పెగసస్ మీద విరుచుకుపడుతున్నారు… తెలుసు కదా.., మోడీ ప్రభుత్వం విపక్షనేతలు, స్వపక్షనేతలు, జర్నలిస్టులు, హక్కులవాదులు, ఉద్యమకారులు, తీవ్రవాదులు ఎట్సెట్రా అందరివీ… దాదాపు 50 వేల మంది ఫోన్లను హ్యాక్ చేసిపారేసి, ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో తొక్కేసిందనీ, మోడీ మరోసారి తన నియంతగుణాన్ని ప్రదర్శించాడనీ, ఇంతటి అరాచకం ప్రపంచంలో ఎక్కడా లేదని రచ్చరచ్చ చేస్తున్నారు… అలా గొంతులు పెంచి అడుగుతున్నవాళ్లలో చాలామంది చైనాకు దాస్యం చేసేవాళ్లే… ఇలాంటి విషయాల్లో చైనా ఏం చేస్తుందో మాత్రం ఎవరూ మాట్లాడొద్దు… వోకే, పెగసస్‌ను అక్రమంగా ఇంటలిజెన్స్ అవసరాల కోసం వాడుతున్నారు, అనుమతి లేకుండా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు అనే వాదనలు కాస్త పక్కన పెడదాం… ఎందుకంటే..? ఇలాంటివి ఎవడూ అడిగి, అనుమతి తీసుకుని చేయడు, హ్యాక్ అంటేనే దొంగతనంగా చేసేది… ఇప్పుడు మోడీ ప్లేసులో ఇప్పుడు గాయిగత్తర చేస్తున్న మమత, రాజీవ్ గాంధీ ఉన్నా… పెగసస్ వాడతారు… వాడాల్సిందే… ఆ కుర్చీ ఆ పని చేయిస్తుంది… ఇక పెగసస్ విషయానికొద్దాం…
దీన్ని రూపొందించిన ఎన్ఎస్ఓ గ్రూపు నిజానికి ఇజ్రాయిలీ కంపెనీ ఏమీ కాదు… ఓ అమెరికన్ కంపెనీ మొదట్లో… 2016 నుంచే ఈ స్పైవేర్‌ను డెవలప్ చేస్తున్నారు… ఎప్పటికప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచుతున్నారు… ఇప్పుడు మోడీతోపాటు ఈ స్పైవేర్ వ్యతిరేకగణం ఈ ఎన్ఎస్‌ఓఉ గ్రూపును కూడా తిట్టిపోస్తున్నది… నిజానికి అది ఓ వ్యాపార సంస్థ… దాని పనే అది… పైగా ఎవరికిపడితేవారికి అమ్మదు… కేవలం ప్రభుత్వాలకే అమ్ముతుంది… టెర్రరిజంపై పోరు, క్రైమ్ పరిశోధన అంశాలకు మాత్రమే వాడటానికి ఈ స్పైవేర్ కొంటున్నట్టు చెబుతుంది ఏ ప్రభుత్వమైనా…! ఇక్కడ ఎన్ఎస్‌వో ఓ పదునైనా కత్తిని తయారు చేసి అమ్ముతోంది… దాంతో కూరగాయలు కోస్తావా, పీకలు కోస్తావా, వెన్నుపోట్లు పొడుస్తావా ఆ వ్యాపారికి అక్కర్లేదు… అందుకే ఎన్ఎస్ఓ గ్రూపు ఏమన్నదీ అంటే…
Ads
‘‘ఇలాంటి స్పైవేర్ ప్రపంచానికి అవసరం… బయటికి డర్టీ వర్క్ కావచ్చు, కానీ ఆ పని కూడా ఎవడో ఒకడు చేయాల్సిందే కదా… ప్రపంచంలో లక్షల మంది హాయిగా, సురక్షితంగా పడుకుంటున్నారంటే ఇలాంటి టెక్నాలజీయే కారణం… నిజానికి పెగసస్‌కు ప్రభుత్వాలు కృతజ్ఞత కలిగి ఉండాలి… ఎన్‌క్రిప్షన్‌తో నేరగాళ్లకు గొడుగుపడుతున్న యాప్స్ బ్రేక్ చేస్తుంది పెగసస్…’’ అని చెబుతోంది… దాని సరుకు ప్రయోజనం గురించి అది అలాగే చెప్పుకుంటుంది… కానీ ఒక్కసారి న్యూట్రల్ గొంతుతో ఆలోచించాలి… ఈ పెగసస్ గురించి చాన్నాళ్లుగా రాజకీయనేతలకు, వీవీఐపీలకు, వ్యాపారులకు, ఉన్నతాధికారులకు, వివిధ నేరాల్లో పాలుపంచుకునేవాళ్లకు తెలుసు, దాని బారినపడకుండా సీక్రెట్ యవ్వారాలు ఎలా చక్కబెట్టుకోవాలో కూడా తెలుసు… ఫోన్ల ట్యాపింగ్ జరగదు అనుకోవడమే తప్పు… అది ఒక రియాలిటీ… కొన్నాళ్లు వాట్సప్, ఐఫోన్‌లోని ఫేస్ టైమ్ గట్రా సేఫ్… ఇప్పుడవీ అన్ సేఫ్… టెలిగ్రామ్, సిగ్నల్ తదితర స్పీకింగ్, మెసేజింగు యాప్స్‌ను కూడా ఛేదించేస్తారు… ఫోన్లు సేఫ్, వాటిల్లో మాట్లాడటం సేఫ్ అనే భ్రమల్లో బతకడమే అన్ సేఫ్… అన్నట్టు మమతక్కా, మీ పోలీసులు ఇంకా డెవలప్ అయినట్టు లేరు… లేదా వాళ్లూ నీలాగే ఫోన్ల కెమెరాలకు ప్లాస్టర్లు వేసుకుని కొలువులు చేస్తున్నట్టున్నారు… పోనీ, మా తెలుగు పోలీసులతో కాస్త ఇంటరాక్ట్ కావాలని ఆదేశించరాదూ…!!
Share this Article