Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…

May 2, 2026 by M S R

.

ముందుగా మిత్రుడు Ashok Pothraj పోస్టు చదవండి… #ఉర్ఫీజావేద్… బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన ఈమె అభినయ ప్రతిభ ఉన్నా సరే, సినిమాల్లోకంటే బయటే ఎక్కువ సందడి చేస్తుంది… సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు విచిత్రమైన అవతారాల్లో దర్శనమిచ్చి అబ్బాయిలకు నిద్రలేని రాత్రులు ఇస్తోంది…

తన డ్రస్సులపై ఎన్ని విమర్శలు వచ్చినా విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది… కొట్లాటలకు దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి… అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి…

Ads

తాజాగా ఉర్ఫీ చీర కట్టుపై విమర్శలు వినిపిస్తున్నాయి… ఈ మధ్య కాలంలో ముంబై వీధుల్లో విచిత్రమైన డ్రెస్సులతో తిరుగుతూ ప్రజలను పిచ్చెక్కిస్తోంది… మొన్న ఒకరోజు డ్రెస్ లో విశ్వరూపం చూపించింది…
ఇప్పుడే చీరను అవమానించింది… ఆ డ్రెస్ తో ముంబై వీధుల్లోకి వచ్చింది… ఉర్ఫీ జావేద్ చీర కట్టుకుని ప్రోగ్రాంకి వచ్చిన సీన్ ఉంది… ఆశ్చర్యం ఏమిటంటే నడుము, తొడలు కనిపించేలా చీర కట్టింది… సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అందరూ కామెంట్ చేస్తున్నారు…

 


View this post on Instagram



అప్పట్లో దాసరి రాసిన పాట గుర్తొచ్చింది… జ్యోతిలక్ష్మి చీరకట్టింది, పాపం చీరకే సిగ్గేసింది అని… ఇదీ అదే… అంతకుమించి… ఇది చీరకు సిగ్గేయడం కాదు… అసలు చీరకట్టుకునే ప్రతి మహిళ సిగ్గుపడుతూ ఉర్ఫీని బూతులు తిట్టుకునేంత సిగ్గుమాలిన యవ్వారం…

చీరకట్టు భారతీయ ఆహార్య సంస్కృతి… అంటే డ్రెస్ కల్చర్… (దక్షిణాసియా)… దేశవిదేశాల మహిళలు కూడా ఆసక్తి చూపిస్తారు… అలాంటిది ఈ సోకాల్డ్ వెగటు, రోత కేరక్టర్లు ఆ చీరకట్టును కూడా భ్రష్టుపట్టిస్తున్నారు…

ఎవరీ ఉర్ఫీ జావేద్? … ఉర్ఫీ జావేద్ ఒక టెలివిజన్ నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ… ‘బిగ్ బాస్ OTT’ ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది…  అయితే, ఆమె నటన కంటే తన “అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్” వల్లే ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది… కేవలం బట్టలతోనే కాకుండా కాగితాలు, తీగలు, గ్లాస్, సిమ్ కార్డులు వంటి వస్తువులతో కూడా డ్రెస్సులు డిజైన్ చేసుకుని ధరించడం ఆమె ప్రత్యేకత… పిచ్చి, పైత్యం కాదు… ట్రెండ్ అట, ప్యాషన్ అట…

ఆ చీర కట్టుపై విమర్శలు ఏమిటి? ఆమె తరచుగా చీరను చాలా విభిన్నంగా, అంటే “Bold and Unconventional” గా కడుతుంటుంది… ఆ వీడియోలో కూడా…

  • కట్-అవుట్ డిజైన్స్…: చీరను సంప్రదాయబద్ధంగా కాకుండా, పల్లేరు లేదా బాడీ సూట్ తరహాలో వింత కోతలతో (cuts) ధరించడంపై విమర్శలు వస్తున్నాయి…

  • సంస్కృతి వివాదం…: “చీర అనేది ఒక గౌరవప్రదమైన వస్త్రం, దాన్ని ఇలా అశ్లీలంగా ప్రదర్శించవద్దు” అని చాలా మంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…

  • పబ్లిసిటీ స్టంట్…: కేవలం వార్తల్లో నిలవడానికే ఆమె ఇలాంటి వింత వేషధారణలు చేస్తోందని నెటిజన్ల ప్రధాన ఆరోపణ…

  • కొందరు ఆమెను “అటెన్షన్ సీకర్” అని పిలుస్తూ ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు… ఇది మరో పైత్యం…

  • ఆమె చేసే ఫ్యాషన్ ప్రయోగాలు కొన్నిసార్లు అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ల ప్రశంసలు పొందినా, సామాన్య ప్రజల నుండి మాత్రం ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి… అంటే, ఛీత్కారాలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…
  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions