ఒక యువకుడు… తను బిగ్బాస్ హౌస్లోకి రాలేదు… ఏమీ ఆడలేదు… తన పేరే ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు… కానీ ఒక్కసారిగా బిగ్బాస్ ఫినాలే చూస్తున్న ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నాడు… పేరు బహుశా సాబిర్… సొహెల్ తమ్ముడు… నిజంగా ఇన్నాళ్ల షోలో రియల్ విన్నర్ తనే అనిపించింది చివరకు… ఎందుకంటే…?
భయ్యా, నువ్వు 25 లక్షలు తీసుకుని, ఆట నుంచి తప్పుకునే పక్షంలో… అందులో 10 లక్షలు అనాథలకు ఖర్చుపెట్టాలి అన్నాడు… అక్కడే లక్షల మంది ప్రేక్షకుల మనసుల్ని గెలిచేశాడు ఆ పిల్లగాడు… దానికి వెంటనే అంగీకరించిన సొహెల్ గెలిచాడు… తనకు ఇస్తానన్న 5 లక్షలను కూడా అనాథలకే ఖర్చుచేద్దాం, కరోనా టైంలో లక్షలమంది అవస్థలు పడుతున్నారు, అండగా నిలుద్దాం అనడం ద్వారా మెహబూబ్ గెలిచాడు… కాదు… ఆ 10 లక్షలూ నేను ఇస్తానని చెప్పడం ద్వారా నాగార్జున గెలిచాడు… ఇది తెలిసి మరో 10 లక్షలు చిరంజీవి ప్రకటించి, అక్కడే చెక్ ఇచ్చి తనూ గెలిచాడు…
త్రివిక్రమ్ పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది… ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని… ఎస్, సేమ్, అలాగే… ఆట ఎక్కడ ఆపాలో తెలిసినవాడే అసలు విజేత… సొహెల్ ఎక్కడ గెలిచాడు అంటే… ఆ నిమిషంలో అన్ని లెక్కలూ వేసుకుని, బిగ్బాస్ నాలుగో సీజన్ ఆటను హైజాక్ చేసి పారేశాడు,., 25 లక్షలూ తీసుకుని, ఆటను సరైన మలుపులో ఆపేసి… వచ్చేసిన తన నిర్ణయాన్ని అభినందిస్తూ నాగార్జున సొహెల్ను వేదిక మీద కౌగిలించుకుని, ఎత్తుకోవడం అసలైన విశేషమే…
Ads
సొహెల్ నిర్ణయం విన్న వెంటనే కంటెస్టెంట్లంతా చప్పట్లు కొడుతూ అభినందించడం… సొహెల్ బ్రదర్, ఫాదర్ కూడా ఆమోదపూర్వకంగా తలలూపడం… అన్నీ సొహెల్ తెలివైన పని చేశాడనడానికి నిదర్శనాలు… నో, నో, సొహెల్ ఆట స్ఫూర్తిని విడిచిపెట్టేశాడు అనేవాళ్లూ ఉంటారు… కానీ తను చాలా లెక్కలు వేసుకున్నాడు, ఆ లెక్కల్లో ఫిట్టయ్యే నిర్ణయమే తీసుకున్నాడు… అది తరువాత చెప్పుకుందాం… కానీ ఈరోజు ఎవరు విజేత అనే అంశంకన్నా సొహెల్ ఎందుకీ పనిచేశాడు అని తెలుగు ప్రేక్షకులంతా చర్చిస్తున్నారంటే… సొహెల్ తను అనుకున్నదానికన్నా ఎక్కువే సాధించినట్టు… ఎస్, బిగ్బాస్ షో అన్ని టాస్కుల్లాంటిది కాదు… దాని తత్వం అర్థం చేసుకుని మరీ, ట్రోఫీని మించిన గుర్తింపును ఏకపక్షంగా గెలుచుకున్నాడు… శెభాష్ సొహెల్… సింగరేణి నీళ్లు గొప్పవి బిడ్డా…!!
Share this Article