Bhaaskaron Vijaya…….. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా చూసి మురిసి పోయాం. ధారవిని చూసి పేదరికం ఇలాగే ఉంటుందా అని ఆశ్చర్యానికి లోనయ్యాం. కానీ మురికి వాడల్లో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపించింది మలీషా ఖార్వా. దేశవ్యాప్తంగా ఈ అమ్మాయి గురించి చర్చిస్తోంది. సామాజిక మాధ్యమాలలో టాప్ లో , ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంతకీ ఈ అమ్మాయి చేసింది ఏమిటి. ఆమె వెనుక ఉన్న కథేమిటో తెలుసు కోవాలంటే దీనిని చదవాల్సిందే.
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో మోస్ట్ పాపులర్ కంపెనీ ఏకంగా బాలీవుడ్ హీరోయిన్లను కాదనుకుంది. కేవలం మురికి వాడల్లో బతుకుతున్న అమ్మాయిని ఎంపిక చేసింది. తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా. ఆమెకు పట్టుమని 14 ఏళ్లు. ఇప్పుడంతా స్లమ్ గర్ల్ అని పిలుచుకుంటున్నారు. తనేమీ సిగ్గుపడడం లేదు. ఎందుకంటే తాను కూడా అక్కడి నుంచి వచ్చానని తెలుసు.

Share this Article
Ads