Gopalakrishna Cheraku….. ఇటీవల చాలా రోజుల తరువాత నా ఫ్రెండ్ ఒకరిని కలిసినప్పుడు వచ్చిన చర్చ ! ..డిజిటల్ మీడియా రంగంలో సీనియర్‌గా ఉన్న తను ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో ఉన్నాడు.. అప్పటికే నా ఫోన్‌లో చాలా మంది ఓ సంఘటన గురించి ఒకేలా పోస్ట్‌లు పెట్టారు… అదంతా చూసిన నాకు ఓ అనుమానం వచ్చి మావాడిని అడిగా.., ఏంట్రా అందరూ ఇదే స్క్రిప్ట్ పోస్టు చేస్తున్నారు .. ఫొటోలో కూడా అవే ఉన్నాయి, ఏంటి అని అడిగా… ఓ నవ్వు నవ్వి … ఇది డ్రైవ్ క్యాంపైన్ ..ఓ రోజంతా ఇలానే ఉంటాయి పోస్టులు అన్నాడు… డ్రైవ్ ఏంట్రా అంటే .., ట్రోలింగ్ క్యాంపైన్ కూడా ఉంది చూస్తావా అంటూ కొన్ని చూపించాడు…
ఇలా అసలు సోషల్ మీడియాని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎలా వాడుతున్నాయో అని మావాడు నాకు చెప్పిన మాటలు విని కళ్లు బైర్లు కమ్మాయి…నిజంగా రాజకీయ పార్టీలు ఇంతలా చేస్తున్నాయా అనిపిస్తాయి ఆ మాటలు వింటే…!
ఇప్పుడు ఏపీలో గీతాంజలి అనే మహిళ సంఘటన విషయం చూస్తుంటే అవే మాటలు మళ్లీ గుర్తొచ్చాయి.. రాజకీయాల్లో ఆధిపత్యం, గెలుపు, ఆరోపణలు, విమర్శలు కామన్ … ఇవన్నీ నిజంగా జరిగిన అంశాలను బట్టి ఉంటాయి.. కానీ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని వాడటం మొదలుపెట్టాక అవసరాన్ని బట్టి ఇష్యూని క్రియెట్ చేయడం ., దాన్ని ప్రత్యర్థికి ముడిపెట్టి జనంలోకి విపరీతంగా పంప్ చేయడం మొదలైంది…కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేయడానికి .., పాత వీడియోలు వెతికేందుకు ..,టెక్స్ట్ కంటెంట్ రాసేందుకు .., గ్రాఫిక్స్ చేసేందుకు ఇలా వందల మందిని హైర్ చేసుకుని .. బయటికి కనపడని వ్యవస్థనే నడిపేస్తున్నాయి రాజకీయ పార్టీలు…
Ads
ట్రెండ్‌కి తగ్గట్టు మారడం ., సామాజిక మాధ్యమాలని వాడుకోవడం తప్పేమీ కాకపోవచ్చు .. కానీ వాటిని వాడుతున్న తీరే ప్రమాదకరంగా మారింది.. ఇప్పుడు వాట్సాప్ , ట్విట్టర్ , ఫేస్బుక్ , యూట్యూబ్, ఇలా ఏదైనా సరే రాజకీయ రంగు పులుముకున్నాయి.. కొన్ని పార్టీలు డబ్బులిచ్చి మరీ పోస్టులు పెట్టిస్తుంటే, మరికొన్ని మాత్రం యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలను వాడుకుంటున్నాయి.
ఓ వీడియోనో , ఫోటోనో దొరికితే దాన్ని ట్రోలింగ్ చేసేందుకు ఆ అంశాన్ని డ్రైవ్ చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలకూ ఉన్నాయి…ఇలా ట్రోలింగ్ పద్ధతిన అవతలి పార్టీని టార్గెట్ చేస్తూ అసలు నిజమేదో కూడా జనం పట్టించుకోలేని స్థితికి తీసుకొస్తారు…
ఇక ఎన్నికల ముందు జరిగే సోషల్ మీడియా హడావుడి చెప్పే అవసరమే లేదు… ఇదంతా అత్యంత ఖర్చుతో కూడుకున్న పనే .. కానీ ఆ ఖర్చుకి తగ్గ ఫాయిదా అన్ని పార్టీలకి దక్కుతోంది. అయితే ఈ ట్రోలింగ్ డ్రైవ్‌లో అదిష్టానం దృష్టిలో పడి ఎలివేట్ అవుతున్నవాళ్లు కొందరైతే.., నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేక మానసికంగా ఇబ్బంది పడే వాళ్లు ఎంతో మంది ఉన్నారు…
బహుశా ఇలానే గీతాంజలి కూడా ఇబ్బంది పడిందేమో… కానీ ఇక్కడ కూడా సదరు ట్రోలింగ్ డ్రైవ్ ఆగలేదు… గీతాంజలి మీ వల్లే చనిపోయింది అంటూ ఒకరిమీద ఒకరు మళ్లీ డ్రైవ్ క్యాంపైన్ స్టార్ట్ చేసుకున్నారు…. పాపం గీతాంజలి చనిపోయాక కూడా ఈ రాజకీయ పార్టీల సోషల్ మీడియా టీమ్స్‌కి డ్రైవ్ అంశంగానే మారింది… సో, ఇక్కడ అర్థం కావల్సింది ఏంటి అంటే… మనిషి ఎలా చనిపోయినా ఆ నింద తమపై పడకుండా ఉండాలన్నదే సదరు పార్టీల తాపత్రయం…
ఈ ట్రోలింగ్ డ్రైవ్‌లో ఓ మనిషి పోయినా .., మళ్లీ ఆ విషయం వీళ్లకి ఓ డైవ్ ఐటెమే తప్ప అయ్యో తప్పు చేశామా అని మారడం అంటూ ఉండదేమో ..! గోపాలకృష్ణ చెరకు
Share this Article