ఎంకి పెళ్లి, సుబ్బి చావు…. అన్నట్టు ఎక్కడో ఏదో జరుగుతుంది… మన గాశారం బాగాలేకపోతే అది మనకు తగుల్కుని మన ఇజ్జత్ తీస్తది… ఇదీ అంతే… బెంగాల్‌లో ఈడీ పార్థ ఛటర్జీ అనే ఓ మంత్రి గారిపై కన్నేసి దాడులు చేసింది కదా… సారు గారి జాన్ జిగ్రీ దోస్త్, నటి, మోడల్ అర్పిత ముఖర్జీ ఇంట్లో 21 కోట్ల నగదు దొరికింది కదా… దాదాపు నెంబర్ టూ అనిపించుకున్న మంత్రి అరెస్టయితే పార్టీ సైలెంటుగా ఉండటం, తను నాలుగుసార్లు ఫోన్ చేసినా సరే మమత ఆన్సర్ చేయకపోవడం, పార్టీలో రెండు వర్గాల కుతకుతలు, పార్టీలో పీకే వర్గం పెట్టిన పెంట, మంత్రి గారి మరో దోస్త్ మోనాలిసా దాస్ మీదా ఈడీ కన్ను గట్రా బోలెడు వార్తలు వస్తున్నయ్… అదంతా వేరే కథ…
ఇక్కడ ఇష్యూ ఏమిటంటే…. మంత్రి గారి దోస్త్ అర్పిత అనేసరికి అందరి దృష్టీ ఆమెపై కేంద్రీకృతమైంది… ఆమె నివాసమే అడ్డాగా మంత్రి గారి నిర్వాకాలు ఒక చర్చ కాగా… ఆమె అందమైన నటి కావడంతో మీడియా దృష్టి సహజంగానే అటువైపు మళ్లింది… కాకపోతే కొన్ని మీడియా సంస్థలు ఆమె ఫోటో బదులు ఇంకొకరి ఫోటోను పొరపాటున పబ్లిష్ చేయడంతో మరో ఇష్యూ స్టార్టయింది…
నటి అర్పిత ముఖర్జీ ఫోటో ఇదీ…
Ads
కానీ కొన్ని మీడియా సంస్థలు ముంబై బేస్డ్ సింగర్ అర్పిత ఫోటోను పబ్లిష్ చేశాయి… ఆమె రూట్స్ కూడా బెంగాలీ… పేరు కూడా సేమ్… అర్పిత ముఖర్జీ… దాంతో బోలెడు మంది ఆమె మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు… నెట్‌లో ట్రోలింగ్, అందులోనూ ఓ అందమైన ఫేస్ కనిపించేసరికి ఇక రెచ్చిపోయారు నెటిజనం… ఇవన్నీ చదువుతున్న సదరు ముంబై సింగర్ అర్పితకు మండిపోయింది… ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది… ‘‘అయ్యా, ఆ అర్పిత వేరు, నేను వేరు..’’ అని చెప్పుకుంది…
కానీ ఆమెకు ఎక్కడ మండిదంటే… మీడియా కూడా కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా తన ఫోటో వాడుకోవడం…! తనపై ట్రోలింగ్‌కు ఆస్కారం కల్పించడం… దాంతో ఇంకో పోస్టు పెట్టింది…
పలు మీడియా సంస్థల పేర్లను రాస్తూ మరీ ఇచ్చి పడేసింది… మీ తప్పులు, పొరపాట్లతో వేరే వ్యక్తుల ఇమేజీని భ్రష్టుపట్టించడం సిగ్గులేనితనం కాాదా అని ప్రశ్నించింది..? దీన్ని ఏ స్థాయి జర్నలిజం అనాలి అని అడిగింది… మీయెంకమ్మా, క్షమాపణ చెప్పి, జనాలకు నిజం ఏమిటో చెప్పండి అని డిమాండ్ చేసింది… మీ నెత్తిమాశిన జర్నలిజం ఇలాగే కొనసాగితే లీగల్‌గా ప్రొసీడ్ అవుతానంటూ హెచ్చరించింది… నిజమే కదా… తప్పు అని తెలిసినప్పుడు సదరు మీడియా సంస్థలు క్లారిఫికేషన్ పబ్లిష్ చేయడం లేదా ఆమె ఫోటో డిలిట్ చేయడం పాత్రికేయ మర్యాద… ఐనా, మన అమాయకత్వం గానీ మన మీడియాకు ప్రస్తుతం అంత నైతికత, హుందాతనం ఎక్కడ ఏడ్చాయని…!!
Share this Article