.
సింగర్ మధుప్రియ… ఈమె తాజా వివాదంలో దేవాదాయ శాఖ స్పందించిన తీరు నవ్వొచ్చేలా ఉంది… ఈ శాఖకు భక్తుల సొమ్ము దోచుకోవడం తప్ప గుళ్ల పవిత్రతో, విశిష్టతో కాపాడటం చేతకాదు, అసలు ఆలోచనే ఉండదు…
భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినప్పుడైనా సరిగ్గా స్పందిస్తారా అంటే అదీ చేతకాదు… పరమ దిక్కుమాలిన శాఖ ఏదీ అంటే దేవాదాయ శాఖే… విషయం ఏమిటంటే..?
Ads
సింగర్ మధుప్రియ… అప్పట్లో ఆడపిల్లనమ్మా పాటతో ఫేమస్, తరువాత ఏదో పెళ్లి, ప్రేమ వ్యవహారంలో రచ్చ జరిగింది… బిగ్‌బాస్‌లో పాల్గొని తెగ చిరాకు పుట్టించింది… అప్పుడప్పుడూ సినిమా చాన్సులు వస్తుంటాయి…
ఆమె తెలంగాణలోని కాలేశ్వర ముక్తేశ్వరాలయంలోకి వెళ్లింది… ఏకంగా గర్భగుడిలో ఓ ప్రైవేటు సాంగ్ షూట్ చేయించుకుంది… అసలు గుడి లోపలకు సెల్ ఫోన్లనే తీసుకుపోనివ్వరు కదా… గర్భగుడిలోని దేవుడి విగ్రహాన్ని కూడా ఫోటోలు తీయనివ్వరు కదా… మరి ఆమెకు ఎలా సాధ్యమైంది..?
అంతకుముందు మరో సింగర్ మంగ్లి కూడా శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామి గుడిలో ఇలాగే ఓ ప్రైవేటు సాంగ్ షూట్ చేయించుకుని విమర్శల పాలైంది… ఒకటీరెండు రోజులు విమర్శలు, తిట్టేవాళ్లు తిడతారు సోషల్ మీడియాలో… తరువాత…?
ఏమీ ఉండదు… ఇప్పుడు మధుప్రియ విషయంలో మీడియాలో వార్తలు వచ్చాక… అధికారులు పూజారికి నోటీసులు ఇచ్చారట… ఈ ప్రైవేటు సాంగ్స్ షూట్ చేసేవాళ్లు ఆయన్ని దబాయించి మరీ నోరు మూయించి ఉంటారు…
ఆలయంలో భక్తులను బయటికి పంపించి మరీ, తలుపులు మూసి మరీ షూటింగ్ చేశారట… సీరియస్… ఈవో మారుతి అట ఎవరో… అబ్బే, కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతించాం అని మీడియాకు వివరణ ఇచ్చాడట… అసలు ఫస్ట్ సస్పెండ్ చేయాల్సింది తననే…
పోనీ, దేవాదాయ శాఖ వేరే ఉన్నతాధికారులు గనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే, ఆ పర్మిషన్ ఇచ్చినవారిని ఫస్ట్ సస్పెండ్ చేయాలి… ఎవరినో ఒకరిని బలిపశువును చేయాలి కాబట్టి పాపం పూజారి దొరికినట్టున్నాడు…
అంతేకాదు, మధుప్రియ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది… ఆ సాంగ్ రికార్డ్ చేసినవాళ్ల మీద కూడా… సదరు యూట్యూబ్ చానెల్ మీద కూడా రిపోర్ట్ చేయాలి… అవి చేయకుండా మీడియా కోసం ఏదో స్పందించినట్టు ఫోజులు దేనికి..? ఈ వివాదం తరువాత మధుప్రియ గానీ, ఆ టీం గానీ స్పందించినట్టు లేదు… కనీసం శ్రీముఖి తరహాలో సారీ కూడా చెప్పలేదు…
ఓసారి ఉత్తర తెలంగాణ వివాదాస్పద ఎమ్మెల్యే యాదగిరిగుట్ట మీదకు వెళ్లి, గుడి ఆవరణలోనే డ్రోన్‌తో పోస్ట్ వెడ్ షూట్ కోసం ప్రయత్నిస్తే అక్కడి అధికారులు ససేమిరా అన్నారు… కుదరదని చెప్పారు… చిన్న చిన్న గుళ్లలో పర్యవేక్షణ కష్టం… కానీ కాళహస్తి, కాలేశ్వరం వంటి గుళ్లలోనూ పర్యవేక్షణ ఉండదా…?
పోనీ, మీడియాలో వార్తలు వచ్చినప్పుడు, ఎవరు ఫోటోలు తీశారో, ఎవరు వీడియోలు రికార్డ్ చేశారో వాళ్ల మీద కేసులు పెట్టడం కూడా చేతకాదా..? లేక ఇక్కడ కూడా రాజీపడి, ఏదో ఆశపడి, నోళ్లు మూసుకోవడమేనా..? ఫాఫం ఈ దేవాదాయ శాఖకు ఓ మంత్రి, ఓ కమిషనర్, ఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నట్టు గుర్తు..!!
Share this Article