కంపల్సరీగా ఇద్దరిని నామినేట్ చేయాలట… ఇదొక ఉల్టా పుల్టా యవ్వారం… బిగ్‌బాస్ సెవన్త్ సీజన్ గత సీజన్‌కు భిన్నంగా ఏమీ పోవడం లేదు… నిజానికి దానికన్నా నీరసంగా, నిస్సత్తువగా నడుస్తోంది… అలాంటిదే ఇదీనూ… ఇద్దరిని కంపల్సరీ నామినేట్ చేయాలనే రూల్‌తో బకరా ఎవరు దొరుకుతారా అని చూశారు అందరూ…
కామన్ మ్యాన్ కేటగిరీలో హౌజులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ అల్కగా కనిపించాడు… అంతే, ఇంకేం… ఒకరి తరువాత ఒకరు వరుసకట్టి మరీ 9 మంది నామినేట్ చేసిపారేశారు… దాదాపు అందరిదీ ఒకే ఆరోపణ… ప్రశాంత్ డబుల్ ఫేస్డ్… తన ఆటలో నిజాయితీ లేదు, నటిస్తున్నాడు, ఎంతసేపూ కెమెరాల ముందు నిలబడి ఎక్స్‌పోజ్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు… రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పదే పదే ప్రయోగిస్తున్నాడు… ఒక కోణంలో ఆలోచిస్తే అది తప్పేమీ కాదు, తన స్ట్రాటజీ అది…
(నిజానికి తను కామన్ మ్యాన్ కాదు, గత సీజన్‌లో కూడా ఇలాగే బిగ్‌బాస్ కామన్ మ్యాన్ అంటూ ఓ యూట్యూబర్‌ను ప్రవేశపెట్టాడు… సేమ్, పల్లవి ప్రశాంత్ కూడా పాపులర్ యూట్యూబరే…) కానీ ఆట ఇప్పుడే మొదలైంది అని ముక్తాయించాడు… అంటే బయట బాగానే సెటప్ చేసుకుని వచ్చాడన్నమాట వోట్ల కోసం…
Ads
కాకపోతే మరీ అంత మంది నామినేట్ చేయడం నామినేషన్ల ఆటలో మజాను చంపేసింది… అంతమంది ఒకడినే టార్గెట్ చేయడంతో అందరి తప్పొప్పుల విశ్లేషణ లేకుండా పోయింది… 9 మంది నామినేట్ చేశారు, తనను మినహాయిస్తే ఇక నలుగురే తన తరఫున నిలబడ్డట్టు… అందులో శివాజీ ఒకరు… తను ప్రశాంత్‌కన్నా హోప్‌లెస్ కేరక్టర్… తనను కూడా బహుశా ఏడుగురు నామినేట్ చేశారు…
దాదాపు అందరిదీ ఒకే ఆరోపణ… యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, దబాయిస్తున్నాడు, పనిచేయడు, ఏవో నీతులు కథలు చెప్పి టైమ్ గడిపేస్తాడు… నిజంగానే అంతమంది నామినేట్ చేయడం శివాజీ పట్ల కంటెస్టెంట్లలో ఉన్న వ్యతిరేకతకు తార్కాణం… అఫ్‌కోర్స్, ప్రేక్షకులకు కూడా చిరాకు కలుగుతోంది శివాాజీ ధోరణి చూస్తుంటే..! నాగార్జునకు ఇష్టుడే కావచ్చుగాక, కానీ ఆటలో దిగాక ఎవరి ఇగో వాళ్లకు ఉంటుంది కదా… శోభాశెట్టి అయితే ధైర్యంగా శివాజీకి చెడామడా ఇచ్చిపడేసింది… సీనియర్, పెద్దవాడు ఎట్సెట్రా తొక్కాతోలూ ఏమీ పట్టించుకోలేదు ఆమె…
నిజానికి ఈసారి కూడా కంటెస్టెంట్ల ఎంపిక దారుణంగా ఉంది… ప్రత్యేకించి మగ కంటెస్టెంట్ల ఎంపిక హోప్ లెస్, కాస్తో కూస్తో ఆడ కంటెస్టెంట్లు కాస్త నయం… ప్రత్యేకించి దామిని, శోభాశెట్టి, ప్రియాంక, రతిక రోజ్… సెన్సిబుల్‌గా కనిపిస్తున్నారు… షకీలా, మిగతా వాళ్లు సోసో… మగ కంటెస్టెంట్లలో శివాజీ, ప్రశాంత్ వీక్… కాగా యావర్ మరీ వీక్… ఆట సందీప్ పవర్ అస్త్రతో అయిదు వారాలు గట్టుమీద నిల్చునే చాన్స్ కొట్టేశాడు… కొంతలోకొంత అమర్ దీప్ కాస్త బెటర్…
ప్చ్, వీళ్లతో బిగ్ బాస్ సీజన్ పూర్తిగా నడవడం అసాధ్యం… తప్పకుండా మలి దశ ఎంట్రీలు, సర్‌ప్రయిజ్ ఎంట్రీలు ఉంటాయి… ఉండాలి… ఇప్పుడు ఉన్నవాళ్లలో సగం మందిని అర్థంతరంగా బయటికి పంపించేయడం బెటర్… లేకపోతే మళ్లీ గత సీజన్‌లాగే భ్రష్టుపట్టిపోవడం ఖాయం… అసలు ఇప్పటికే ప్రేక్షకుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది… కొత్తదనం లేదు, కొత్తగా కనెక్టయ్యే అంశాలూ లేవు… ఏవో తలతిక్క సీరియళ్లలాగే ఈ రియాలిటీ షో సాగుతోంది… మరి ఇంత ఖర్చు దేనికి బ్రదర్..? ఏమో… బిగ్‌బాస్ క్రియేటివ్ టీంకే అర్థమవుతున్నట్టు లేదు…!!
Share this Article