.
నిజానికి మన తెలుగు టీవీ చానెళ్లలో సినిమా పాటలకు సంబంధించిన అద్భుతమైన రికార్డు ఈటీవీలో బాలు హోస్ట్ చేసిన పాడుతా తీయగా కార్యక్రమానిదే…
తప్పులు సవరిస్తూ, ఒప్పులు మెచ్చుకుంటూ, ఆయా పాటల నేపథ్యాలను వివరిస్తూ… (తనకు తెలియని పాటేముంది ఇండియన్ సినిమాలో…) రచయితలు, సంగీత దర్శకులు, గాయకుల ప్రతిభల్ని ప్రస్తావిస్తూ ప్రతి ఎపిసోడ్‌ను రక్తికట్టించాడు తను…
Ads
తరువాత ఇతర చానెళ్లు కూడా కాపీ కొట్టడానికి ప్రయత్నించాయి… మొదట్లో సూపర్ సింగర్ అంటూ మాటీవీ మొదలుపెట్టిన షో క్లిక్కయింది కానీ తరువాత దాన్ని భ్రష్టుపట్టించేశారు… అప్పట్లో సూపర్ సింగర్ ప్రతి ఎపిసోడ్ సూపర్ హిట్…
జీతెలుగులో సరిగమప అని మొదలు పెట్టారు… మొదట్లో కాస్త వోకే, కానీ తరువాత వేగంగా భ్రష్టుపట్టించి, ప్రతి ఎపిసోడ్‌ను మరీ సగటు టీవీ వినోద కార్యక్రమంలా మార్చేశారు… కుళ్లు జోకులు, గ్రూపు డాన్సులు, వెకిలి స్టెప్పులు ఎట్సెట్రా… గానం, ప్రతిభ, అంచనా, పరీక్ష, పోటీ అనేవి తెర వెనక్కి వెళ్లిపోయాయి…
మరీ రీసెంటుగా ముగిసిన సరిగమప అయితే పైత్యానికి పరాకాష్టలా మార్చారు… ఈ నేపథ్యంలో ఆహా ఓటీటీ కూడా తెలుగు ఇండియన్ ఐడల్ షో స్టార్ట్ చేసింది, మొదటి రెండు సీజన్లు వోకే… థర్డ్ సీజన్‌కు వచ్చేసరికి దాన్నీ చెడగొట్టారు… థమన్ పైత్యం, గీతామాధురి- గానశిక్షకుడు రామాచారి కొడుకు సాకేత్ పైరవీలు ఎట్సెట్రా…
హఠాత్తుగా ఓ రీల్ కనిపించింది… హీరో విష్వక్సేన్ శ్రీముఖి ఇరిటేటింగ్ అరుపులు, కేకలు నడుమ కంటెస్టెంట్ అభిజ్ఞను విజేతగా ప్రకటించాడు… అది చూడగానే ఇండియన్ ఐడల్ నేపథ్యమూ గుర్తొచ్చింది… అమెరికా, వర్జీనియాకు చెందిన అభిజ్ఞ సంగతంలో శిక్షణ తీసుకుంది… ఇండియన్ ఐడల్ ఆడిషన్ ఇస్తే తిరస్కరింపబడింది…
మళ్లీ ఏమైందో గానీ… తెర వెనుక ఏం పనిచేసిందో గానీ… వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశపెట్టారు… తను ఒకసారి తిరస్కరించాక ఎంట్రీ ఇప్పిస్తే థమన్ అహం ఊరుకోదు కదా… రెండుమూడు వారాలకే ఎలిమినేట్ చేయించాడు… ఆమె పట్టువదలని విక్రమార్కురాలు కదా… జీతెలుగు సరిగమపలో ప్రత్యక్షమైంది.,. కప్పు అందుకుంది… విశేషమే…
నిజానికి ఈ షోలో పాల్గొన్నవాళ్లు ఆ షోలో కనిపించడం సాధారణమే… తప్పులేదు… కానీ ఒకచోట మొదటి నుంచే తిరస్కరింపబడిన కంటెంట్ మరో షోలో ఏకంగా విజేత కావడం విశేషమే… ప్రణతి, మానస తదితరులు ఆహా, జీతెలుగు షోలలో కనిపించారు రీసెంటుగానే… ఆహాలో ఎలిమినేట్ చేయబడిన అనిరుధ్ సుస్వరం ఏకంగా హిందీ తాజా సీజన్‌లో అదరగొడుతున్నాడు… ఆహా ఇండియన్ ఐడల్‌లో గాయకులను సరిగ్గా అంచనా వేయడంలో లోపాలు కనిపిస్తున్నాయి…
కీర్తన పాడుతా తీయగా షోలో, ఆహా షోలో కూడా కనిపించింది… రియల్లీ జెమ్ అమ్మాయి… అణకువ, పాజిటివిటీ, మంచి ఉచ్ఛారణ, భావప్రకటన ప్రతి పాటలోనూ… కానీ ఏ షోలనూ చివరి దాకా చేరనివ్వలేదు జడ్జిలు… ప్రతి షోలోనూ, ప్రతి క్రియేటివ్ టీంలోనూ బోలెడు రాజకీయాలు ఉంటాయి కదా…!! రాబోయే జీసరిగమప షోను ఇంకెంత పాతాళంలోకి తీసుకుపోతారో… చూడాలిక…!!
Share this Article