.
సింగిల్… ఈ సినిమాలోనే కదా మంచు విష్ణు కన్నప్ప మీద ఏదో సెటైర్ వేశాడని ఫైరయింది… తరువాత సినిమాలో దాన్ని డిలిట్ చేశాను, సారీ అని హీరో శ్రీవిష్ణు చెప్పినట్టు కూడా గుర్తు… దీనికి మెగా వర్సెస్ మంచు అన్న రీతిలో వార్తలూ వచ్చాయి…
సరే, ఆ కథెలా ఉన్నా… ఈ సినిమా విషయానికొస్తే… సింపుల్‌గా రివ్యూ ఏమిటంటే… అక్కడక్కడా నవ్వులు పండాయి… సెకండాఫ్‌లో ఏవో ఎమోషన్స్ బలవంతంగా జొప్పించి సినిమాను నీరసపడేట్టు చేశారు… వెరసి ఇది అల్లు అరవింద్ సినిమాయా అనిపిస్తుంది…
Ads
విజయ్ (శ్రీ విష్ణు) అనే యువకుడి కథ ఇది… అతను తన బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలకాలని పట్టుదలతో ఉంటాడు… పూర్వ (కేతిక శర్మ)తో అతని ప్రేమ కథ ఈ సినిమా ముఖ్య భాగం… చివరికి విజయ్ ఎందుకు సింగిల్‌గానే మిగిలిపోతాడనే విషయాన్ని ఈ చిత్రం చూపిస్తుంది…
శ్రీ విష్ణు ఈ సినిమాకు బలం… తోడుగా వెన్నెల కిషోర్… అంతే… వారి సీన్లు బాగా పండాయి, నవ్వించారు… ఆ పాత్రల కేరక్టరైజేషన్, ఆ సీన్లు బాగానే రాసుకున్నాడు దర్శకుడు… శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ బాగుంటుంది, వెన్నెల కిషోర్ సరేసరి…
సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి చిత్రంలోని వన్ లైనర్స్, మీమ్ పంచెస్ బాగా నవ్విస్తాయి… వర్తమానంలో ట్రెండీ పాయింట్స్ ను చక్కగా ఇమిడ్చారు…
కేతిక శర్మ పాత్ర రచన బాగా లేదు, ఆమె నటన సో సో… ఆమె పాత్ర పెద్దగా గుర్తుండేది ఏమీ కాదు… ఇవానా వోకే, రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఈ సినిమాలో ఉన్నాడో తనకే తెలియదు పాపం… అఫ్‌కోర్స్, విటివి గణేష్ కూడా…
దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాని సరళమైన, కాన్సెప్ట్ ఆధారిత కథతో తీశాడు… కానీ సినిమా మొదటి భాగం ఆహ్లాదకరంగా, కొన్ని కామెడీ సన్నివేశాలతో బాగుంటుంది కదా సెకండాఫ్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు… అదే ఫన్ వైబ్ కంటిన్యూ చేసి ఉంటే సినిమా ఇంకాస్త చూడబుల్ అయి ఉండేది…
రెండో భాగంలో సినిమా తడబడటానికి, కథ స్పష్టత కోల్పోవడానికి పూర్ రచనే కారణం…, చివరకు సినిమాను ఎలా ముగించాలో తెలియక పేలవంగా శుభం కార్డు వేశారు… ఫన్ వైబ్ సినిమాకు కావల్సింది మంచి క్లైమాక్స్… అదే లోపించింది…
విశాల్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వోకే… పాటలు శుద్ధ దండుగ… కేవలం కొన్ని నవ్వించే సీన్ల కోసం, అదీ శ్రీవిష్ణు తన కామెడీ టైమింగుతో పండించిన సీన్ల కోసం థియేటర్ వెళ్లి మరీ సినిమాను చూడాలా అనడుగుతారా..? మీ ఇష్టం, మీ పర్స్ ఇష్టం… మీ టైమ్ ఇష్టం… సినిమా మాత్రం ఓ టైమ్ పాస్ పల్లీ బఠానీ వ్యవహారం…
Share this Article