Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Sorry Dev.. Love You Kapil… నాటి నుంచీ బాధితుడివే… ఈ రోజు దాకా…

November 22, 2023 by M S R

Priyadarshini Krishna…….. చరిత్రను చింపేయలేరు, విజేత పేరు చెరిపేయలేరు… కాస్త లేటుగా ఐనా కొంత లేటెస్టుగా రాస్తున్నా…… Cricket‌ World Cup కలని సాకారం చేసి గెలుపు రుచిని ప్రతి భారతీయ పౌరునికి చూపించిన వీరుడు కపిల్‌ దేవ్…. ఇది ఎవరూ కాదనలేని నిజం…

రెండ్రోజుల నుండి మీడియా (సోషల్‌ మీడియా కూడా) లో ఈ 2023 world cup final match కి కపిల్‌& టీం ని పిలవకపోవడం పైన కనపడుతున్న వాదం చాలా బయాస్డ్ గా వుంది. దీనిని కూడా రాజకీయ భూతద్దాల్లోంచి చూస్తూ రాజకీయ రంగు పులమడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ బాధ్యత యధావిధిగా కాంగీలు, కమ్మీలు, సెక్యులర్లు భుజానికెత్తుకున్నారు. దేన్నైనా తమకు వీలుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా వాడుకోవడంలో సిద్ధహస్తులు. బయాస్‌ రంగు కళ్ళద్ధాల వల్ల నిజాలు గానీ, లాజికల్‌‌ పాయింట్లు గానీ కనపడవు… కపిల్‌దేవ్‌ హీరో…… ఎవరూ కాదనలేని నిజం….

Ads

కోట్లమంది యువతలో క్రికెట్‌ ఫీవర్‌ని రగిలించిన వీరుడు. భారత్‌లో గత మూడు జనరేషన్స్ లో కపిల్‌ని ఆరాధ్యదైవంగా చూడని అభిమాని వుండడు….అతని తర్వాతే మిగతా ఐకాన్‌లు… గతంలోకి వెళదాం….. కపిల్‌ తన కెరీర్‌ ప్రారంభం నుండి ఎన్నో వివక్షలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ చరిత్రలో రికార్డెడ్‌…. నేను కొత్తగా చెప్పేది కాదు.

క్రికెట్‌ రంగం అప్పటికే అర్బన్‌, కాన్వెంట్‌ ఎడ్యుకేటెడ్ రిచ్‌ కిడ్స్ హవాతో నిండిపోయినదే. లార్డ్ గేమ్‌ అని పేరున్న క్రికెట్ కి తామే లార్డ్స్ అని హవా చెలాయించే ఆటగాళ్ళ లిస్టు చిన్నదేం కాదు. బీసీసీఐ రూపు దిద్దుకున్నప్పటి నుండి దానిపై ముంబైకర్‌ల ఆధిపత్యం కొనసాగుతూనే వున్న సత్యం ఎవరూ కాదనలేనిది. గవాస్కర్‌ ఎన్ని కుతంత్రాలు వేసినది, కపిల్ ని ఎన్ని అవమానాలకు గురిచేసినది స్వయంగా కపిల్‌ చెప్పకపోయినా డ్రస్సింగ్‌ రూమ్‌ నుండి బైటకు వచ్చిన వార్తలు ఎన్నో….

సహజంగానే ముంబాయికర్స్ మరియు కొల్‌కత్తా బాయ్స్ ప్రాబల్యం వున్న ఆరోజుల్లో ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ‘జాఠ్’ ని సైడ్‌లైన్‌ చేయడానికి ఎన్ని పన్నాగాలు పన్నినా షియర్‌ టాలెంట్‌, పూర్తి ప్రతిభ వల్ల అన్నిటినీ క్లీన్‌ బౌల్డ్ చేసుకుంటూ ముందుకు సాగిన వీరుడు. కపిల్‌ ఎన్ని రికార్డులు స్థాపించాడో నేను కొత్తగా రాయనవసరం లేదు. నేను రాయాలనుకునేది, కపిల్‌ని రిటైర్‌ అయ్యాక కూడా సైడ్‌లైన్‌ చేయబడటమనే  చేదు నిజం….

కపిల్‌ రిటైర్‌ అయ్యాక అందరు సీజన్డ్ ఆటగాళ్ళలాగానే క్రికెట్‌ ఆటకి, క్రికెట్‌ అనుబంధ సంస్థలకి చేరువగా వుండలేకపోయాడు…కాదు, వుండనివ్వలేదు…! కపిల్‌దేవ్‌ దేవ్‌ రిటైర్‌ అయ్యాక భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఆ రోల్‌లో వున్నాడు. ఎక్కువ కాలం కోచ్‌గా కొనసాగకపోడానికి కారణాలేంటి….?

1999 sept నుండి 2000 sept వరకు కోచ్‌గా కొనసాగిన కపిల్‌ పై మనోజ్‌ప్రభాకర్‌ బెట్టింగ్‌/మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసిన నేపధ్యంలో తప్పుకున్నాడు. ఆరోపణలు నిజమా…? ఇన్వెస్టిగేషన్‌ ఏమయింది….? మనందరికీ తెలుసు …! దీనివెనక ఏ రాజకీయపార్టీ ఉంది….?

ఆ విధంగా కొంతకాలం పబ్లిక్‌ ఫోకస్‌ నుండి తప్పించబడిన కపిల్‌ మెల్లగా ‘Laureus World Sport Academy’ తో మళ్ళీ లైమ్‌లైట్‌లోకి రాసాగాడు. తదుపరి National Cricket Academy కి చైర్మన్‌ అయ్యాడు. కానీ రెండేళ్ళకే ఆ పదవి నుండి కూడా తప్పుకోవలసి వచ్చింది. కపిల్‌ Zee TV ఆధ్వర్యంలో Indian Cricket League అనౌన్స్ చేసిన వెంటనే BCCI విరుచుకు పడింది. ICL ని రద్దు చేసేదాకా ఊరుకోలేదు.

ఇలా సొంత కుంపట్లు ఎలా పెట్టుకుంటారని గుండెలు బాదుకుంది. చేసేది లేక కపిల్‌ తన కలల ప్రాజెక్ట్ ICL ను రద్దు చేయాల్సి వచ్చింది. కానీ విచిత్రంగా కొంతకాలానికే అదే BCCI అదే ICL కాన్సెప్ట్ ని హైజాక్‌ చేసిన ‘క్రికెట్‌ లార్డ్స్’ కు మద్దతు ఇచ్చి బాకా ఊది మరీ వెనకేసుకొచ్చింది. అదే BCCI అదే ICL ని అక్షరం మార్చి కమర్షియల్‌గా IPL చేసి మన జట్టులోని ఆటగాళ్ళనే వేలానికి పెట్టినా ఎవరూ కిమ్మనలేదు…. తరువాత క్రికెట్‌ ముఖచిత్రమే మారిపోయింది….

ఒక‌ ఆలోచన ఒక ‌ కాన్సెప్ట్ ఎలా హైజాక్‌ కావొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ….. మరి ఈ రాజకీయం వెనక ఏ పార్టీ వుంది…? క్రికెట్‌ ప్రపంచంలో world cup తెచ్చిన కెప్టెన్‌కి, ఆ టీంకి ఎంత విలువ వుందో, మన దేశంలో ఏం విలువ వుందో ఇప్పటికైనా అర్థమవ్వాలి. మిగతా దేశాలు గేం కోసం జట్టు కోసం ఆడితే మనం మాత్రం సొంత ఫేం కోసం ఆడుతాం… మరీ కాదంటే ప్రాంతం కోసం ఆడుతాం.

కపిల్‌ స్థానంలో గవాస్కర్‌ ఉన్నా…. ధోని స్థానంలో సచిన్‌ వున్నా ఆ విజయానికి ఆ ట్రోఫీకీ ఎంత మైలేజ్ వచ్చేదో, మీడియా ఎంత ఊదరగొట్టేదో, BCCI ఎంత డప్పుకొట్టేదో, మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఊరేగింపులు తీసేదో క్రికెట్‌ అభిమానులుగా మీరే విశ్లేషించుకోండి…. చివరగా…. కపిల్‌ మొన్నటి ఈవెంట్‌కి ఎందుకు రాలేదు అని మీడియా అడిగితే ‘…..పిలవలేదు, వెళ్ళలేదు. అంత పెద్ద ఈవెంట్‌కదా చాలా పనులుంటాయి కదా….’ అని ఎంతో హంబుల్‌గా, ఎంతో సింపుల్‌గా బదులిచ్చాడు. సొంత గడ్డమీద సొంత కుర్రాళ్ళు, సొంత టీం ఫైనల్స్ ఆడుతుంటే క్రికెట్‌ సీనియర్స్ ని ఆనర్‌ చెయ్యాల్సిన బాధ్యత, వారిని కలుపుకుని సూచనలను స్ట్రాటజీలను చర్చించాల్సిన వ్యవస్ధ ఇంతలా అవాయిడ్‌‌ చేయడాన్ని మీరందరూ రాజకీయ పార్టీ కోణంలో చూడండి…. నేను మాత్రం వివక్ష కిందనే జమకడతాను…. Sorry Dev…. Love you Kapil….!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions