……. సోనియా గాంధీ నివాసం హైదరాబాద్‌కు మారనుందా..? ఆమె అనారోగ్యం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అంటోందా..? సోనియా గాంధీ ఆరోగ్యం కొన్నేళ్లుగా బాగా ఉండటం లేదని అందరికీ తెలుసు… ఆమె వ్యాధి గురించి బయటికి వెల్లడించకపోయినా పాంక్రియాస్ కేన్సర్‌కు ఆమె అప్పుడప్పుడూ వెళ్లి చికిత్స పొందుతున్నదనే సమాచారం ఢిల్లీ సర్కిళ్లే కాదు, దేశమంతా వ్యాప్తిలో ఉన్నదే…
అప్పుడప్పుడూ ఆమె విదేశాలకు వెళ్లి చెకప్స్ కూడా చేయించుకుంటోంది… ఒకటీరెండుసార్లు రాహుల్ గాంధీ కూడా తనతోపాటు ఉన్నాడు… తన అనారోగ్యం, తన వయస్సు రీత్యా తనను కాంగ్రెస్ పెద్దరికం, పెత్తనం నుంచి విముక్తి చేయాలని కూడా ఆమె కోరుకుంటోంది… కానీ సీనియర్ల వైఖరి, రాహుల్ అనుభవరాహిత్యం కాంగ్రెస్‌ను పట్టాలు తప్పిస్తున్నాయి… ఈ స్థితిలో ఆమె అనివార్యంగా కాంగ్రెస్ పెద్ద కుర్చీలో కూర్చోకతప్పడం లేదు…
మొన్నటి జూలైలో ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో చేరి చికిత్స పొందింది… అసలే కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీలో ప్రబలుతోంది… కరోనా అంటే అది ఊపిరితిత్తులకు విషం… ఈమె ఆల్రెడీ ఒకసారి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురైంది… దీనికితోడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం సోనియా గాంధీకి ఇబ్బందికరంగా మారింది… దీనివల్ల ఆమె ఛాతీ నొప్పి ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందనీ, అందుకని ఢిల్లీ నుంచి నివాసాన్ని మార్చడం సేఫ్ అని వైద్యులు ఆమెకు సూచించారు…
Ads
మరి ఎక్కడికి వెళ్లాలి..? నార్తరన్ ఇండియా అంటేనే చలిప్రదేశాలు… రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి… రాబోయేది శీతాకాలం, లంగ్స్ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి… దీంతో దక్షిణాదికి షిఫ్ట్ కావాలనేది సోనియా కుటుంబం ఆలోచన… ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు ఆమె గోవాకు గానీ, చెన్నైకు గానీ తన నివాసాన్ని మార్చవచ్చు… తనతోపాటు రాహుల్ కూడా కొన్నాళ్లు ఆమెతోపాటు ఉండవచ్చు…
కానీ అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఎప్పుడు ఏ ఆరోగ్య అవసరం వచ్చినా సరే… ఆమెకు తక్షణం అంతర్జాతీయ స్థాయి చికిత్స అందించే నైపుణ్యం, సౌకర్యాలు, అనుభవం ఉన్నది హైదరాబాద్ ఆసుపత్రులకే… చెన్నె, గోవా సముద్ర తీర ప్రాంతాలు… అక్కడి వాతావరణం కూడా పెద్దగా ఆమెకు సరిపడకపోవచ్చు… అందుకని పెద్దగా హెచ్చుతగ్గులు లేని సమ ఉష్ణోగ్రత, గాలిలో తేమ తదితర కోణాల్లో ఐడియల్ నివాసప్రాంతంగా హైదరాబాదే బెటర్ అని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆమె కుటుంబానికి సూచిస్తున్నారు…
చెన్నైలో కూడా ఆధునికి హాస్పిటల్స్ ఉన్నా సరే, అవి నమ్మదగినవి కావనే అపప్రథ ఉంది… జయలలిత గానీ, మొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానీ… గోవాలో అత్యాధునిక వైద్యం దొరికే చాన్స్ తక్కువ… సో, ఏ కోణం నుంచి చూసినా ఆమెకు హైదరాబాద్ సేఫ్ అనే ప్రతిపాదన ఢిల్లీకి చేరుతోంది… గోవా, చెన్నైకన్నా హైదరాబాద్‌లో ఆమెకు తన పార్టీ బలం ఎక్కువ… ఏరకమైన సాయం అవసరమైనా వెంటనే దొరుకుతుంది… అయితే ఎక్కడికి షిఫ్ట్ కావాలనే విషయంలో ఆమె ఇంకా తన తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు… అమ్మా, సోనియమ్మా… ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇచ్చిన మాట మేరకు… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినదానివి… రా, ఇక్కడికే రా… కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది ఈ హైదరాబాద్…!!
తాజా వార్త… ఆమె తన తాత్కాలిక నివాసంగా గోవానే ఎంచుకుంది… తన వెంబడి రాహుల్ ఉన్నాడు… అక్కడ కొన్నిరోజులు ఉన్నాక, మరి తరువాత హైదరాబాద్ వస్తుందా..? ఏమో…! కాలం చెప్పాలి…!
Share this Article