Subramanyam Dogiparthi… ఎక్కడికి పోతుంది వీరాభిమానం !? వెర్రి తలలు వేస్తున్న పిచ్చి అభిమానం . నాయకులు , పార్టీల అధినేతలు ప్రజల సేవకులు . Servant Leaders . అలాంటిది వ్యక్తి పూజలో అన్ని పార్టీలు మునిగి తేలుతున్నాయి .
ఇప్పటివరకు పాలాభిషేకాలు మాత్రమే . ఇంకొన్నాళ్ళు పోతే వీరాభిమానులు తమ రక్తాన్ని పోగుచేసి , రక్తాభిషేకాలు కూడా మొదలు పెడతారు .
Ads
గాంధీ , నెహ్రూ , ఇందిరాగాంధీ , రాజీవ్ , NTR చనిపోయినప్పుడు గుండెలు ఆగినట్లు నాకయితే గుర్తు లేదు . ఎమర్జెన్సీ సమయంలో అన్ని రాజకీయ పార్టీల అధినాయకులను జైళ్ళలో పెట్టారు . ఎక్కడా గుండెలు ఆగినట్లు నాకయితే గుర్తు లేదు .
ఈ మూక మెంటాలిటీ బహుశా ఓవర్ ఏక్షన్ కి చిరునామా అయిన తమిళనాడులో ఉండేది . ఇప్పుడు అది పక్కనే ఉన్న మన రాష్ట్రానికి కూడా పాకింది .
రక్తంతో తాను CBN కి విధేయుడిని అని వ్రాయడం ఏమిటి ? చాలా ఘోరం . రక్తం ఆయనదే . కానీ దీన్ని కాపీ కొట్టి , రేపు మరో వీరాభిమాని పాత జానపద సినిమాల్లో లాగా , చేతులు తలలు తెగ నరుక్కుంటారు . సభ్య ప్రజాస్వామ్యం ఇలాంటి పిచ్చి పనులను గర్హించకపోతే , ఇదే ఆర్డర్ అయిపోయే ప్రమాదం ఉంది .
(మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న తమ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. అంతే కాకుండా రక్తంతో గోడపై ‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుతోనే తన ప్రయాణం అని ఆయన స్పష్టం చేశారు……. ఇదీ వార్త)
Share this Article