భూమా అఖిలప్రియ చేసిన తప్పేమిటి..? ఇదీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైన చర్ఛ… అందరికీ తెలుసు… మొదట్లో వైఎస్ అనే పెద్దమనిషి భూమా నాగిరెడ్డి అనే ఓ రియల్ దందా పొలిటిషియన్‌కు మద్దతునిచ్చాడని..! ఏవీ సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు… వైసీపీలో చాలామంది పెద్దలకు, ప్రత్యేకించి సలహాదార్లకు శ్రేయోభిలాషులు… ఓ దశలో చుట్టరికాలు, వియ్యాలు కూడా… హైదరాబాద్ భూములపై గద్దలు, పడగ నీడలు… ఇందులో దాపరికం ఏమీ లేదు… నాగిరెడ్డి ముఠాలు తుపాకులు చేతబట్టి సెటిల్మెంట్ల పేరిట భూముల్ని స్వాహా చేస్తూ, కబ్జా చేస్తూ… చెలరేగిన కాలం చూశాం…
తరువాత ఆ స్థానంలోకి కొత్త గద్దలు వచ్చాయి… టీఆర్ఎస్ ప్రభుత్వ అండతో చెలరేగిపోతూ, ప్రభుత్వ భూముల్ని స్వాహా చేస్తూ… వేగంగా కోట్ల మెట్లు ఎక్కిన ఘనులు… తెలంగాణ స్వరాజ్యం వచ్చాక వచ్చిన మార్పు ఏమిటయ్యా అంటే హైదరాబాద్ భూములు వేగంగా ప్రైవేటుపరం కావడం..! ఇప్పుడు మళ్లీ అఖిలప్రియ ఇష్యూ వచ్చాక ఇది చర్చలోకి వస్తుంది ప్రబలంగా, ప్రముఖంగా…
Ads
రాజకీయంగానే కాదు, ఇలాంటి వ్యవహారాల్లోనూ అఖిలప్రియ భూమా నాగిరెడ్డికి అసలు సిసలు వారసురాలు… నయీం ఎన్కౌంటర్ కాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో… అంతకుముందు చెలరేగిన రాయలసీమ ముఠాల్ని కంట్రోల్ చేసి పింక్ గరుడపక్షులు చెలరేగిపోయాయి… మరి వాళ్ల సర్కారే కాబట్టి బయటపడవు… పోలీసు, మీడియా ఎట్సెట్రా పింక్ ముఠాల కంట్రోల్లోకి వచ్చేశాయి… సహజంగానే తెలంగాణ పెద్దసారుకు ఇవేవీ పట్టవు కదా…
నిస్తేజంగా మారిపోయిన ప్రజాస్వామిక వ్యవస్థలు పుణ్యమాని… హైదరాబాద్ పూర్తిగా కేసీయార్ బంధువులు, అనుచరుల పరమైంది అనుకుందాం… మరి అఖిలప్రియ వంటి నేతలు కాస్త వెనుకా ముందూ చూసుకోవాలి కదా… చివరకు ఆమె పెళ్లిచేసుకున్న సోకాల్డ్ భర్తగారు కూడా అదే టైపు… మొదట్లో వైఎస్… తరువాత చంద్రబాబు… ఫుల్ సపోర్ట్… అసలు హైదరాబాద్‌లో వేల కోట్ల ప్రాపర్టీలు టీఆర్ఎస్ మద్దతుదారుల చెరలోకి వెళ్తున్న సంగతి తెలుసుకోవాలి కదా… మామూలు విషయాల్లో పెద్దగా ఏమీ పట్టించుకోని తెలంగాణ పోలీసులు ఇలాంటి విషయాల్లో ప్రపంచంలోకెల్లా అత్యంత నైపుణ్యాల్ని ప్రదర్శిస్తారని అర్థం చేసుకోవాలి కదా… అక్కడొచ్చింది తేడా…
ఇక్కడ చెప్పదలిచింది టీఆర్ఎస్ నేతల భూదందాల గురించి కాదు… ఫాఫం, బొచ్చెడు ఖర్చులు… ఈ దందాలు చేయకపోతే వాళ్లకు మాత్రం డబ్బులెలా వస్తాయి..? అసలు హైదరాబాద్ రాజకీయం అంటేనే సెటిల్మెంట్లు, భూదందాలే కదా… అర్థం చేసుకోవాలి మనం… కానీ అఖిలప్రియకు అర్థం కాలేదు…
సహజమైన రియల్ దందాల తరహాలోనే కిడ్నాపులతో ఇష్యూ సెటిల్ అవుతుందీ అనుకుంది… నయీం వంటి కఠోర కరోడానే ఇలాంటి ఇష్యూలే కడతేర్చింది ఇక్కడి సర్కారు… ఆఫ్టరాల్ అఖిలప్రియ, అందులోనూ చంద్రబాబు మనిషి… అందుకే కొట్టింది దెబ్బ… గంటల్లోనే…! టీఆర్ఎస్ ఇంట్రస్టు ఉన్న ఇష్యూల్లో గంటలు కాదు, నిమిషాల్లో ప్రతిస్పందించి, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించగలదు తెలంగాణ పోలీసు…
ఇప్పుడు… అయ్యో, ఆమే గర్భవతి, బెయిల్ దొరుకుతుందో లేదో అని కన్నీళ్లు కారుస్తున్నాడు ఆంధ్రజ్యోతి వాడు… తన వెబ్ సైటులో… హహహ…
నిజానికి ఇక్కడ చెప్పదలుచుకుంది వేరే ఉంది… అఖిలప్రియ చంద్రబాబు సర్కారులో మంత్రి… ఇప్పటికీ అదే క్యాంపు… అయినా సరే, పేకాటపేకాటే అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఆమె అరెస్టు వార్తను, దాని వెనుక నేపథ్యాన్ని కుమ్మిపారేసింది ఆంధ్రజ్యోతి… నిజంగా అభినందనీయం… ఈనాడు కూడా దాదాపు సేమ్…. ఎటొచ్చీ సాక్షి అనే దిక్కుమాలిన పత్రిక కవరేజీ విచిత్రం… ఏదో రాశాంలే అన్నట్టుగా రాసింది… ఎందుకబ్బా..? జగన్‌కు ఆమె మీద ఎందుకంత అభిమానం ఇప్పుడు..? పైగా కేసీయార్ బంధువుల ఇష్యూ… కేసీయార్‌కు ఎంత కోపం రాకపోతే ఆమెను తీసుకుపోయి జైళ్లో పారేస్తారు..? ఐనాసరే, కేసీయార్ జాన్ దోస్త్ జగన్ ఈ అఖిలప్రియ మీద ఇంకా ఎందుకు అభిమానం ప్రదర్శిస్తున్నాడు..? బోలెడు మిస్టరీలు… మరి వందలు, వేల కోట్ల ప్రాపర్టీలు కదా… కుమ్మేయండి బాస్… లక్షల కోట్లకు ఎదగండి… డెమోక్రసీని శాసించండి… అంతే… ఎక్కడో చదివాను, అఖిలప్రియ పులికడిగిన ముత్యంలా బయటికొస్తుంది అన్నాడట లోకనాయకుడు, అదేనండీ లోకేష్… అయ్యా, మీ మద్దతుదారులు అంతా ఇదే టైపు… ఆ ముత్యాలకు ఇప్పుడు గ్రహచారం బాగాలేదు, అసలు మీ గ్రహచారమే ఎదురుతన్నబోతోంది… జాగ్రత్త….
Share this Article