Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చూస్తుంటే పేదరికానికీ మార్కెట్ బాగానే ఉన్నట్టుంది..!!

September 10, 2024 by M S R

మిలియనీర్స్ స్లమ్… సంపన్నుల మురికివాడలు

కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు తల్చుకుంటూ ఉంటుందా ? అదీ పేదరికాన్ని అంగట్లో పెట్టి అమ్ముతుందా?

దక్షిణాఫ్రికాలో ‘షాన్ టీ టౌన్’ అనే రిసార్ట్ ఉంది. ఇది బ్లోమ్ ఫాంటేయిన్ అనే చోట అత్యంత విలాసవంతమైన ఏమోల్య ఎస్టేట్ లో ఉంది. ఈ రిసార్ట్ చూడటానికి మురికివాడలా ఉంటుంది. కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. డబ్బున్న టూరిస్టులకు పేదరికం రుచి చూపించడానికి ఈ మురికివాడ రిసార్ట్ ఏర్పాటు చేశారు. రేకులతో నిర్మించిన గుడిసెల్లాంటి వాటిలో టూరిస్టులు బస చేయాలి. కాకపోతే వైఫై, వేడినీరు, హీటింగ్ సదుపాయాలుంటాయి.

Ads

పేదవాడి కోపం పెదవికి ఎంత చేటైతే మాత్రం ధనికులకు ఇంత కండకావరమా? అని కొందరు కన్నెర్ర చేస్తున్నారు. పేదరికంతో బాధపడుతూ జీవించేవారిని ఈ విధంగా అనుకరించడం వారి కష్టాలని తక్కువ చేసి వెక్కిరించడమేనని మండి పడుతున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం సామాజిక వాస్తవాల్ని కళ్ళ ముందుంచే మంచి ప్రయత్నం చేశామని అంటున్నారు.

ఈ సందర్భంగా నాకు మరో విషయం గుర్తొచ్చింది. ఈమధ్య మా అంకుల్ భండారు శ్రీనివాసరావు అమెరికా వెళ్లారు. జర్నలిస్ట్ కుతూహలం కొద్దీ అక్కడ మురికివాడలు ఉంటే చూడాలని బయలుదేరారు. మనదేశంలో అయితే ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. కానీ అమెరికాలో అలా కాదు. ఎక్కడో రోడ్ పైన ఓ పక్కగా గుడారాలు వేసుకుని కనిపిస్తారంతే. అలా వెతుక్కుంటూ వెళ్లిన శ్రీనివాసరావు గారికి ఎక్కడో ఒకచోట ఒక అతను కనిపించాడు.





అతనికి ఆహారం ఇచ్చి మాట్లాడిస్తే… అందరూ తనంత మంచిగా ఉండరని, త్వరగా అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పాడట. ధనిక దేశాల్లో పేదరికం కూడా అరుదే. అందుకే వాళ్ళు మన దేశానికొచ్చి స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి చిత్రాలు తీస్తూ ఉంటారు. చూస్తుంటే పేదరికానికీ మార్కెట్ బాగానే ఉన్నట్టుంది. ఇంతకూ నిజమైన స్లమ్ డాగ్ మిలియనీర్ ఎవరో! – కె.శోభ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!
  • మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!
  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!
  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions