.
ఈమధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో భారీ సక్సెస్ కొట్టినవి అమరన్, సింగం అగెయిన్, భూల్ భులయ్యా-3 … అంటే 300 కోట్లు దాటి వసూళ్లు…
తరువాత లక్కీ భాస్కర్ 100 కోట్లు దాటింది… తన బడ్జెట్‌తో పోలిస్తే క సినిమా కూడా సక్సెసే ఒకరకంగా… అన్ని భాషా చిత్రాల్లోనూ హిట్స్ ఇవే… ఇవి గాకుండా మరో మలయాళ చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది…
Ads
సినిమా పేరు సూక్ష్మదర్శిని… కామెడీ క్రైమ్ థ్రిల్లర్… మలయాళ రచయితలు కథల్ని ఎంత కొత్తగా, ఎంత పకడ్బందీగా రాసుకుంటారో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ… 35 కోట్ల దాకా వసూలు చేసింది, కానీ ఆ సినిమా బడ్జెట్‌తో పోల్చుకుంటే ఇదీ సక్సెస్ సినిమాయే…
జయజయజయహే చిత్రంతో మనకు పరిచయమైన బాసిల్ జోసెఫ్ కథానాయకుడు… ఈ నటుడు కమ్ దర్శకుడు ఈమధ్య మాలీవుడ్‌లో బాగానే పాపులర్ అవుతున్నాడు… ఈ చిత్రంలో ప్రధానపాత్ర నజ్రియా నజీమ్…
ఈమె తెలుసు కదా… ఆమధ్య నానితో ‘అంటే సుందరానికి’ అనే తెలుగు సినిమా చేసింది… తరువాత తెలుగులో అవకాశాల్లేవు… భర్త ఫహాద్ ఫాజిల్… అవును, పుష్పలో షెకావత్ పాత్ర చేశాడు కదా, తనే… పుష్ప సీక్వెల్‌లో తన పాత్రకు ఇంకా ప్రాధాన్యత ఉంటుంది…
సూక్ష్మదర్శిని విషయానికొస్తే… ఓ గృహిణి… తన చుట్టూ ఏం జరుగుతుందో అన్నీ కావాలి… చుట్టుపక్కల ఆడవాళ్లతో ఓ వాట్సప్ గ్రూప్ పెట్టేసుకుని అందులోనే ఎన్నో కబుర్లు, గాసిప్స్ ఎట్సెట్రా… తమ పక్కింట్లోకి తన తల్లితో కలిసి ఈ బాసిల్ దిగుతాడు…
తననే గమనిస్తూ ఉంటుంది నజ్రియా… తన తల్లికి అల్జీమర్స్ అని చెబుతుంటాడు… తప్పిపోతూ మళ్లీ దొరుకుతూ ఉంటుంది… కానీ ఈమెకు కనిపించే నిజాలు వేరు, ఆ కొడుకు అసలు రూపం వేరు… చెబితే ఎవరూ నమ్మరు… తనే ఆ రహస్యాల్ని చేధించాలని పూనుకుంటుంది… ఇలా సాగిపోతుంది సినిమా కథ…
మాలీవుడ్‌లో మంచి రివ్యూలే దక్కాయి… ఓ సాదాసీదా కథ… కానీ ఆసక్తి కలిగించేలా ప్రజెంట్ చేయగలిగాడు దర్శకుడు జితిన్… క్లైమాక్స్ సినిమాకు బలం… ప్లస్ నజ్రియా, బాసిల్ జోసెఫ్ నటన అదనపు బలం… ఓటీటీలో రిలీజయితే మనమూ చూడగలం…!
ఏవో అంచనాలతో ముందే రైట్స్ కొనేసి చేతులు కాల్చుకుంటున్నాయి కదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ … అందుకని థియేటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకున్నవాటి కొనుగోలుకే ఈమధ్య ఇష్టపడుతున్నాయి… రిస్క్ లేకుండా… ఈ సినిమా రిలీజుకు ముందు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోలేదు… ఇప్పుడు మంచి ధర వస్తుందని నిర్మాత ఆశ… అదేదో తేలాకే ఓటీటీ రిలీజ్..!!
Share this Article