ఒక వార్త… దాని సారాంశం ఏమిటంటే..? జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ కుట్రలకు పాల్పడుతున్నారు, దేవర సినిమాపై కావాలనే నెగెటివ్ చేస్తున్నారు, దేవర ప్రోమోకు చాలా త్వరగా లక్ష లైక్స్ వచ్చాయి, కానీ తర్వాత 60 వేలకు పడిపోయింది…
కావాలనే కొందరు బాట్స్ (మెషిన్ జనరేటెడ్, ఆపరేటెడ్) ప్రయోగిస్తున్నారు, బాట్స్ ఆపరేటెడ్ అని తెలిసి ఎక్స్ వాటిని తొలగించింది, కావాలనే జూనియర్‌పై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కొత్తేమీ కాదు, ప్రభాస్ మీద కూడా ఇలాగే జరిగింది…
హమ్మయ్య, ఇదీ వార్త… పచ్చకూటమి అనగానే సోకాల్డ్ పవన్ ఫ్యాన్స్, జూనియర్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్, ఎట్సెట్రా ఆల్ యాంటీ- జగన్ ఫోర్సెస్ అన్నీ ఒక్కటైపోవు… మెగా ఫ్యామిలీ అనగానే బన్నీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ ఒక్కటైపోరు… ఎవరి యవ్వారం వాళ్లదే… యెల్లో కూటమి జస్ట్, రాజకీయాల కోసం మాత్రమే… హీరోల ఫ్యాన్స్ పోరాటాలు వేరు, ఇది రియాలిటీ…
Ads
మొన్న చూశాం కదా, ఎప్పటిలాగే నాగబాబు ఏదో పగోడు, పరాయోడు అని ఏదో కూసేసరికి బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు, ఆ దెబ్బకు ఓ దశలో నాగబాబు తన ట్వీట్ ఖాతానే డియాక్టివేట్ చేసుకున్నాడు, తరువాత రీఎంట్రీ ఇచ్చి, బాబోయ్ ఆ ట్వీట్ డిలిట్ చేశానురోయ్ అని మొరపెట్టుకోవాల్సి వచ్చింది… సో, హీరోల ఫ్యాన్స్ నడుమ సోషల్ పోరాటాలు వేరు… వాటికి లెక్కాపత్రం ఏమీ ఉండవు…
ఎస్, ప్రోమాలు, టీజర్లు, ట్రెయిలర్లు, గ్లింప్స్, ఫస్ట్ ఆడియో రిలీజ్, ప్రిరిలీజ్ ఫంక్షన్లు తదితర వీడియోలకు సోషల్ మీడియాలో, ప్రత్యేకించి యూట్యూబులో విపరీతంగా లైక్స్ వచ్చేలా చేయడం కూడా ఓ దందా… డబ్బులతో వ్యవహారం… ప్రత్యేక టీమ్స్ పనిచేస్తుంటాయి… వాటిని చూపి ఆ హీరోకు, ఆ సినిమాకు హైప్ క్రియేట్ చేయడం ఓ ఉద్దేశం… ఏమో, వాటిని చూసి ఓటీటీ రైట్స్, శాటిలైట్ టీవీ రైట్స్ ఎక్కువ రేటు పలుకుతాయనే భావన కావచ్చు…
లైక్స్ ఓ దందా ఎప్పుడైందో, డిస్ లైక్స్ కూడా దందా అవుతుంది కదా సహజన్యాయ సూత్రాల ప్రకారం… ఎస్, అదే జరుగుతోంది… స్ట్రాటజిక్‌గా మనకు పడని హీరో ప్రోమో రిలీజ్ కాగానే మన బాట్స్ ద్వారా ఎడాపెడా లైకుల సంఖ్యను పెంచేయడం, తర్వాత బాట్స్ లైక్స్ తీసేసేసరికి ఆ సంఖ్య హఠాత్తుగా పడిపోయి, హీరోకు చెడ్డపేరు వస్తుందనేది ఈ భావన…
సరే, జూనియర్ విషయంలో అదే జరిగి ఉంటుంది… జరగదు అని చెప్పడానికి లేదు, సినిమా ప్రమోషన్లు- ఫ్యాన్స్ పోరాటాల దిశలో ఇవన్నీ సహజమే… కానీ ఎవరు చేశారు..? పవన్ ఫ్యాన్సా..? ఇప్పుడు జూనియర్, పవన్ కొత్త సినిమాల నడుమ ఏమైనా క్లాష్ రాబోతోందా..? ఏమో, తెలియదు…
మొన్నటిదాకా విజయ్ దేవరకొండ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు… గతంలో ప్రభాస్ మీద… ఇప్పుడు జూనియర్ మీద… ఇవన్నీ సినిమా వ్యాపారం మీద నిజంగా దెబ్బతీస్తాయా..? వాస్తవం ఏమిటంటే… సోషల్ క్యాంపెయిన్లు సినిమాను నిలబెట్టవు, సరుకులో దమ్ముంటే ఏ వ్యతిరేక ప్రచారమూ ఏమీ చేయదు… అదే అసలు నిజం..!!
Share this Article