Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శిరీష్ భరద్వాజ్… చిరంజీవి బిడ్డతో ప్రేమపెళ్లి అప్పట్లో ఓ సెన్సేషన్…

June 19, 2024 by M S R

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఇంటి నుంచి పారిపోయి శిరీష్ భరధ్వాజ అనే యువకుడిని బోయిన్‌పల్లెలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సెన్సేషన్… అప్పటికి ఆమెకు 19, అతనికి 22 ఏళ్లు… అప్పటికే శిరీష్ మీద ఓ కేసు ఉన్నట్టు తరువాత వెలుగులోకి వచ్చింది… ఇదంతా 2007లో…

ఊపిరితిత్తుల వ్యాధిలో శిరీష భరధ్వాజ్ ఈరోజు మరణించాడనే వార్త చూశాక, నాటి ప్రేమపెళ్లి పరిణామాలే అందరికీ గుర్తొస్తాయి… (శ్రీజ కాపు, శిరీష్ బ్రాహ్మణుడు) నిజానికి ఆ వయస్సులో శ్రీజ మానసిక పరిణతి చాలా తక్కువ… కానీ శిరీష్ ప్రేమలో పడి, అందరినీ విడిచిపెట్టి పారిపోయి నాటకీయ పరిణామాల నడుమ పెళ్లి చేసుకుంది…

pk

Ads

మీడియా ఛేజింగులు, గంటల కొద్దీ వార్తలు… తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నాకూ, నా శిరీష్‌కు, తన తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉంది’ అని ఆరోపించింది… చిరంజీవి అవన్నీ కొట్టిపడేసి, పెద్దరికంతో తన బిడ్డను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు… (మనసులో కోపం ఉండవచ్చుగాక)… కానీ పవన్ కల్యాణ్ అప్పట్లో రియాక్ట్ అయిన తీరు మరీ విశేషం…

sirish

ఈ ఇద్దరికీ రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆర్డరేసింది… తరువాత పవన్ కల్యాణ్ తన తుపాకీని తీసుకెళ్లి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేశాడు… (తాత్కాలిక అప్పగింత)… శ్రీజ ఆరోపణల్ని తోసిపుచ్చాడు… అప్పట్లో తను సరెండర్ చేసిన గన్… లైసెన్స్‌డ్… తను మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడిగా ఉన్నప్పుడు 1998 నుంచీ తనకు లైసెన్స్ ఉండేది… అది అమెరికా మేడ్ రివాల్వర్… డామ్సన్ సిక్స్ ఛాంబర్ 0.22 కాలిబర్…

కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, అప్పటికప్పుడు ఓ చెక్ మీద కోటి రూపాయలు రాసేసింది అప్పటి తన సహచారి రేణుదేశాయ్… అప్పట్లో ఇవన్నీ సెన్సేషనల్ వార్తలు… (సందర్భం సరిగ్గా గుర్తులేదు గానీ పవన్ కల్యాణ్ ఓ ఇంగ్లిష్ పత్రిక తన మీద రాసిన వార్తల పట్ల నిరసనగా బైఠాయించినట్టు గుర్తు…)

sirish

సీన్ కట్ చేస్తే… అదే శ్రీజ తన భర్త శిరీష్‌పై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది… అప్పటికే ఆమెకు శిరీష్ ద్వారా ఓ పాప… కొన్నాళ్లు తప్పించుకు తిరిగాడు గానీ చివరకు పోలీసుల ఎదుట లొంగిపోక తప్పలేదు, కొన్నాళ్లు జైలులో ఉన్నాడు… ఆ తరువాత శ్రీజకు తనకూ 2014లో విడాకులు మంజూరయ్యాయి… శ్రీజ 2016లో కల్యాణ్‌దేవ్ అనే మరొకరిని పెళ్లిచేసుకోగా, శిరీష్ కూడా ఓ డాక్టర్‌ను (పేరు విహాన) రెండో పెళ్లి చేసుకున్నాడు… అవి వేర్వేరే కథలు… శ్రీజ కల్యాణ్‌దేవ్ పెళ్లి కూడా సక్సెస్ కాలేదు… 2022లోనే విడాకులు తీసుకున్నారు…

sirish

ఇంతకీ శిరీష్ ఏం చేసేవాడు..? ఎవరికీ సరిగ్గా తెలియదు… కొన్నాళ్లు కాంగ్రెస్, తరువాత బీజేపీలో తిరిగినట్టున్నాడు… 2014లో నరేంద్ర మోడీని కూడా కలిశాడు… అప్పటికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి… డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాక చెన్నైలో ఉండేవాడని సమాచారం… మొత్తానికి తన జీవితం ఎటెటో తిరిగి చివరకు ఇలా 39 ఏళ్లకు ముగిసింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
  • తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions