ఇంకా ఊహగానాలు అవసరం లేదు… సింగర్ ఉపద్రష్ట సునీత పెళ్లి చేసుకుంటోంది… ఆమే స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో చెప్పింది… తను ఆ ఫోటోలు పెట్టి, పోస్టు చేసిన గంట సేపట్లో ఓ ఇరవై వేల మంది ఆశీర్వించి, ఆన్లైన్లో అక్షింతలు కూడా చల్లారు… తన పోస్టులో మ్యాంగో మీడియా బిజినెస్‌మన్ రామ్‌తో కలిసి జీవితం పంచుకోబోతున్నట్టుగా తను వెల్లడించింది… ఇక రూమర్స్ అవసరమే లేదు… ఆశీర్వదించడమే… ఆమె జీవితం ఆమె ఇష్టం… రామ్ ఇష్టం ఇకపై…
Ads
గుంటూరుకు చెందిన ఓ సంగీత కుటుంబంలో పుట్టిన ఆమె మొదట టీవీ యాంకరిణి… తరువాత పదిహేనేళ్లకే సింగర్, ఇప్పటికి దాదాపు 3 వేల పాటలు… పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్… 19 ఏళ్లకే కిరణ్‌తో పెళ్లి,.. ఇద్దరు పిల్లలు, ఆకాష్, శ్రేయ… శ్రేయను సింగర్ చేయాలని అనుకుంటోంది… పెళ్లయిన కొన్నాళ్లకే సెలబ్రిటీల కుటుంబాల్లో కామన్ అయిపోయినట్టుగా విభేదాలు… విడిపోయింది…
తరువాత ఆమెపై అనేక రూమర్లు… కొన్ని ఖండించేది, కొన్ని చదివీచదవనట్టు వదిలేసేది… స్పందించకుండా ఉండిపోయేది… లోతు మనిషి… నిజానికి తనది పెద్ద వయస్సేమీ కాదు… 42 ఏళ్లే… ఐనా ఓ కొత్త తోడు వెతుక్కోవడానికి వయస్సుతో పనేం ఉంది లెండి… రామ్ కనిపించాడు… కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో బహిరంగ రహస్యమే… ఇప్పుడు ఆమే వెల్లడిస్తోంది… తమ బంధాన్ని అధికారికం చేస్తోంది… నిశ్చితార్థం చేసుకున్నారు…
త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు… పిల్లలకు చెప్పి మరీ… ఈమధ్య పిల్లల సాక్షిగానే జరుగుతున్న పెళ్లిళ్లు ఎన్నిలేవు..? సునీత పెళ్లి కూడా అంతే… ఈ ఫోటో కూడా ఆమె షేర్ చేసుకున్నదే… అనవసర ప్రచారాలు దేనికి..? అంతా నిజమేనోయ్ అని చెబుతున్నట్టుగా ఉంది… గుడ్… నిజానికి ఒక ఫేమస్ డిజిటల్ పర్సనాలిటీతో ఆమె పెళ్లి జరగనుంది అని కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నదే… తెలుగు డిజిటల్ ఫేమస్ పర్సనాలిటీలు చాలామంది ఉన్నారు…
యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లు, ప్రమోషన్ టీమ్స్, కొన్ని సినిమాల హక్కులు…. ఈ డిజిటల్ ప్రపంచం రూటే వేరు… రామ్ ఓ జెమ్… వీరపనేని రామ్ చౌదరి ఆస్తుల విలువ కొన్ని వందల కోట్లు… శుభం భూయాత్…
మరి రామ్ మొదటి భార్య పరిస్థితి ఏమిటి అనే కదా డౌట్… చాలారోజుల రోజుల క్రితమే వాళ్లు విడిపోయారు… పిల్లలు లేరట… సో, రెండు ఒంటరి పక్షులు లేటు వయసులో తోడు వెతుక్కున్నాయి… అదీ సంగతి…
Share this Article