Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు

June 17, 2026 by M S R

.

మొన్న మనం చెప్పుకున్నాం… సింగ్ గీతం సినిమా ఒక కోణంలో అభినందనీయం… ప్రయోగశీలి సింగీతం 90 ప్లస్ ఏజ్‌లో కూడా మరో ప్రయోగాత్మక సినిమా చేయడం… మాటలే పాటలుగా కథనం… నాగ్ అశ్విన్ అభిరుచి, అన్నింటికీ మించి దేవిశ్రీ ప్రసాద్ 150 దాకా ట్యూన్లతో తనదైన ముద్ర వేయడం… కానీ..?

ప్రయోగం సరే, కానీ మన ప్రేక్షకులను కనెక్ట్ అవుతుందా అని సందేహించాం కదా… ఎస్, అదే జరిగింది… ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కేవలం 4.88 కోట్లు, అదీ గ్రాస్… సరే, ఈ నిరాదరణకు చాలా కారణాలు ఉంటాయి, మళ్లీ ఆ విశ్లేషణ జోలికి పోవడం లేదిక్కడ… కానీ సింగ్ గీతం రక్తికట్టలేదు అనేది నిరూపణ. ఐతే ఈ ప్రయత్నాన్ని తేలికగా తీసేయాల్సిన అవసరం మాత్రం లేదు. ప్రయోగాలన్నీ జనాదరణ పొందాలనేమీ లేదు.

Ads



గాయపడ్డ సింహం మరో డిజాస్టర్. తరుణ్ భాస్కర్ (ప్రధాన పాత్ర), ఫరియా అబ్దుల్లా (కథానాయిక), మానస చౌదరి (కథానాయిక), శ్రీవిష్ణు (ప్రత్యేక పాత్రలో), జేడీ చక్రవర్తి (కీలక పాత్రలో) ఉన్నా సరే ప్రేక్షకుల నుంచి ఆదరణ లేదు. 10 రోజుల్లో 3.18 వరల్డ్ వైడ్ కలెక్షన్స్. ఎనిమిదోరోజు వసూళ్లు జస్ట్, లక్ష రూపాయలు మాత్రమే. ఈ సినిమాకు ప్రచారఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదన్నమాట.



ఈ రికార్డులు పరిశీలిస్తుంటే, ఓచోట చూపు నిలిచిపోయింది… అది కొత్త మలుపు అనే సినిమా కలెక్షన్ల దగ్గర… ఇది సింగర్ సునీత కొడుకు గోపరాజు ఆకాష్ హీరోగా చేసిన రెండో సినిమా… (మ్యాంగో రామ్ సపోర్ట్ ఉండీ ఓ డిజాస్టర్ ఫలితం)… 5 రోజుల్లో 20 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే. అయిదో రోజు వసూళ్లు కేవలం లక్ష రూపాయలు.

ఈ సినిమా రివ్యూ ఏమీ రాయడం లేదిక్కడ… కానీ పాపం శమించుగాక… ఆకాష్ పెద్దగా ప్రజెంట్ జనరేషన్‌కు నచ్చే హీరో మెటీరియల్ కాదనిపిస్తుంది… ఇప్పటికీ ఎవరు వార్త రాసినా సునీత కొడుకు అనే రాస్తున్నారు, అదే తనకు గుర్తింపు ఇప్పటికీ.!

మరో నటుడు సేమ్, తను ప్రముఖ యాంకర్ సుమ కొడుకు… తను కథానాయకుడిగా బబుల్‌గమ్ మొదటి సినిమా, తరువాత మోగ్లీ … ఫ్లాప్స్… తల్లులు ఇండస్ట్రీలో ఎంత పాపులరయితేనేం, సినిమా ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉంటేనేం… కొడుకులకు అది ఉపయోగపడాలనేమీ లేదు… ఒక ఆకాష్, ఒక రోషన్ కెరీర్ అదే చెబుతోంది…

అన్నట్టు… చాన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమా తన్నేసింది. ఘోరమైన వసూళ్లు, థియేటర్లకు వస్తున్నవాళ్లే లేరు. ఒక్క పెద్ది సినిమా కలెక్షన్లే ఊరట. అదీ అనుకున్నంతగా… పాన్ ఇండియా రేంజులో రన్ కావడం లేదని, పలుచోట్ల బయ్యర్లకు నిరాశ- నష్టాలు తప్పవని, ప్రత్యేకించి ఇతర భాషల్లో మరీ వీక్ అనీ ఇండస్ట్రీ టాక్…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions