ఫాఫం మోహన్‌బాబును ప్రత్యేకంగా ఏమీ అనాల్సిన అక్కర్లేదు….. ది గ్రేట్ మంచు లక్ష్మి, మంచు విష్ణు… ప్లస్ మోహన్‌బాబు మాటల తీరు చూసిన వారెవ్వరికీ ఆ సినిమా చూడబుద్ధి కాదు… పైగా ఏవగింపు సరేసరి… వాళ్ళు మారడానికి కూడా ఇష్టపడరు… అదే అసలు సమస్య వాళ్లకు…!! అసలే మోహన్‌బాబు అంటే ఆ పొగరు తెలుగు జనం అందరికీ తెలిసిందే… దానికితోడు విష్ణు, లక్ష్మి అపరిపక్వ మాటలు సరేసరి… జనాల్లో పెద్ద ఎత్తున నవ్వులాటకు దారితీస్తున్నయ్ అవి…
మా నాన్నగారు ఇళయరాజాకే పాఠాలే నేర్పించారు, దయచేసి నాన్నగారి సినిమాను పైరసీ చేయకండి… ఇలాంటి డవిలాగులకు తోడుగా… వేదిక మీద దర్శకుడిని పట్టుకుని, కాళ్లు మొక్కే పాఠాలు నేర్పించిన మోహన్‌బాబు కూతలు మరింత ఘోరం… పైగా టికెట్ల ధరలు పెంచుకోవడానికి చిరంజీవి ఎట్సెట్రా సినిమావాళ్లు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటే… పేర్ని నానితో మోహన్‌బాబు భేటీ, జగన్ ఇంటికి వెళ్లి ‘‘మధ్యాహ్న భోజనం’’ చేసి మంచు విష్ణు చేసిన మేమేదో అన్నింటికీ అతీతులం అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు… అన్నీ ఈ సినిమా మీద, మోహన్‌బాబు ఫ్యామిలీ ప్రవర్తన మీద ప్రేక్షకుల్లో ఓరకమైన విరక్తిని కలిగించాయ్ అనేది నిజం… మరో నిష్ఠుర నిజం ఏమిటంటే, మోహన్ బాబు అనే కేరక్టర్ జగన్ కి కూడా నష్టదాయకం…
Ads
గతంలోలాగా ఏది తీస్తే అది గుడ్డిగా చూడటానికి, చప్పట్లు కొట్టడానికి ఇప్పుడున్న ప్రేక్షకులు ఏమీ ఎడ్డోళ్లు కాదు… అందుకే మొన్నటి నుంచీ ఒకటే ట్రోలింగ్ సాగుతోంది … సన్నాఫ్ ఇండియా అనబడే ఈ చిత్రరాజాన్ని చూడటానికి అసలు టికెట్లే తెగడం లేదని… ఆన్‌లైన్ బుకింగ్ సైట్ ప్రూఫులతో సహా…!! టాలీవుడ్‌లో ఓ ఫేమస్ సెలబ్రిటీ సినిమాను ఈ రేంజులో జనం తిరస్కరించడం ఇదే మొదటిసారి… పెద్ద ఎత్తున మీమ్స్, వెటకారాలు, ట్రోలింగ్… (నడుములు వంగిపోయినా సరే, ఇంకా నేల విడిచి సాముచేసే ప్రతి ముసలి హీరోకూ ఈ సత్కారమే జరిగితే ఎంత బాగుండు… పాపం శమించుగాక…)
నో, మునుపెన్నడూ చూడలేదు ఈ రేంజ్ ఛీత్కారాలు… ఆ అసహనాన్ని ఆపుకోలేక ఎవరో ఇద్దరు హీరోలు కావాలని ట్రోలింగ్ చేస్తున్నారంటూ మోహన్‌బాబు మరో పిచ్చి విమర్శ… (ఈ సినిమాలో చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఉంది, మరిచిపోకండి…) అసలు సినిమాలో దమ్ముంటే అవన్నీ ఏమీ పనిచేయవు కదా… ప్రేక్షకులు ఆదరిస్తే అవన్నీ కొట్టుకుపోయేవి కదా… అసలు ఈ సినిమాయే పెద్ద తలతిక్క ప్రయోగం… వింత ఏకపాత్రాభినయం…
కావచ్చు… కారణాలేమైనా సరే, మోహన్‌బాబు అనే దిగ్గజ నటుడి మీద ఎవరికైనా రకరకాల ద్వేషాలు ఉండవచ్చుగాక…. కానీ అసలు మీరు మాట్లాడే మాటలే మీకు పెద్ద మైనస్ కదా… మీ అహమే మీకు పెద్ద అడ్డంకి కదా… సో వాట్, జగన్ మీకు చుట్టం కావచ్చుగాక, అయితే ఏది తీస్తే అది జనం చూసేయాలా..? మీరు తీసిందే ఓటీటీకి కూడా పనికొస్తుందో లేదో తెలియని ఓ గంటన్నర ప్రయాస… ఈ గంటన్నర తలనొప్పిని నానా ప్రయాసలతో, వ్యయంతో థియేటర్ దాకా వచ్చి భరించాలా..? ఎందుకు..?
పోనీ, అదైనా ఓ రీతిలో ఉందా అంటే, అదీ లేదు… సీఎం అయిపోవడం అంత వీజీనా..? కిడ్నాపులు అంత వీజీనా..? పైగా అసభ్యమైన కంటెంటు సరేసరి… పూర్ ఎడిటింగ్, అసలు నిర్మాణ విలువలు అంటే తెలుసా వీళ్లకు..? ఓ థియేటర్ సినిమాకు సరిపడా నిడివి కోసం నానా పాట్లు… మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్లు కూడా బాగా తీస్తున్నారు కదా… ఇదొక సినిమాయా..? ఫాఫం, ఇళయరాజా… ఫాఫం, ప్రజ్ఞా జైస్వాల్… వాళ్ల ఇజ్జత్ పోయింది సరే, కానీ ఈ దెబ్బకు సదరు దర్శకుడి పేరు గుర్తులేదు గానీ, తన కెరీర్ కూడా ఇక మటాష్…
ఐనా తనదేముందిలే… అంతా మోహన్‌బాబుదే కదా డైరెక్షన్… ఓ సాదాసీదా రివెంజ్ డ్రామా కాస్తా ప్రైవేటు జైళ్లు, అవినీతి మీద పోరాటం, రాజకీయ అధికారం… ఎటో ఎటో వెళ్లిపోతుంది ఈ కథ… తెలుగు ప్రేక్షకుడికి ఈ శిక్ష పడాల్సిందే, ఇన్నాళ్లూ పెంచిపోషించాడు కదా ఇలాంటోళ్లను… ఈ శాస్తి జరగాల్సిందే… నిజానికి ఈ సినిమా గుణగణాలు కాదు, మోహన్‌బాబు వ్యక్తిగతం మారకపోవడమే పెద్ద సమస్య… ఆ ఫ్యామిలీ మాటలే పెద్ద మైనస్… ఇంకా నయం, ఈ సినిమా చూడటానికి తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా సెలవు దినాలు ఇవ్వాలని అడగలేదు… థాంక్ గాడ్…
మబ్బుల్లో నుంచి ధడేల్‌మని పాతాళంలోకి పడిపోవడం ఇండస్ట్రీలోకి కొత్తేమీ కాదు… కానీ ఇంత వేగంగా పడిపోవడం ఇదే మొదటిసారి… మోహన్‌బాబు గారూ, బా-బు-గా-రూ… కంగ్రాట్స్…!! కానీ ఓ సూచన… తమరు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, అంత సీన్ కూడా లేదు… ఇకపై వాటికి దూరం అన్నారు కదా మొన్న… ప్లీజు, టాలీవుడ్ మీద దయతో వెండితెరను కూడా వదిలేయండి సార్… మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చిన ఇండస్ట్రీ మీద, ప్రేక్షకుల మీద ఆమాత్రం కనీస కృతజ్ఞత కూడా చూపలేరా…!!?
Share this Article