From… షేక్ కరీం fB wall….
బిగ్ బాస్ కథను మార్చేసిన సయ్యద్ సోహెల్
- విజేత కాకపోయినా హృదయాలను గెలిచాడు. టీవీ చూస్తున్న వారు ఉద్వేగానికి గురయ్యేలా చేశాడు.
- చివరికి బిగ్ బాస్, నాగార్జునను సైతం షాక్ కు గురి చేశాడు. స్నేహితులకు అతను ఇచ్చే ప్రాధాన్యం గురించి నలుగురూ నమూనాగా చెప్పుకునేలా చేశాడు.
- వేదిక మీద ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సహా నాగార్జున సైతం అతని నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు.
- నాగార్జున ఏకంగా పైకి ఎత్తేసి మరో రూ.10 లక్షల ను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ తెలుగు నాలుగో సీజన్ ఫినాలే బిగ్ బాస్ షో చరిత్రలో సరికొత్త అధ్యాయం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
- హీరోగా సినిమా తీయడం కల అంటుంటాడు సోహెల్. ఒక అలా జరిగి సినిమా హిట్ అయినా ఇంతలా పేరు వచ్చేది కాదు అనుకుంటా.
- అసలు ఏమి జరిగిందో మరింతగా తెలుసుకుందాం.
కథ వేరే ఉంటది.. కథ వేరే ఉంటది.. అంటుంటే తన కథ ఏమో అనుకున్నా.. కానీ బిస్ బాస్ కథను ఇలా మార్చేస్తాడు అనుకోలేదు. వాస్తవానికి బిస్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న విజేత గురించి రాద్దామని అనుకున్నా.. కానీ టాప్ 3 గా బయటికి వచ్చేసిన సయ్యద్ సొహెల్ గురించి రాయాల్సి వచ్చింది. నిజంగా అతను చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బిగ్ బాస్ చరిత్రలో న భూతో న భవిష్యత్ గా నిలిచింది. ఇంటి లోపల డబ్బు తీసుకోవడం పక్కన పెడితే.. స్టేజ్ మీద అతని నిర్ణయాలు నిజంగా ప్రేక్షకులకు భావోద్వేగానికి గురిచేస్తాయి.
Ads
టాప్ 3 లో అభిజిత్, సోహెల్, అఖిల్ ఉన్నారు. వీరికి బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం రూ.25 లక్షలు ( అంటే విజేతకు ఇచ్చే నగదులో సగం ) ఇచ్చి బయటికి వెళ్లిపోవాలని ఆఫర్ చేశాడు. ప్రతి సీజన్ లోనూ ఎవరూ తీసుకోరు. కానీ ఇక్కడ మనోడు సోహెల్ తీసేసుకున్నాడు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. కన్ఫ్యూజ్ చేసేందుకు బిగ్ బాస్, నాగార్జున గట్టిగా ప్రయత్నం చేసినా.. మనోడు గట్టిగా ఒకే మాట మీద నిలబడ్డాడు. రూ.25 లక్షలు తీసుకుని బయటికి వచ్చాడు. ఇక్కడ నాగార్జున హత్తుకోవడం సాధారణమే.. కానీ ఏకంగా హత్తుకుని పైకి ఎత్తుకున్నాడు. అంతే కాదు..
తనుకు లభించిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలకు అనాధ ఆశ్రమానికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా.. మళ్లీ అందులో నుంచి తన స్నేహితుడు మెహబూబ్ ( బిగ్ బాస్ హౌజ్ లో స్నేహం ఏర్పడింది) కు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దానికి అంగీకరించని మెహబూబ్, తనకు సోహెల్ ఇస్తా అన్న రూ.5 లక్షలను తను కూడా అనాధ ఆశ్రమానికి ఇచ్చేస్తాను అన్నాడు. ఇది చూస్తున్న నాగార్జున ఇంప్రెస్ అయిపోయి రూ.25 లక్షలు సోహెల్ వద్దే ఉంచుకోమని చెప్పి.. అనాధ ఆశ్రమానికి ఇద్దరు ఇస్తామని చెప్పిన రూ.10 లక్షలు తాను ఇస్తానని నాగార్జున చెప్పడం ఇక్కడ మరో ట్విస్ట్.
నిజంగా సోహెల్ బిగ్ బాస్ విజేత అయ్యేవాడు కాదు. టాప్ 2లో నిలిచే వాడు. టాస్క్ లలో కోపం తగ్గించుకుని ఉండిఉంటే కచ్చితంగా విజేతగా నిలిచే వాడు. అభిజిత్ విన్నర్ అనేది కొన్ని వారాలు ముందు నుంచే ప్రేక్షకులకు తెలిసిపోయింది.
రూ.25 లక్షలతో తృప్తి ఎందుకంటే..?
బిగ్ బాస్ లో విన్నర్, రన్నర్ గా సోహెల్, అఖిల్ నిలిచి.. ట్రోఫీ ఎవరు గెలుచుకున్న కూడా.. వచ్చిన రూ.50 లక్షల ను సగం సగం పంచుకుందాం అనుకున్నారు. అంటే సోహెల్ ఒకవేళ విన్నర్ అయినా.. రన్నర్ అయినా.. వచ్చే నగదు రూ.25 లక్షలు మాత్రమే. అదేదో ఇప్పుడే వస్తోంది కదా.. మళ్లీ రిస్క్ ఎందుకులే అనుకున్నాడు. నిజమే కదా.?
సినిమా తీసి ( చిన్న బడ్జెట్ లో) మంచి విజయం సాధించాలి అనేది సోహెల్ కల. నిజంగా మంచి సినిమా తీసి భారీ హిట్ కొట్టినా.. ఇంతలా ఫేమస్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే అది నటన. ఫినాలే లో అతని నిర్ణయం, ప్రవర్తన నిజం. ఇంకో విషయం ఏంటీ అంటే.. నాగార్జున చెప్పినట్లు సోహెల్ సినిమా తీసుకునేందుకు రూ.25 లక్షలు ఉపయోగపడుతాయి కూడా. ఫినాలే కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సరదాగా శోహెల్ హీరోగా సినిమా తీస్తా అన్నాడు. ఇది నిజం అవ్వకపోవచ్చు. అయితే మాత్రం సోహెల్ కు ఇక తిరుగు ఉండదు. అనిల్ కాకపోయినా.. ఎవరో ఒకరు కచ్చితంగా సోహెల్ హీరోగా సినిమా తీయడం ఖాయం.
చిరంజీవి కూడా సోహేల్ కోసం ఇంటి నుంచి, తన భార్య వండిన బిర్యానీ తేవడం, కథ వేరే ఉంటది అనే మేనరిజమ్స్ తన సినిమాలో వాడుకుంటాను అని చెప్పడం, సొహెల్ తీసే సినిమాలో చిన్న పాత్ర చేస్తాను అనడం సోహేల్ గెలుపే కదా…
ఇక విన్నర్ అభిజిత్ విషయానికి వస్తే.. అతని గెలుపు గురించి ముందే ప్రేక్షకులు ఊహించారు. అతను బాగా ఆట ఆడినా, ఆడకపోయినా.. బాగా మెచ్యుర్డ్ గా ప్రవర్తించాడు. ఇది తెలిసిందే…
Share this Article