స్మిత సభర్వాల్… తెలంగాణ ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారిణి… కేసీయార్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు మంచి ప్రయారిటీని, గౌరవాన్ని పొందింది… వాడెవడో ఆమె ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసినప్పుడు, ఆమె ఏదో ఫ్యాషన్ పరేడ్‌లో పాల్గొన్నట్టు ఏదో మీడియా ఆమె మీద వెకిలి రాతలు రాసినప్పుడు కూడా తెలంగాణ సమాజం ఆమె వెనుకే నిలబడింది…
అంతేకాదు, ఆ మీడియా మీద పోరాటానికి కూడా తెలంగాణ ఖజానా నుంచే ఖర్చులు చెల్లించారు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆమె ఓ లూప్ లైన్ పోస్టింగులోకి వెళ్లిపోయింది… సరే, అది వేరే సంగతి… ఇప్పుడు వార్త ఏమిటంటే..?
ఆమె ఏదో ట్వీట్ చేసింది… ఇదీ…
Ads
దివ్యాంగులు, అంటే శారీరకంగా ఏదైనా వైకల్యం ఉన్నవారి రిజర్వేషన్లలో ప్రయారిటీ దేనికి అని ప్రశ్నిస్తోంది ఆమె… ఓ ట్వీట్ వదిలింది… దాని మీద చాలామంది అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మళ్లీ దానికి జవాబు ఇస్తూ… ‘‘వైకల్యం ఉన్నవాడు పైలట్‌గా పనికొస్తాడా..? ఎవరైనా అలాంటి పైలట్లను నియమించుకుంటారా..? వైకల్యం ఉన్నవాళ్లు సర్జన్లు కాగలరా..? అని ఏదో సమర్థనకు ప్రయత్నిస్తోంది…
ఆల్ ఇండియా సర్వీసు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటివి)లో ప్రధానంగా ఫీల్డ్ వర్క్ ఉంటుంది, గంటల కొద్దీ ప్రయాస, జనంలోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించాలి, ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం… అంటోంది ఆమె… తప్పు మేడమ్… ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఉండీ ఈ ఇన్‌సెన్సిబుల్ అనగా సరైన సోయిలేని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉంది… ఆఫీసు కదలకుండా, సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలు పెడుతూ టైం పాస్ చేసే ఆల్ ఇండియా సర్వీసు అధికారులు కోకొల్లలు… ఇతరత్రా ఆరోపణలూ బోలెడు…
ఓ కాలు లేకపోతే లేదా వినికిడి సమస్య గానీ మరొకటి గానీ ఉంటే వాళ్లకు అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం లేనట్టా..? మొబిలిటీ సమస్య కొద్దిగా ఉంటే ఉండవచ్చు… ఐపీఎస్ వంటి పోస్టులకు సరే, వైకల్యం అడ్డు అనుకుందాం… ఐఏఎస్‌కు స్వల్ప వైకల్యం ఏమీ అడ్డు కాకూడదు కదా… ఐనాసరే, దివ్యాంగులుగా ఉండి వృత్తిలో రాణిస్తున్నవాళ్లు బోలెడు మంది… పోనీ, ప్లానింగులో వాళ్ల జ్ఞానం పనికొస్తుంది కదా కనీసం… తమ వైకల్యాన్ని కూడా సవాల్‌గా తీసుకుని ఫీల్డుకు వచ్చి మరీ వర్క్ చేస్తున్నవాళ్లూ ఉన్నారు… అలాంటివాళ్లను కించపరిచే వ్యాఖ్యలు, అంటే వాళ్లను తక్కువ చేసే వ్యాఖ్యలు స్మిత సభర్వాల్ నుంచి రావడం ఆశ్చర్యకరం… వైకల్యం అనేక రకాలు..!!
Share this Article