Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘తనే భార్యను ఓ రాత్రి తన బాస్‌తో గడపమంటాడు… అసలు ఏంటీ కథ..?’

September 26, 2025 by M S R

.

మిత్రుడు Mani Bhushan చెప్పినట్టు…. భారతి రాజావన్నీ thought provoking concepts…

అలాంటిదే ‘పుదుమై పెణ్’ సినిమా. 1983లో వచ్చిన ఈ సినిమా కథ క్లుప్తంగా… రేవతి- పాండియన్ భార్యాభర్తలు. మిడిల్ క్లాస్ కష్టాలు కన్నీళ్లు కతలు వెతలు మధ్య సంసారం సాగుతుంది.

Ads

పాండియన్ పని చేస్తున్న బ్యాంకు మేనేజర్ రాజశేఖర్ “నీ భార్యతో నన్ను గడపనివ్వు. నీ కష్టాలు తీరుస్తా” అని ఒక indecent proposal చేస్తాడు. పాండియన్ కోపంతో కొట్టి వెళ్ళిపోతాడు. తెల్లారేసరికి రాజశేఖర్ చచ్చిపోతాడు. అనుమానంతో పాండియన్ని అరెస్ట్ చేస్తారు.

ఆ తర్వాత రేవతి అటు కుటుంబాన్ని పోషిస్తూ, ఇటు భర్త కోసం న్యాయ పోరాటం సాగిస్తూ కథ నడిపిస్తుంది. చివరలో పాండియన్ నిర్దోషిగా బయటకొస్తాడు. రేవతి ఇల్లు విడిచి వెళ్లిపోతుంది.

ఎందుకు ఏమిటి అనేవి చెబితే భారతి రాజా scheme తేలిపోతుంది. YouTube లో ఉండొచ్చు, వీలయితే ఆసక్తి ఉంటే చూడండి. తెలుగులో ‘ఈ తరం ఇల్లాలు’గా డబ్ చేశారు…

.

‘పుదుమై పెణ్’ 1983లో వచ్చింది… ఇలాంటి indecent proposalతో 1988లో ఇంగ్లీషులో ఒక నవల వస్తే… దాని ఆధారంగా 1993లో అదే పేరుతో ‘Indecent Proposal’ సినిమా వచ్చింది. దీనినే తిరగేసి మరగేసి కిందేసి మీదేసి 1995లో ఒక తెలుగు సినిమా తీసినట్లు గుర్తు…
.
ఒక గ్రూపులో మిత్రులు పుదుమై పెణ్ పాట ‘కస్తూరిమానే కల్యాణ తేని కచ్చేరి పాడు’ని గుర్తు చేసుకుంటే… భారతి రాజా గుర్తొచ్చారు…
——
Ps : పనిలో పనిగా నిన్న వర్ధంతి జరుపుకున్న బాలసుబ్రమణ్ణెం తన మిత్రుడు భారతి రాజా గురించి చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి…

https://www.facebook.com/mani.bhushan.336 

సరే, ఆ మిత్రుడి పోస్టు నుంచి ఇంకాస్త విస్తరణలోకి వెళ్దాం… ఆ ఇన్‌డీసెంట్ ప్రపోజల్ కథ ఆధారంగా సీనియర్ నరేష్ హీరోగా, ఇంద్రజ హీరోయిన్‌గా వచ్చిన సినిమా పేరు ‘సొగసు చూడతరమా..?’

అఫ్‌కోర్స్, కాపీ కథలకు అవార్డులు ఇవ్వొద్దు, కానీ దీనికి నాలుగు అవార్డులు… కథ నన్నడగొద్దు… అవార్డులనేవే లాబీయింగ్‌కు లోబడి కొనుక్కునేవి కదా… ఆస్కార్ సహా…

అవునూ, ఇంతకీ ఆ ఒరిజినల్ Indecent Proposal (Hollywood, 1993) కథేమిటి..?


దంపతులు డేవిడ్ & డయానా ఆర్థిక సమస్యల్లో పడతారు… ఒక బిలియనీర్ (రాబర్ట్ రెడ్‌ఫోర్డ్) డయానాకు ఆఫర్ ఇస్తాడు: “ఒక రాత్రి నాతో గడిపితే వన్ మిలియన్ డాలర్లు”…

భర్త, భార్య ఇద్దరూ ఆర్థిక లోభంతో అంగీకరిస్తారు… కానీ ఆ తరువాత అపరాధ భావం, నమ్మకం కోల్పోవడం, విడాకులు వంటి సమస్యలు వస్తాయి… చివర్లో ప్రేమ మళ్లీ గెలుస్తుంది కానీ అనుభవం గాయంలా మిగిలిపోతుంది…

మరి సొగసు చూడ తరమా (Telugu, 1995) కథ..?

వెంకట్రావు (నరేష్), నీలిమ (ఇంద్రజ) కొత్తగా పెళ్లైన జంట. ఆర్థిక ఒత్తిడుల్లో ఉంటారు. బాస్ (ముకేష్ రిషి) నీలిమకు ఆఫర్ ఇస్తాడు: “ఒక రాత్రి నాతో గడిపితే డబ్బు”…

కానీ ఇక్కడ పెద్ద తేడా ఏమిటంటే  భర్త (నరేష్) స్వయంగా తనే తన భార్యను ఆ ప్రపోజల్‌కి అంగీకరించమని ఒత్తిడి చేస్తాడు… ఈ కారణంగా భార్యాభర్తల మధ్య ఘర్షణ తీవ్రమవుతుంది…

క్లైమాక్స్‌లో నీలిమ తన గౌరవాన్ని కాపాడుకుంటుంది… భర్త తన తప్పును అర్థం చేసుకుని, వారి బంధం మళ్లీ బలపడుతుంది…

పోలికలు….
ప్రధాన సమస్య… డబ్బు కోసం భార్యను ధనవంతుడికి ఒక రాత్రి ఇవ్వడం Vs డబ్బు కోసం భార్యను బాస్‌‌తో గడపాలని భర్త ఒత్తిడి చేయడం…

ఒరిజినల్‌లో భార్య భర్తతో కలిసి ఆ ప్రపోజల్ అంగీకరిస్తుంది… కానీ తర్వాత పశ్చాత్తాపం…  కానీ తెలుగులో గుణశేఖర్ ఇదంతా యాంటీ సెంటిమెంట్ అవుతుందనే భయంతో కథలో మార్పులు చేశాడు… మొదట భర్త ఒత్తిడితో అంగీకరించబోతుంది, కానీ చివరికి తిరస్కరిస్తుంది…

సాంస్కృతిక వ్యత్యాసం… పాశ్చాత్య దృక్పథంలో శారీరక సంబంధం చూపించబడుతుంది ఒరిజినల్‌లో… తెలుగు కథలో మాత్రం భారతీయ నైతిక విలువలతో – చివరికి ఆచారం, గౌరవం గెలుస్తాయి… తప్పదు, లేకపోతే ప్రేక్షకులు మరీ తన్ని తగలేస్తారు కాబట్టి..!

Indecent Proposal లో మానవ లోభం, నమ్మక ద్రోహం ప్రధానాంశాలు… సొగసు చూడ తరమాలో మాత్రం భారతీయ దాంపత్యం, ఆత్మగౌరవం, భర్త తప్పు – భార్య గెలుపు అనే కోణం బలంగా ఉంటుంది… మరి తమిళ పుదుమై పెణ్ సినిమా సంగతి..? తెలియదు..!! ఇప్పుడిక యూట్యూబులో చూడాలి..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions