Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింగర్ మధుప్రియ… నువ్వు పాడితేనే KCR ఓడి, ఇంట్లో కూర్చున్నది..!!

April 21, 2026 by M S R

.

ఇగ రేవంత్ రెడ్డికి పాటలు పాడను… నా జర్నీ మొత్తం కేసీఆర్ బాపుతోనే – సింగర్ మధుప్రియ…. కొందరు తమను తాము అతిగా ఊహించుకుని, హెచ్చించుకుని నవ్వులపాలు అవుతారు… ఈమె కూడా అంతే… కాదు, అంతకన్నా ఎక్కువ… నువ్వు ప్రొఫెషనల్ సింగర్‌వు అయితే ఒక పార్టీకి కార్యకర్తలాగా ఉండిపోవు… పోనీ, ఉండిపోయావే అనుకో… నీ పాటకు, నీ మాటకు పక్షవాతం, పక్షపాతం ఉన్నట్టుగా… విలువ ఉండదు…

అసలు నిన్ను రేవంత్ రెడ్డి కోసం పాట పాడమని అడిగిందెవ్వరు..? అయ్యో, తల్లీ, అమ్మా, నీ పాట లేకపోతే మా బతుకులు, మా పార్టీలు ఏమైపోవాలి అని బతిమిలాడారా..? నువ్వు పింక్ సింగర్‌వు అని అందరికీ తెలుసు… ఐనా అడిగారే అనుకో, పాడితే పాడతావు, లేకపోతే లేదు… దానికి ఇంత భారీ స్టేట్‌మెంట్లు అవసరమా..?

Ads

మధుప్రియ పాడితే కేసీయార్ గెలవడు, గెలవలేదు… నువ్వే కాదు, బోలెడు మంది యూట్యూబర్లు, సింగర్లు, ఆర్టిస్టులు… సోషల్ మీడియా యాక్టివిస్టులు కోట్లకుకోట్లు తీసుకున్నారు… తీసుకుంటున్నారు… వాళ్లెవరూ కేసీయార్‌ను గెలిపించలేదు, పైగా ఇదుగో ఇలాంటి వ్యాఖ్యానాలతో కేసీయార్‌ను చెడగొట్టారు… చివరకు బిత్తిరి సత్తి (రవి), సావిత్రక్క (శివజ్యోతి), గంగవ్వ (బిగ్‌బాస్ బామ్మ) వంటి ఆర్టిస్టులనూ ప్రచారంలో వాడారు… ఏమైంది..? అతి ప్రచారం కొంపకు ఎసరు అనే కొత్త సామెతకు అర్థం ఇదే… అనగా కౌంటర్ ప్రొడక్ట్…

అన్నట్టు… మధుప్రియ వ్యక్తిగత జీవితం తాలూకు వివాదాలు ఇక్కడ ఎందుకులే గానీ… ఏడాది క్రితం వార్తాకథనాలు గుర్తొచ్చాయి… ఈమె ‘అతి చేష్టల’కు ఉదాహరణ అన్నమాట… నాటి ‘ముచ్చట’ కథనం మరోసారి…

  • (నిన్న రేవంత్ రెడ్డి రెండు వందల కోట్లతో తలపెట్టిన కాళేశ్వర ముక్తేశ్వర గుడి డెవలప్‌మెంట్ పనులకు శంకుస్థాపన చేశాడు కదా, ఆ గుడికి రిలేటెడ్ ఇది…)



2025… జనవరి22… సింగర్ మధుప్రియ… ఈమె తాజా వివాదంలో దేవాదాయ శాఖ స్పందించిన తీరు నవ్వొచ్చేలా ఉంది… ఈ శాఖకు భక్తుల సొమ్ము దోచుకోవడం తప్ప గుళ్ల పవిత్రతో, విశిష్టతో కాపాడటం చేతకాదు, అసలు ఆలోచనే ఉండదు…

భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినప్పుడైనా సరిగ్గా స్పందిస్తారా అంటే అదీ చేతకాదు… పరమ దిక్కుమాలిన శాఖ ఏదీ అంటే దేవాదాయ శాఖే… విషయం ఏమిటంటే..?

సింగర్ మధుప్రియ… అప్పట్లో ఆడపిల్లనమ్మా పాటతో ఫేమస్, తరువాత ఏదో పెళ్లి, ప్రేమ వ్యవహారంలో రచ్చ జరిగింది… బిగ్‌బాస్‌లో పాల్గొని తెగ చిరాకు పుట్టించింది… అప్పుడప్పుడూ సినిమా చాన్సులు వస్తుంటాయి…

ఆమె తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వరాలయంలోకి వెళ్లింది… ఏకంగా గర్భగుడిలో ఓ ప్రైవేటు సాంగ్ షూట్ చేయించుకుంది… అసలు గుడి లోపలకు సెల్ ఫోన్లనే తీసుకుపోనివ్వరు కదా… గర్భగుడిలోని దేవుడి విగ్రహాన్ని కూడా ఫోటోలు తీయనివ్వరు కదా… మరి ఆమెకు ఎలా సాధ్యమైంది..?

అంతకుముందు మరో సింగర్ మంగ్లి కూడా శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామి గుడిలో ఇలాగే ఓ ప్రైవేటు సాంగ్ షూట్ చేయించుకుని విమర్శల పాలైంది… ఒకటీరెండు రోజులు విమర్శలు, తిట్టేవాళ్లు తిడతారు సోషల్ మీడియాలో… తరువాత…?

ఏమీ ఉండదు… ఇప్పుడు మధుప్రియ విషయంలో మీడియాలో వార్తలు వచ్చాక… అధికారులు పూజారికి నోటీసులు ఇచ్చారట… ఈ ప్రైవేటు సాంగ్స్ షూట్ చేసేవాళ్లు ఆయన్ని దబాయించి మరీ నోరు మూయించి ఉంటారు…

ఆలయంలో భక్తులను బయటికి పంపించి మరీ, తలుపులు మూసి మరీ షూటింగ్ చేశారట… సీరియస్… ఈవో మారుతి అట ఎవరో… అబ్బే, కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతించాం అని మీడియాకు వివరణ ఇచ్చాడట… అసలు ఫస్ట్ సస్పెండ్ చేయాల్సింది తననే… 

పోనీ, దేవాదాయ శాఖ వేరే ఉన్నతాధికారులు గనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే, ఆ పర్మిషన్ ఇచ్చినవారిని ఫస్ట్ సస్పెండ్ చేయాలి… ఎవరినో ఒకరిని బలిపశువును చేయాలి కాబట్టి పాపం పూజారి దొరికినట్టున్నాడు…

అంతేకాదు, మధుప్రియ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది… ఆ సాంగ్ రికార్డ్ చేసినవాళ్ల మీద కూడా… సదరు యూట్యూబ్ చానెల్ మీద కూడా రిపోర్ట్ చేయాలి… అవి చేయకుండా మీడియా కోసం ఏదో స్పందించినట్టు ఫోజులు దేనికి..? ఈ వివాదం తరువాత మధుప్రియ గానీ, ఆ టీం గానీ స్పందించినట్టు లేదు… కనీసం శ్రీముఖి తరహాలో సారీ కూడా చెప్పలేదు…

ఓసారి ఉత్తర తెలంగాణ వివాదాస్పద ఎమ్మెల్యే యాదగిరిగుట్ట మీదకు వెళ్లి, గుడి ఆవరణలోనే డ్రోన్‌తో పోస్ట్ వెడ్ షూట్ కోసం ప్రయత్నిస్తే అక్కడి అధికారులు ససేమిరా అన్నారు… కుదరదని చెప్పారు… చిన్న చిన్న గుళ్లలో పర్యవేక్షణ కష్టం… కానీ కాళహస్తి, కాళేశ్వరం వంటి గుళ్లలోనూ పర్యవేక్షణ ఉండదా…?

పోనీ, మీడియాలో వార్తలు వచ్చినప్పుడు, ఎవరు ఫోటోలు తీశారో, ఎవరు వీడియోలు రికార్డ్ చేశారో వాళ్ల మీద కేసులు పెట్టడం కూడా చేతకాదా..? లేక ఇక్కడ కూడా రాజీపడి, ఏదో ఆశపడి, నోళ్లు మూసుకోవడమేనా..? ఫాఫం ఈ దేవాదాయ శాఖకు ఓ మంత్రి, ఓ కమిషనర్, ఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నట్టు గుర్తు..!!




 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Never Lose Your Core Engineering Team… మనిషిని మించిన యంత్రం ఇంకా రాలేదు! 
  • మణిరత్నం ఏమైనా తక్కువా..? ఆ ‘రావణన్’ సినిమా మాటేమిటి మరి..!?
  • శత్రుచర్ల కన్నుమూత… మేరంగి జమీందారీ చరిత్రకు ఓ ముగింపు..?!
  • మైక్రోసాఫ్ట్‌కు ఏఐ షాక్… అతిగా ఆధారపడితే అంతే- జోహోకు జాక్‌పాట్!
  • ‘దొంగ నా కొడుకు’ నవ్వించలేదు… కానీ హీరోగా నిలబడ్డాడు!
  • షేక్ హసీనాను అప్పగిస్తాం సరే… కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి
  • గుమ్మడిని అపార్థం చేసుకున్న ఎస్వీ రంగారావు… ఎందుకో మరి..!
  • స్తంభించిన అమెరికా.. ఆకాశంలో విమానాలు, నేలపై గందరగోళం!
  • అనిరుధ్ – కావ్య ‘ఆత్మగౌరవ వివాహం’ వెనుక వందేళ్ల చరిత్ర!
  • సినిమా రామాయణానికి తిరగమోత..! అసలు ఎవరు ఈ ‘బోధిసత్వుడు’..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions