Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?

July 21, 2026 by M S R

.

మునిగే పడవలాంటి కాంగ్రెస్‌లోకి ఎవరైనా వెళ్తారా? … ఇదీ కేటీయార్ ప్రశ్న నిన్న! నిజమే, కానీ నిజంగా తెలంగాణలో ఏది మునిగే పడవ..? అవును, రాష్ట్రంలోని చాలామంది నేతలు వేసుకుంటున్న ప్రశ్న… ‘‘పోచారం గాచారం బాగాలేక కాంగ్రెస్‌లోకి పోయిండు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నడో తనకే తెలుస్తలేదు, కుడితిలో పడ్డ ఎలుక లెక్క ఆగమైపోయిండు’’ అన్నట్టుగా ఏవో వ్యాఖ్యలు చేశాడు…

1) పోచారం సంగతి సరే, కానీ ఇంకా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలతో మరింత కేడర్ డ్రెయిన్‌ జరగకుండా అడ్డుకట్ట వేయాలనే ఓ విఫల ప్రయత్నమా..?

Ads

2) ఏ నాయకుడికైనా ఏ పార్టీలో ఉండాలో, ఏ పార్టీలోకి వెళ్లిపోవాలో తేల్చుకోవడానికి తనదైన లెక్కలు ఉంటాయి, తన సీటులో బలాబలాలు, ప్రత్యర్థులు, జనం మూడ్ ఎట్సెట్రా… అంతేతప్ప కేసీయార్, కేటీయార్ మొహాలు చూసి ఎవరూ బీఆర్ఎస్‌లోకి రారు, వెళ్లిపోరు…

3) కాంగ్రెస్ నిజంగానే మునిగే పడవ అనుకుందాం… కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి..? అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈరోజుదాకా ఏ ఎన్నికల్లోనూ పురోగతి లేదు, సొంతింట్లోనే కుంపట్లు, కేడర్‌లో నిర్లిప్తత, పెద్ద దొరవారిని వదలని నైరాశ్యం, అందుకేకదా ఫామ్ హౌజ్ వదలక, గత తప్పులకు జనానికి మొహం కూడా చూపించలేక సతమతం… ఏది విరిగిన టైటానిక్..? ఏది తస్కిన మేడిగడ్డ బరాజు..?

4) మొన్నమొన్ననే కదా జీవన్‌రెడ్డి తోపు, ఇక నీదే పార్టీ, ఇక కుమ్మెయ్ అని పెద్ద మీటింగు పెట్టి మరీ చేర్చుకున్నారు కదా… ఏమైంది…? తన గాచారం మాటేమిటి..? సవాలక్ష మంది కార్యకర్తల్లో తనూ ఒకరు… అంతకుమించి ప్రయారిటీ ఏముంది..? సాధించిందేముంది..? మూటగట్టుకున్న ఫాయిదా ఏముంది..? మరీ పత్రికల్లో జోన్ పేజీ నాయకుడిగా మిగల్లేదా..?

5) మునిగే టైటానిక్ అనే భావనతోనే కదా సొంత చెల్లెలు వెళ్లిపోయింది..! దొరవారి ఎడమభుజం కూడా ఎటెటో చూస్తున్నట్టు వార్తలు కూడా..!

ktr

6) బీఆర్ఎస్ నిజంగానే మళ్లీ అధికారంలోకి వచ్చే సీన్ ఉంటే… నల్ల మల్లారెడ్డి కుటుంబం మొత్తం పక్కచూపులు చూస్తున్నదెందుకు..? బీఆర్ఎస్ కారు దిగి పారిపోవాలని ఎందుకు అనుకుంటున్నట్టు..? పక్కా కమర్షియల్ నాయకుడు కదా… చివరకు పునాదులు కూడా లేకుండా కొట్టుకుపోయిన టీడీపీలోనైనా చేరతాను లేదా బీజేపీలో చేరతాను కానీ బీఆర్ఎస్‌లో మాత్రం ఉండనే ఉండను అంటున్నది దేనికి..? ఏది మునిగే పడవ సారూ..?

7) అయ్యో, కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు అనుకుని ఇన్నిరోజులుగా ప్రధాన నేతలు ఒక్కరైనా బీఆర్ఎస్‌లోకి వచ్చారా…? (జగిత్యాల లోకల్ జీవన్‌రెడ్డిని వదిలేస్తే)… బీఆర్ఎస్ కొడిగట్టింది అనుకునే కదా ఎవరూ ఇటువైపు చూడనిది! చివరకు బీఆర్ఎస్ రహస్య సంసారం చేసే బీజేపీలోకి కూడా ఒక్కరూ కొత్తగా చేరలేదు..? ఎందుకు..?

8) రేవంత్ రెడ్డి చెబుతున్నాడు, హరీష్ రావు ఎవరెవరినో కలుస్తున్నాడు, పక్కచూపులు చూస్తున్నాడు అని… నిజంగానే బీఆర్ఎస్ పడవకు చిల్లులు పడకపోతే తనెందుకు మారాలని అనుకుంటాడు..? అఫ్‌కోర్స్, పార్టీని చీల్చేవరకు షిండే కూడా ఉద్ధవ్ ఠాక్రేకు జై అని నినదించినవాడే కదా..! సో, కేటీయార్ సర్, ఏది మునిగే పడవ..? ఏది కుంగిన మేడిగడ్డ బరాజు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!
  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions