ఇన్నిరోజులూ ఎంటర్ టెయిన్ చేయండ్రా, పర్‌ఫామ్ చేయండ్రా అంటే ఎవడికీ సరిగ్గా చేతకాలేదు… తీరా ఒకటీ రెండు రోజుల్లో ఆట ముగిసిపోతుంది అనగా తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు… ప్రత్యేకించి రేవంత్… మిడ్ వీక్ ఎవిక్షన్ అని ఓ దిక్కుమాలిన నిర్ణయంతో శ్రీసత్యను బయటికి పంపించేశాడు బిగ్‌బాస్… ఆమె సరదాగా, నవ్వుతూ వెళ్లిపోయింది…
ఆమెకు తెలుసు, ఇక్కడి దాకా రావడమే ఆమెకు గెలుపుతో సమానం… ఐనా తక్కువేమైంది… టాప్-6లో ఉంది… ఒకటీరెండు రోజుల తేడా మిగతావాళ్లతో పోలిస్తే… అంతే… కాకపోతే వీకెండ్ షోలో నాగార్జునతో వేదిక మీదకు రాకపోవడం ఓ వెలితి… జర్నీ గురించి నిన్ననే ఊదరగొట్టారు కాబట్టి, ఆ లోపమూ లేదు… సైలెంటుగా హౌజు నుంచి వెళ్లిపోయింది… ఆ తిక్క యాంకరుడు శివ చెత్త ప్రశ్నల్ని ఎదుర్కోవాలి ఇక…
ఇక్కడ రేవంత్ ఓవరాక్షన్ మరీ అతి… ఈ ఒక్క రోజు విరహానికే పెద్ద ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏడుపు మొహం పెట్టుకుని, శోకసామ్రాట్టులా శ్రీసత్య మీద తెగ ప్రేమ ఒలకబోశాడు… ఫస్ట్ నుంచీ ఆమెతో సరైన సంబంధాలు కూడా లేవు… బిగ్‌బాస్ నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి ఆమె గేటు దాటేలోపు కనీసం 36 సార్లు అలుముకున్నాడు ఆమెను… ఆమెతోపాటు కీర్తిని… అందుకే రేవంత్‌తో పోలిస్తే రోహిత్ హుందాగా ఉంటాడు… ఎక్కడా అతి ప్రదర్శించడు… చివరకు శ్రీసత్యతో కాస్త ఇంటిమసీ మెయింటెయిన్ చేసిన శ్రీహాన్ కూడా ఎక్కడా తొణకలేదు…
Ads
అసలు ఫినాలే ఒకటీరెండు రోజుల్లో ఉందనగా ఎవిక్షన్ చేయడం అనేదే అబ్సర్డ్… ఆ చేసేదేదో గత వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే అయిపోయేదిగా… అఫ్‌కోర్స్, ఈసారి సీజన్‌లో ఏం బాగుందని, ఈ ఒక్కదాన్ని విమర్శించడం… ఇక మిగిలింది ఐదుగురు… అందులో కీర్తి మొదట్లోనే ఎగిరిపోతుంది.,., ఆమె పద్ధతైన ప్రవర్తన, హుందాతనం, మాటతీరు ఇక్కడిదాకా తీసుకొచ్చాయి… అఫ్‌కోర్స్, బిగ్‌బాస్‌కు నచ్చకపోతే మధ్యలోనే ఎప్పుడో తరిమేసేవాడు…
బహుశా విన్నర్ కప్పు, ప్రైజ్ మనీ కోసం శ్రీహాన్, రేవంత్, రోహిత్ నడుమ బలమైన పోటీ ఉండవచ్చు… ఆదిరెడ్డికి ఎలాగూ అంత సీన్ లేదు… కాకపోతే లెక్కల మనిషి కదా, ఏ సందర్భంలోనైనా ఫలానా డబ్బు తీసుకుని వెళ్లిపోతావా అని బిగ్‌బాస్ అడిగితే ఎంచక్కా తీసుకుంటాడేమో… కీర్తికి ఆ చాయిస్ ఏమీ ఉండదు…
ఇవన్నీ ఎలా ఉన్నా సరే, ఫినాలే ఎప్పుడు, ఎవరు చీఫ్ గెస్టు..? బాలయ్యను ఏమైనా పిలుస్తారా..? ఎలాగూ వచ్చే సీజన్‌కు నాగార్జున తప్పుకుంటాడనీ, అన్‌స్టాపబుల్ షోతో ఇరగదీస్తున్న బాలయ్యను కొత్త హోస్టుగా తీసుకొస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది… బహుశా అది నిజం కాకపోవచ్చు… పైగా మాటీవీకి ఇప్పటికే ఆ షో మీద విపరీతమైన వైరాగ్యం వచ్చేసింది… ఫుల్ మైనస్ బడ్జెట్… చివరగా, కాస్త సరదాగా… బాలయ్య హోస్ట్ అయితే… ఎవడైనా కంటెస్టెంట్ తిక్కతిక్కగా మాట్లాడితే గేటు తీసుకుని నేరుగా హౌజులోకి వెళ్లిపోయి, వంగబెట్టి నాలుగు గుద్దుతాడేమో… దబిడిదిబిడే…!! నిజం చెప్పొద్దూ… బాలయ్య గనుక హోస్ట్ అయితే కథ వేరే ఉంటుంది…!! మరో సీజన్ నిజంగానే ఉంటే గనుక…!!
Share this Article