Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లైగర్ దెబ్బకు ఫాఫం చార్మి కాదు… ఫాఫం రష్మిక… ఇంకా ఏడిపించకండి…

October 7, 2022 by M S R

రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో దాదాపు ఒకేసమయంలో కనిపించారట… ఇంకేముంది..? ఇద్దరూ కలిసి మాల్దీవులకు రొమాంటిక్ టూర్ ప్లాన్ చేశారు… ఎంచక్కా చెక్కేశారు… ఈ చెట్టపట్టాల్ పెళ్లి దాకా దారితీస్తాయా..? అంటూ నానా కథనాలు కుమ్మేసింది బాలీవుడ్ గాసిప్స్ మీడియా… ఇప్పుడు ఆదిపురుష్ పంచాయితీ మీద వాళ్లకు ఇంట్రస్టు లేదు… ఈ ఇద్దరు సౌత్ నటీనటుల రొమాన్స్ మీద కన్నేశారు…

నిజానికి వెళ్తే వెళ్లారు… సో వాట్..? వాళ్లిద్దరూ ప్రేమపక్షులే… బహిరంగంగా చెప్పరు… కానీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు… ప్రత్యేకించి టాలీవుడ్‌లో బాగా తెలుసు… ఆమె ఆల్‌రెడీ బ్రేకప్ బాధితురాలు… పెళ్లి ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా పెళ్లి రద్దయింది… రక్షిత్ శెట్టి కూడా ఎస్టాబ్లిష్డ్ హీరోయే… కానీ శృతి కలవలేదు ఇద్దరికీ… నాలుగేళ్లుగా ఒంటరి పక్షే… ఏదో సినిమా షూటింగులో దగ్గరితనం మొదలైంది…

ఆమె ఎప్పుడు చూసినా గలగల నవ్వుతూ కనిపిస్తుంది… మాట్లాడుతుంది… చేతిలో మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది… తెలుగే కాదు, హిందీ, తమిళం కూడా… పుష్ప సినిమా ఆమె డిమాండ్‌ను విపరీతంగా పెంచింది… వాస్తవానికి లైగర్ సినిమా డిజాస్టర్‌తో చార్మి లబోదిబో శోకాలు పెట్టింది… ఓరి దేవుడోయ్, ఇన్నేళ్లు ఏవేవో వేషాలు వేసి సంపాదించిన డబ్బంతా పోయింది, ఇంకేం చేయాలిరా దేవుడోయ్ అని రాగాలు తీసింది… అసలు అలా శోకాలు పెట్టాల్సింది రష్మిక…

Ads

rashmika

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డబ్బేమీ పెట్టలేదు… ఏవో రెండు సినిమాలకు అంతకుముందు ఫైనాన్స్ చేసి, చేతులు కాల్చుకున్నాడు… కరోనా టైమ్‌లో కాస్త జనానికి ఖర్చు పెట్టాడు… రష్మిక తన సంపాదనంతా విజయ్‌కు ఇస్తూ వస్తోంది… ఒక దశలో ఫోర్బ్స్ జాబితాలో కనిపించిన విజయేనా అనిపించింది తరువాత దశలో… సొంత ఇల్లు కొన్నాను అన్నాడు, ఫోటోలు మీడియాకు ఇచ్చాడు… ఇప్పుడు అందులో ఉంటున్నాడా..? ఏమైంది ఆ ఇల్లు..? ఆ రుణం ఏమైంది..? రష్మికే చెప్పాలి…

లైగర్ దెబ్బ నిజానికి విజయ్ మీద నేరుగా పడకూడదు… కానీ తీసుకున్న రెమ్యునరేషన్ ఏమైందో తెలియదు… తీరా సినిమా డిజాస్టర్ అయ్యాక కొన్ని కోట్లను వాపస్ ఇచ్చాడు… మళ్లీ బ్యాలెన్స్ షీట్ చూస్తే సోసో… ఇదీ రష్మికకు చిరాకెత్తుతోంది… తన సంపాదనను జాగ్రత్తగా తనే ప్లాన్ చేసుకుని, ఇన్వెస్ట్ చేస్తే బాగుండేదనే సోయి వచ్చేలోపు తన చేతులూ ఖాళీ… ఇప్పుడు విజయ్‌కు ఖుషీకి రెమ్యునరేషన్ అడ్వాన్స్, రష్మికకు ఏదో హిందీ సినిమా డబ్బు వచ్చింది… కాస్త ఆనందంగా ఉంది జంట… మళ్లీ కాస్త ధనకళ కనిపిస్తున్నట్టుంది…

కాస్త ఈ లౌకిక బంధనాల్ని వదిలించుకుని, నాలుగు రోజులు మాల్దీవుల్లో గడపాలని నిజంగానే వెళ్తే గుడ్, గో ఎహెడ్, ఆల్ ది బెస్ట్ అనాల్సిందే… అక్కడికి వెళ్లేసరికి ఇంకెక్కడి నుంచో పూరి, చార్మి అక్కడకి వచ్చి ఉంటారు… మాల్దీవుల్లో ఇండస్ట్రీ కెమెరాలు నాట్ అలోడ్… లేకపోతే మాల్దీవుల నుంచి మా ప్రతినిధి ఇలా చెబుతున్నారు అంటూ రోజూ ఎన్నెన్ని జంటల్ని బజారున పడేసేవాళ్లో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!
  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
  • ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
  • అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
  • పోలీసులది క్రౌర్యమే, తప్పే… మరి రౌడీ షీటర్లకు రాజకీయ ఓదార్పు..!?
  • ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions