష్టాల పాలవుతావ్ అని ఆమె దోస్తులు హెచ్చరించారు… దీప, సిద్ధార్థ్ బంధం గమనించి, మనస్సు విరిగిపోయి ఇక వదిలేసింది…
సమంత ‘విచ్చలవిడి ఫ్రెండ్లీ నేచర్’ ప్లస్ గెటప్పులు సిద్ధార్థ్‌కు అప్పటికే నచ్చడం లేదట… సేమ్, చైతూతో విడాకులకూ ఈ ధోరణే కారణమనే ఆరోపణలున్నయ్ కదా… ఇవన్నీ సరే, మరి ఇప్పుడు..? దీప సన్నిధిలో ఉన్నాడని తమిళవార్తలు… నో, నో, ఆ సినిమా అయిపోయాక అసలు నేను సిద్ధార్థ్‌తో కనీసం మాట్లాడలేదు అని దీప ఆమధ్య ఖండించింది… నెక్స్ట్ ఎవరో…!! వాడుకోవడం, వదిలేయడం, కలిసిపోవడం, కలహించుకుని కాదనుకోవడం… ఇవన్నీ ఈ గ్లామర్ ప్రపంచంలో చాలా చిన్నవిషయాలని చెప్పడానికే ఈ కథనం…!!
Share this Article