.
పొద్దున్నే ఓ స్టోరీ చదువుకున్నాం కదా… మజాకా అనే రాబోయే కొత్త సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు హీరోయిన్ సైజులపై కూసిన పిచ్చి కూతల గురించి…
23 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్న అన్షు అంబానీ మీద వెకిలి వ్యాఖ్యలు చేసిన తీరుపై మొత్తం సోషల్ మీడియా విరుచుకుపడింది…
Ads
మెయిన్ స్ట్రీమ్ కూడా సిగ్గు లేకుండా ఆ టీజర్ లాంచర్ గురించి ఆహా ఓహో అని రాసుకుని పరవశించింది తప్ప వీడి పిచ్చి కూతల గురించి రాయలేదు… శెభాష్, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో ఇండికేషన్ ఇచ్చి మరీ బట్టలిప్పింది…
మిగతా పత్రికలకు, టీవీలకు సినిమవాడి జోలికి వెళ్లాలంటే భయం… దిక్కుమాలిన పాత్రికేయం… ఎవడి కాళ్లయినా సరే, వాటి మీద పాకడం అలవాటైంది… సరే, విషయానికి వస్తే…
వుమెన్ కమిషన్ సూమోటోగా ఈ కేసు టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుంది… ఐతే ఇది స్థూలంగా మహిళలను కించపరిచే కూతలు కావు, కేసుకు అర్హమేనా అనే సందేహాలు ఎలా ఉన్నా సరే, సదరు దర్శకరత్నాన్ని కిందకు దించింది ఆ నిర్ణయం…
ఈమధ్య పిచ్చి కూతలు కూయడం, ఆనక సారీలు చెప్పడం చూశాం కదా… మొన్నటికిమొన్న శ్రీముఖి, దిల్ రాజు ఎట్సెట్రా… నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అల్లు అర్జున్ అరెస్టు, మోహన్‌బాబుపై కేసు, తన ఇద్దరి కొడుకుల సరెండర్ ఎట్సెట్రా కాస్త సినిమా సెలబ్రిటీల్లో భయాన్ని క్రియేట్ చేశాయి…
తెలంగాణ పోలీసులు దొరికితే వదలరు అనే సోయి వచ్చినట్టుంది… ఏదో మంచి బ్రాండ్ కడుపులో పడగానే ఎడ్డి కూతలు కూయడం, అరె, ఇదేదో తలనొప్పిగా మారేట్టుంది అని సోయి రాగానే సారీ చెబుతూ ఓ వీడియో అలా వదిలేయడం…
https://www.facebook.com/reel/596830433301463
ఇదుగో ఈ రీల్ చూశారు కదా… సదరు నక్కిన శ్రీనాథరావు కూడా సారీ చెబుతున్నాడు… ఏదో ఫన్ చేయాలని కాదట, ఫ్లోలో అన్నాడట… అన్షుకు కూడా సారీ చెబుతున్నాడట… పోనీ, ఆమె కాళ్లు పట్టుకుని సారీ చెబుతూ ఓ వీడియో తీసి షేర్ చేయకపోయావా..? నీ సారీలో నిజాయితీ ఏమిటో జనానికి అర్థమయ్యేది..! తాగింది దిగడానికి ఇంత సమయం పట్టిందా… అదీ వుమెన్ కమిషన్ కొరడా పట్టుకున్నాక..!!
Share this Article