Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సివరపల్లి..! హిందీకి రీమేక్ అయినా సరే, తెలంగాణ యాసలో పర్‌ఫెక్ట్…

January 28, 2025 by M S R

.

Srinivas Sarla  …….. అమెరికాలో జాబ్ చేయాలని ప్రయత్నించే ఓ యువకుడు, అసలు పల్లెటూరు అంటేనే ఇష్టం లేని వాడు పంచాయతీ సెక్రటరీగా పల్లెటూరికి వచ్చాక ఏం జరిగింది అనేదే సివరపల్లి సినిమా కథ..

హిందీ 7 పంచాయతీ సిరీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా కుదిరింది..

Ads

ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలతో పాటు మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి లాంటి సామాజిక రాజకీయ అంశాలను చాలా సున్నితంగా చర్చిస్తుంది.

సెక్రటరీ పాత్ర లో రాగ్ మయూర్ జీవించేసాడు. face లో ఆ ఇరిటేషన్, అసహనం, కోపం ఆ సీరియస్ నెస్ సూపర్ అసలు… పంచాయతీ సెక్రటరీ బిహేవియర్ అలా ఎందుకు ఉంటుంది ఈ సిరీస్ చుసిన వాళ్లకు ఖచ్చితంగా అర్థం అవుతుంది

గ్రామ పంచాయతీ అభివృద్ధిలో బాగంగా స్థానిక రాజకీయాల వల్ల సర్పంచ్, సెక్రటరీల మధ్యలో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు, ఆ ఇద్దరి మధ్యలో వారికే తెలియకుండా ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ ని చాలా అద్భుతంగా ఈ సిరీస్ ద్వారా చూపెట్టారు..

ఈ సిరీస్ లో ప్రతి సీన్ కంప్లీట్ రియాలిటీలో సాగుతుంది ముఖ్యంగా ఆ కారోబార్ నరేష్ పాత్ర అయితే హైలెట్.  సర్పంచ్ కి గ్రామ ప్రజలకు, సర్పంచ్ కి పంచాయతీ సెక్రటరీకి మధ్య వారధిగా చాలా కీలకంగా ఉంటుంది

ప్రతి ఒక్కరికి సొంత ఊరు ఒకటి ఉంటుంది కానీ పంచాయతీ సెక్రటరీకి వాడు విధులు నిర్వర్తించే ప్రతి ఊరు వాడికి సొంత ఊరే..

ఫైనల్ గా అందరు చూడాల్సిన సిరీస్.. సర్పంచులు సెక్రటరీలు అయితే మిస్ అవకుండా చూడాల్సిన సిరీస్.. ప్రైమ్‌లో ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!
  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
  • సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
  • ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు- రాముడి వారసులు మాత్రం సైలెంట్ !!
  • ఈసారి భద్రతా వ్యవస్థలోనే..! కొనసాగుతున్న అమెరికా *టెక్ కష్టాలు !!
  • ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions