Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్? జైనాబ్ అఖిలకన్నా పెద్దదే! మళ్లీ పిచ్చి ట్రోలింగ్ షురూ!!

July 27, 2026 by M S R

.

ఏమిటో ఈ ట్రోలింగు… ఐనదానికీ కానిదానికీ… అఖిల్ అక్కినేనిని నినమొన్నటిదాకా అందరూ నష్టజాతకుడే అని చిన్నచూపు చూశారు… ప్రతి సినిమా ఫ్లాప్… పదేళ్ల క్రితం శ్రేయా భోపాల్ ఎంగేజ్‌మెంట్ అయ్యీ పెళ్లిలోపే బ్రేకప్… ఇప్పటికీ తను అమెరికన్ పౌరుడే… నటనలో ఇంకా చాలా దూరం ప్రయాణించాలి…

కానీ రీసెంట్ లెనిన్ పర్లేదు, కష్టపడ్డాడు, పెట్టిన డబ్బులొస్తాయి, ఫ్లాప్ కాదు, ఆ ఆనందంలో ఉన్నాడు… ఇప్పుడు మళ్లీ తన భార్య జైనబ్ మీద ట్రోలింగ్… ఆమె మతం, ఆమె తనకన్నా చాలా పెద్దది… సో వాట్, వాళ్లేమైనా చిన్న పిల్లలా..? అన్నీ తెలిసే కదా, కొన్నాళ్ల ప్రణయం తరువాతే కదా పెళ్లి చేసుకున్నది… మరి నడుమ ఈ నెటిజనం సమస్య ఏమిటి..?

Ads

  • అసలు అక్కినేని మగ వారసులందరి పెళ్లిళ్లూ ఓ సమస్యే… నాగార్జున మొదటి భార్య రామానాయుడి బిడ్డ లక్ష్మి దగ్గుబాటి… రెండు బడా సినిమా కుటుంబాల వియ్యం… కానీ నిలవలేదు… విడిపోయారు, తరువాత అమలతో పెళ్లి… ఆమె తల్లి ఐరిష్ (క్రిస్టియన్), తండ్రి ముఖర్జీ (బెంగాలీ బ్రాహ్మిణ్)… సో వాట్, ఇన్నేళ్లుగా హాయిగా కలిసి ఉన్నారు…కానీ సుమంత్‌కు అప్పుడెప్పుడో నటి కీర్తిరెడ్డితో పెళ్లి, అదీ పెటాకులు… ఈరోజుకూ ఒంటరిపక్షే… చైతూ- సమంత పెళ్లి అందరికీ తెలిసిన యవ్వారమే… వీరి పెళ్లి హిందూ- క్రిస్టియన్ వేర్వేరు సంప్రదాయాల్లో జరిగింది… తరువాత కొన్నాళ్లకు గొడవలు, సమంత వెళ్లిపోయింది,, ఈ పెళ్లీ పెటాకులే, తరువాత శోభితను చేసుకున్నాడు తను…

ఒక ఫ్రస్ట్రేటెడ్ స్టేజ్‌లో ఉన్న అఖిల్‌కు జైనబ్ ఎక్కడ పరిచయమో తెలియదు గానీ… పరస్పరం అర్థం చేసుకోవడానికి చాన్నాళ్లు వెయిట్ చేశారు… పెళ్లి చేసుకున్నారు, అప్పటి నుంచీ ట్రోలింగే… లెనిన్ సక్సెస్ తరువాత మళ్లీ షురూ… అతడికన్నా ఆమె 9 ఏళ్లు పెద్ద… సో వాట్… సంసారం చేసేది అతడు… వాళ్లకు తెలియదా..? తెలిసీ జతకలవడానికి ఇష్టపడ్డారు… ఎందరు లేరు..? సినిమా, క్రికెట్ సెలబ్రిటీలలో ఎందరు లేరు..? ఉంటే ఏమిటి..?



నెట్‌లో ఆమె పేరుతో ఒక ప్రొఫైల్ ఉంటుంది… ఆమె అప్పుడెప్పుడో మీనాక్షి అనే సినిమా చేసింది… అదొక్కటే సినిమా… ఇక ఏ వివరాలూ ఉండవు… కానీ 2004లో సినిమా అంటే ఇప్పటికి 22 ఏళ్లపైనే కదా… అవును, 39 ఏళ్లు… ఆమే ఈమె..,

zainab

అఖిల్ చేసుకోబోయే అమ్మాయి ఆర్టిస్టు… ఆమె తండ్రి జుల్ఫీ కూడా ఆర్టిస్ట్ కం బిజినెస్ మాన్… గతంలో ఈ ఫ్యామిలీకి ఓడియన్ థియేటర్ ఉండేది… హైదరాబాదులో కూడా గతంలో రిఫ్లెక్షన్స్ పేరిట కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో అప్పట్లో ఆమె ఓ పెయింట్ ఎగ్జిబిషన్ కూడా పెట్టింది…

ఎక్కువగా మోడరన్, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్ వేస్తుంది… ప్రియాంక గాంధీకి తన పొర్ట్రెయిట్ చిత్రించి బహూకరించినట్టు ఓ వార్త చదివినట్టు గుర్తు… ఎక్కువగా ముంబైలో ఉంటుంది… చాలా లోప్రొఫైల్… ఎక్కువగా దుబాయ్, లండన్, ఇండియాల మధ్య సంచారం… అఖిల్‌తో ఎలా పరిచయమనేదీ గోప్యమే… తన గరల్ ఫ్రెండే… అప్పట్లో అంటే 2016లో శ్రియా భోపాల్‌తో నిశ్చితార్థం జరిగాక, పెళ్లి గాకముందే బ్రేకప్…

ఆ తరువాత ఈమె పరిచయం అయినట్టుంది… ఆరేడేళ్లుగా ఇద్దరి మధ్య ప్రణయం అట…ఇంతకుమించి ఆమె వివరాలు ఎవరికీ తెలియవు… అక్కినేని కుటుంబం కూడా ఆమె వివరాల వెల్లడికి విముఖంగా ఉన్నట్టుంది… (బహుశా ఆర్ట్ గ్యాలరీలతో పరిచయం ఉన్నవాళ్లకు ఆమె గురించి తెలిసి ఉంటుంది…)

  • ఆమె తండ్రి జుల్ఫీ రావుద్దీ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేశారు. ఆయన ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. ఇక ఆయన కుమారుడు జైన్ రావుర్జీ ZR Renewable Energy Pvt Ltd సంస్థకు చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు. రావుర్జీ హైదరాబాద్ లోనే ఉంటాడు… మరి నాగార్జున రేంజ్ కు తగిన మ్యాచ్ కదా… తొక్కలో ఏజ్ గ్యాపుదేముంది..?

zainab



ఆమె తనకన్నా 9 ఏళ్లు పెద్ద… ఓసారి మనకు తెలిసిన ఇలాంటి ఏజ్ గ్యాప్ (భర్తకన్నా భార్య పెద్దది) పెళ్లిళ్లను చూద్దాం ఓసారి… క్రికెట్ రంగంలో…

  1. సచిన్ టెండూల్కర్ – అంజలి: ‘క్రికెట్ దేవుడు’గా పిలువబడే సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి తనకంటే దాదాపు 6 సంవత్సరాలు పెద్దది.

  2. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ కంటే కొన్ని నెలలు చిన్నవాడు.

  3. జస్ప్రీత్ బుమ్రా – సంజన గణేశన్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు. సంజన వయసు బుమ్రా కంటే సుమారు రెండున్నర సంవత్సరాలు ఎక్కువ.

  4. శిఖర్ ధావన్ – అయేషా ముఖర్జీ: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. అయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నారు (ప్రస్తుతం వీరు విడిపోయారు). అయేషా వయసు ధావన్ కంటే దాదాపు 10 సంవత్సరాలు పెద్దది.

  5. అనిల్ కుంబ్లే – చేత్నా: భారత మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే భార్య చేత్నా ఆయనకంటే రెండు సంవత్సరాలు పెద్దది.

సినిమా రంగానికి చెందినవారు:

  1. ధనుష్ – ఐశ్వర్య: ప్రముఖ సౌత్ ఇండియన్ హీరో ధనుష్, రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు (విడాకులు ప్రకటించారు). ఐశ్వర్య వయసు ధనుష్ కంటే ఒక సంవత్సరం పెద్దది.

  2. అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్: బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల వివాహం జరిగింది. ఐశ్వర్య రాయ్ వయసు అభిషేక్ బచ్చన్ కంటే రెండు సంవత్సరాలు పెద్దది.

  3. ఫరా ఖాన్ – శిరీష్ కుందర్: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తనకన్నా వయసులో చిన్నవాడైన ఫిల్మ్ ఎడిటర్, డైరెక్టర్ శిరీష్ కుందర్‌ను వివాహం చేసుకుంది. ఫరా ఖాన్ కంటే శిరీష్ కుందర్ 8 సంవత్సరాలు చిన్నవాడు (అంటే ఫరా ఖాన్ పెద్దది).

  4. సైఫ్ అలీ ఖాన్ – అమృతా సింగ్ (మొదటి భార్య): సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయసు ఆయనకంటే దాదాపు 12 సంవత్సరాలు పెద్దది (వీరు తరువాత విడాకులు తీసుకున్నారు).

  5. ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. నిక్ జోనాస్ కంటే ప్రియాంక చోప్రా 10 సంవత్సరాలు పెద్దది… సో, ఏజుదేముంది బ్రదర్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాడలేను అన్న పాటకే… జాతీయ పురస్కారం అందుకున్న నైటింగేల్!
  • సో వాట్? జైనాబ్ అఖిలకన్నా పెద్దదే! మళ్లీ పిచ్చి ట్రోలింగ్ షురూ!!
  • ప్రధాని మోడీ ఈ మూడో దఫా పదవీకాలం పూర్తి చేయగలడా..?!
  • ఇప్పుడంటే బొద్దింకలు ! ఈ ‘జెంటిల్‌మేన్’ ఎప్పుడో చర్చించాడు !!
  • గౌరీ ప్రియ ! ఇకపై పాత్రల ఎంపికే ముఖ్యం – పొరపడితే వైష్ణవి కథే !!
  • అత్తింటి అపోలోఉండగా… కోయంబత్తూరు ఎందుకు రాజా..!!
  • తొండలు కాదు, ఆగిన గుండెకు అండగా ! రేవంత్ ‘పెద్ది’ పరిణతి !
  • మగ హోస్టులకే ఈటీవీ ప్రాధాన్యం! రష్మి- ఇంద్రజలకు కత్తెర !!
  • కాదు, నేనిప్పుడు బిచ్చగాడిని కానే కాదు – ఆ రోజులకు ఏనాడో స్వస్తి !
  • కాకినాడ ప్రజా వైద్యుని పరిశోధనకు మరో అంతర్జాతీయ గుర్తింపు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions