సాధారణంగా హిందువుల్లో, శివభక్తుల్లో ఓ నమ్మకం ఉంటుంది… శివుడిని ఏమైనా కోరుకునేవాళ్లు తమ కోరికల్ని శివుడి వాహనం నందీశ్వరుడి చెవుల్లో చెప్పాలి అని… తరువాత నందీశ్వరుడు శివుడికి చెప్పి, ఆ కోరికలు నెరవేరేలా చూస్తాడు అని..! అంటే సరైన సమయంలో మన కోరికల్ని నందీశ్వరుడు శివుడికి విన్నవిస్తాడన్నమాట… అప్పుడు మాత్రమే ఫైల్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట…
సరే, భక్తుల విశ్వాసాలు వాళ్లిష్టం… అన్ని నమ్మకాలకూ హేతుబద్ధత ఉండదు… ఉండాల్సిన పనీ లేదు… అసలు దేవుడి అస్థిత్వమే అతి పెద్ద ప్రశ్నార్థకం కదా ప్రపంచంలో…! ఈ చెవుల్లో చెప్పడం కాస్తా క్రమేపీ మారిపోయి నందీశ్వరుడి కొమ్ముల నుంచి దేవుడిని దర్శించడం స్టార్టయింది… లేదా గుడి బయట ఉండే నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి గుడి శిఖరాన్ని దర్శించడం ఓ విశ్వాసంగా మారింది…
ఈ శిఖరదర్శనానికి ప్రవచనకారులు ఎన్ని కారణాలు చెప్పినా… ఈ ఆనవాయితీ పుట్టుకను ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు… సరే, ఒక్కో దేవుడి దగ్గర ఒక్కో విశ్వాసం, అర్చన పద్దతి ఉంటుంది… దీనివల్ల భక్తులకు నష్టమేమీ లేదు కూడా…! భక్తుడి ఇష్టం, అంతే… కొమురవెళ్లి మల్లన్న దేవుడి దగ్గర పట్నాలేయడం, మైలపోలు అనే అర్చన పద్ధతులుంటయ్… మన దరిద్రపు దేవాదాయశాఖ వాటిని అప్రధాన పూజలుగా మార్చేసి, ఆగమాన్ని ప్రవేశపెట్టింది, అది వేరే కథ… ఈ ‘‘పూజ మార్పిడి’’ అనేక గుళ్లల్లో జరుగుతోంది… కల్లు సాగపోయడం, జంతువుల్ని బలివ్వడం ఇప్పటికీ కొన్ని వేల గ్రామీణ దేవాలయాలలో, ప్రత్యేకించి శక్తిరూపాలున్న గుళ్లల్లో సహజమే…
Ads
ముంబైలో ఫేమస్ టెంపుల్ సిద్ధివినాయక టెంపుల్… తీరా అక్కడికి వెళ్లాక చూస్తే చిన్న గుడి… గోపురానికి ఏవో రిపేర్లున్నట్టున్నయ్, కవర్ వేసేశారు… మెయింటెనెన్స్ బాగానే ఉంది… ఒకాయన ఏకంగా పది కిలోల మెతీచూర్ లడ్డూ తీసుకొచ్చి, దేవుడికి నైవేద్యం చూపించి, బయటికి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టాడు… ముంబైవాసులకు ఈ గుడి అంటే అంత విశ్వాసం… కాకపోతే చిన్న విగ్రహం… అదీ రంగుల్లో… సాధారణ గణేషుడి విగ్రహాలతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్…
గర్భగుడికి కాస్త ఎడంగా నాలుగైదు ఎలుక బొమ్మలు విశేషంగా కనిపించినయ్… అందరూ వెళ్తున్నారు… ఎలుక చెవుల్లో ఏవో విన్నవించుకుంటున్నారు… అచ్చం, శివుడికి కోరికల్ని నందీశ్వరుడి ద్వారా చెప్పినట్టు గణేషుడికి ఇక్కడ తమ కోరికలను తన వాహనం ఎలుక ద్వారా చెబుతున్నారన్నమాట… పర్లేదు, వాళ్లిష్టం, వాళ్ల విశ్వాసం… అయితే కొందరు చెవుల్లో చెప్పడం మానేసి, నంది కొమ్ముల నుంచి శిఖరాన్ని దర్శించినట్టుగా… ఎలుక తలపై నుంచి చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు…
అక్కడ దర్శనానికి శిఖరమూ లేదు, ఆ ఎలుకలకు కొమ్ములూ లేవు… పైగా ఈ ఎలుక విగ్రహాలు మొబైల్… ఆ నాలుగు విగ్రహాలను ఎటంటే అటు తోసుకుపోవచ్చు… అన్నట్టు గణేషుడికి సమర్పించే గరిక, పూలు, బట్టలు కూడా విశేషంగానే కనిపించినయ్… ఎక్కువగా దాసన్నపూలు… అంటే ఎర్రటి మందార పుష్పాలు..!
Share this Article