ఖైదీ అనే చిరంజీవి సినిమా… సుమలతతో ఒక విలనుడు ‘నమస్కారం’ అంటాడు… కాస్త కంఫర్టుగానే కట్టేయబడి ఉన్న ఆమె ‘సంస్కారం లేనివాళ్లకు నమస్కారం దేనికిలే’ అని ఈసడిస్తుంది… అంటే ఇక్కడ సంస్కారం లేనిదెవరికి..? ఏమని ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలి..? అలాగే చాలా పాపులర్ డైలాగ్ మరొకటి… ఓ మగ అహంకారి, ఓ ఆడ అహంకారి ఎదురుపడతారు… ఎవరికీ ఎవరు దారినివ్వరు… చివరకు మూర్ఖులకు నేను దారి ఇవ్వను అంటాడు వాడు… నేను ఇస్తాను అని పక్కకు జరుగుతుంది ఆడ లేడీ… హహహ అని నవ్వుతూ తలెగరేస్తాడు వాడు… వాడే మూర్ఖుడయ్యాడు అనే సంగతి బహుశా ఇప్పటికీ తెలిసి ఉండదు వాడికి…
ఇదంతా ఎందుకు అంటే..? కొన్ని డైలాగులు మనకే ఎదురు తంతాయనే సోయి లేకపోవడం… ఇండియా ప్రస్తుత టాప్ హీరోయిన్ దీపిక పడుకోన్‌కు ఓ నెటిజెన్ మీద మస్తు గుస్సా వచ్చేసింది… విషయం ఏమిటనగా..? గెహరాయియా అని ఓ సినిమా చేస్తోంది ఆమె… థియేటర్లలో విడుదల చేయాలి, కానీ దానికి పరిస్థితులు అనుకూలంగా లేవు… నిర్మాత కరణ్ జోహార్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నాడు… ఫుల్ ప్రమోషనల్ యాక్టివిటీ జరుగుతోంది… అయితే దీపిక డ్రెస్సింగు తీరు పట్ల నారాజ్ ఉన్న ఓ ఫ్యాన్ ‘‘రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ఆమె బట్టలు కురచ అయిపోతున్నయ్… ఇది న్యూటన్ బాలీవుడ్ సూత్రం’’ అని వెక్కిరించాడు…
Ads
తను మరిచిపోయింది ఒక్కటే… ఇండియన్ లేడీ సెలబ్రిటీల అందం, నటన, పాత్ర, సినిమాల మీద ఏమైనా రాసుకొండి, పెద్దగా ఫరక్ పడదు… కానీ అనసూయ దగ్గర నుంచి దీపిక పడుకోన్ దాకా వాళ్ల బట్టల మీద కామెంట్స్ రాయొద్దు… ఫుల్ ఫైర్ అయిపోతారు… అందుకే దీపికకు కోపమొచ్చింది… ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తి నెట్ పేరు ఫ్రెడ్డీ బర్డీ… అసలు పేరు ఫ్రెడ్డీ దిన్షా బర్డీ… ఢిల్లీ కేంద్రంగా ఓ అడ్వర్టయిజ్ కంపెనీ ఉంది… బోలుడు సంవత్సరాల పాటు ‘కాపీ రైటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు పొందినవాడు… ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది… యాడ్, మార్కెటింగ్ సర్కిళ్లలో పెద్ద పేరుంది… సో వాట్… తన బట్టల మీద ఏమైనా అంటే ఊరుకోదు కదా దీపిక… నిజానికి ట్రోలింగ్‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోదు తను, కానీ ఇక్కడ వెంటనే రియాక్టయింది…
‘’సైంటిస్టులు న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లతో కూడిన ప్రపంచం అంటారు, కానీ మూర్ఖుల గురించి మరిచిపోయారు’’ అని రిప్లయ్ ఇచ్చింది… అంటే ఇక్కడ మూర్ఖులు ఎవరు..? న్యూటన్ సూత్రం చెప్పిన బర్డీయా..? దీపికా..? నిజానికి బర్డీకి బుద్ధి లేదు… ఆ సినిమాలో దీపిక సహనటుడు సిద్ధాంత్‌తో బోలెడు ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది… పెళ్లయింది, ఇంకా ఇవేం వేషాలే దీపిక అంటూ నెటిజన్లు నెగెటివ్‌గా రియాక్టవుతున్నారు కూడా… ప్రమోషనల్ ప్రోమోలో కూడా వేల ముద్దులు, హగ్గులు, పీలికల డ్రెస్సులు ఎట్సెట్రా…
చూడబోతే సినిమా ఏ ట్రిపుల్ ప్లస్ కేటగిరీలా కనిపిస్తోంది… మరి అవన్నీ విడిచిపెట్టి జస్ట్, ప్రమోషనల్ షూట్లకు కురచ బట్టలతో వస్తే దాన్ని తప్పుపట్టాడు బర్డీ…ఈ రెచ్చిపోయిన సీన్లు చూసి, ఈ టీజర్ చూసి నీ భర్త రణవీర్ ఏమీ అనలేదా అనడిగితే… ‘‘నో, నో, ఆయన మెచ్చుకున్నాడు, బాగా నచ్చింది అన్నాడు…’’ అని జవాబు చెప్పింది దీపిక ఓ జర్నలిస్టుకు… అర్థమైంది కదా… మరి నీకెందుకురా బర్డీ… ఆయ్ఁ….
Share this Article