Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోనమ్ దీక్ష భగ్నం సరైన చర్య! ఇప్పటికే ఆలస్యమైంది కూడా!!

July 18, 2026 by M S R

.

చాలామందికి నచ్చకపోవచ్చు కానీ… సోనమ్ వాంగ్‌చుక్ 20 రోజుల నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి, హాస్పిటల్‌‌కు తరలించింది… ఇక మొదలయ్యాయి కొందరి ఏడుపులు, సోకాల్డ్ సామాజికవేత్తలు కమ్ ప్రజాస్వామికవాదులు… ఇంకెవరో ఆమరణ దీక్ష చేస్తాడట ఇక… ఇక్కడ కొన్ని నిజాలు చెప్పుకుందాం… కటువుగా ఉన్నా, కొందరికి నచ్చకపోయినా…

ఎస్, నీట్ పేపర్ లీకేజీలు, అక్రమాలు నిజం… మోదీ ప్రభుత్వ వైఫల్యం నిజం… కానీ రియాలిటీ ఏమిటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన అవి ఆగవు… వాటికి పాల్పడే టీమ్ అదే పరీక్ష నిర్వహణ సంస్థలో పదిలంగా ఉంటుంది… సో, పరిష్కారం కేంద్ర మంత్రి రాజీనామాలో లేదు, ఆ టీమ్ గుర్తింపు, శిక్షలు…

Ads

ఎవరో ఒకరు జంతర్ మంతర్ దీక్ష అంటాడు… వేల మంది కూడతారు… మంత్రి రాజీనామా అంటారు… సరే, కానీ కోట్ల మంది ఎన్నుకున్న ప్రధాని తన టీమ్ ఏమిటో తనే ఎంచుకుంటాడు, అంతే తప్ప పిడికెడు మంది ఠాట్, వాడు వద్దు  అని ఎలుగెత్తగానే, దానికి తలొగ్గింతే రేపు మరికొంతమంది అమిత్ షా రాజీనామా డిమాండ్ చేస్తారు, మరుసటిరోజు జైశంకర్ రాజీనామా కోరతారు… దీనికి అంతేమిటి..? ఇందులో శాస్త్రీయత ఎంత..?

అన్నింటికన్నా ముఖ్యంగా… ఢిల్లీలో ప్రతిదీ ఇష్యూ చేయడానికి ఖలిస్థానీ, ఐఎస్ఐ, జేఎన్‌యూ, యాంటీ నేషన్ శక్తులు రెడీగా ఉంటున్నాయి… రోజుల తరబడీ ఢిల్లీ ప్రజాజీవనాన్ని కకావికలం చేసిన, ఢిల్లీని నిర్బంధించిన పంజాబ్ రైతుల ఆందోళనల్ని చూశాం కదా… ఢిల్లీ వీథుల్లో ఎలా కదం తొక్కారో చూశాం కదా… అంతా ఒకే సామాజికవర్గం వాళ్లు… పక్కా ఖలిస్థానీ మద్దతుదారులు, ఆప్ సపోర్ట్…

ఇలాంటి డిమాండ్లు, ఆందోళనలతో జనం అవస్థలు పడటాన్ని సమర్థించాలా..? అసలే దేశానికి చాలా చిక్కులున్నాయి… వాటికితోడు బయటి శక్తుల ప్రేరేపిత ఆందోళనల్ని అనుమతించాలా..? పోనీ, ఇప్పుడు సోనం, రేపు మరో సిల్వర్, లేదా కాపర్… ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో ఎలా శాసిస్తాడు..?

పోనీ, సీజేపీ గురించే ఆలోచిద్దాం… అదేమీ పొలిటికల్ బేస్ ఉన్న పార్టీ కాదు, దానికి ప్రజాజీవనం లేదు, జనంలోనూ లేదు గతంలో… ఈ ఒక్క సమస్యపై ఏర్పడిన ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్, సరే, మంచిదే, కానీ దాని చుట్టూ చేరిన శక్తులు..?

ప్రకాష్ రాజ్‌లు, లెఫ్ట్, కుహనా సెక్యులర్, యాంటీ నేషన్ బాపతు తుక్‌డేతుక్‌డే గ్యాంగులు… గమనిస్తే అక్కడి ప్రసంగాలు దాదాపుగా యాంటీ హిందూ ధోరణిలో సాగాయి, విషం… సమస్యను నీట్ నుంచి నీటుగా హిందూ వ్యతిరేకత వైపు విజయవంతంగా దారి మళ్లించారు… వాడెవడో పక్కా యాంటీ హిందూ స్టాండప్ కమెడియన్ అంటున్నాడు… సీతా పతికా నామ్- నీతా పతికా కామ్ అట…

మమత బెనర్జీకి దీటైన ప్రజా, దేశద్రోహి ఆప్ కేజ్రీవాల్ ఏమంటున్నాడంటే..? ధర్మేంద్ర ప్రధాన్‌ను తీసేసి, సోనమ్ వాంగ్‌చుక్‌ను విద్యామంత్రిని చేయాలట… అపహాస్యం అయిపోతున్నాయి పాలనా వ్యవస్థలు!!

అక్కడ నిరాహారదీక్ష ఏమిటి..? ఈ నినాదాలు ఏమిటి..? నీట్‌కూ అంబానీకి సంబంధం ఏమిటి..? నీట్‌కూ హిందూ ధర్మానికి సంబంధం ఏమిటి..? మరో కోణం చూద్దాం… అసలు ఇన్నిరోజులు ఆ దీక్ష కొనసాగేలా చూడటమే మోదీ తప్పు…

పాపం శమించుగాక… సోనమ్‌ను ఖతం చేసి, కేందాన్ని చిక్కుల్లో నెట్టే కుట్రలనూ కొట్టిపారేయలేం… వాళ్లకు సోనమ్ ప్రాణాల విలువ కాదు, ఏదైనా జరిగి ఉంటే లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేసి, మోదీని, భారత ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడమే ధ్యేయం… సో, సోనమ్ నిరాహార దీక్ష భగ్నం అని ఏడిచేవాళ్లు కాస్త కళ్లు తుడుచుకుని, తమాయించుకుని, వాస్తవాల్లోకి రండి..!!

చివరగా... సోనమ్ దీక్ష చేయడానికి సీజేపీ బ్యానర్ దేనికి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions