Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!

August 23, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … కుర్ర గ్లామర్ హీరోయిన్ ఉన్నా , కుర్ర హీరో ఉన్నా ఈ సినిమాలో జయసుధే షీరో . టైటిల్ కూడా సినిమాలో ఆమె పాత్ర పేరు మీదే . ఇనస్పెక్టర్ ఝాన్సీ . 1993 జూన్లో వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది . యవ్వనంలో నుంచి ప్రౌఢలోకి పయనిస్తున్న రోజుల్లో జయసుధ నటించిన ఇనస్పెక్టర్ పాత్ర .

తిరుపతిలో షూట్ చేయబడిన ఈ సినిమా కధ టూకీగా ఏంటంటే : అన్ని ఊళ్ళల్లో ఉన్నట్లే ఓ రాజకీయ నాయకుడు . మున్సిపల్ చైర్మన్ కూడా . అతనికో గేంగ్ . వాళ్ళు డూప్లికేట్ లాటరీ టిక్కెట్లు అమ్ముతుంటారు . సారా అమ్ముతుంటారు . ఆంబోతుల్లాగా ఆడవారిని మానభంగాలు చేస్తుంటారు .

Ads

ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది ఇనస్పెక్టర్ ఝాన్సీ . ఝాన్సీ అంటే ఝాన్సీయేగా . క్రిమినల్సుని చీల్చి చెండాడుతుంది . విలన్ మున్సిపల్ చైర్మనుతో ఘర్షణ ప్రారంభం అవుతుంది . ఆమె మేనల్లుడు హరీష్ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు . కాలేజీలో విలన్ మేనకోడలితో ప్రేమలో పడతాడు .

ఘర్షణ ఇంకా పెరుగుతుంది . ఈ ఇనస్పెక్టర్ ఝాన్సీకి ఓ ఫ్లాష్ బేక్ ఉంటుంది . ఆమె మాజీ భర్త గిరిబాబు . ఆ గిరిబాబు రెండో భార్య కూతురే హీరోయిన్ సౌందర్య . క్లైమాక్సులో ఝాన్సీ అన్న , కాలేజీ లెక్చరర్ , ఝాన్సీ కలసి విలన్ల ఆట కట్టించి హీరోహీరోయిన్ల పెళ్లి జరిపించి , మాజీ భార్యాభర్తలు గిరిబాబు , జయసుధలను కలపటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఈ సినిమాకు కధను , స్క్రీన్ ప్లేని పరుచూరి బ్రదర్సే అందించారు . ఇలాంటి పొలిటికల్ టచ్ ఉండి ఏక్షన్ సినిమా కధల్ని వ్రాయటంలో సిధ్ధహస్తులు కదా ! బాగా అమర్చారు . డైలాగులను కూడా వ్రాసారు . అంతేనా ! అన్నాదమ్ములుగా నటించారు . వెంకటేశ్వరరావు లాయరుగా , గోపాలకృష్ణ లెక్చరరుగా నటించారు .

గోపాలకృష్ణ దిమాగీ నక్సల్ కూడా . ఊళ్ళో విలన్ల భరతం పట్టుతూ ఉంటాడు . అరాచకాలను తన విద్యార్థుల సహాయంతో ప్రతిఘటిస్తూ ఉంటాడు . చాలా ఎనర్జిటిక్ గా నటించాడు .
జయసుధ . ప్రౌఢ పాత్ర . సిన్సియర్ పోలీస్ . మంత్రిని కూడా బ్రోతల్ ఏక్ట్ కింద అరెస్ట్ చేసి నడిరోడ్డు మీద పెరేడ్ చేయించి రాజీనామా చేయించే పాత్ర . బాగా నటించింది .

గ్లామర్ హీరోయిన్ గా సౌందర్య తన వంతు పాత్రను బాగా పోషించింది . మిల్క్ బాయ్ హరీష్ , తాతినేని రాజేశ్వరి , అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ , రజిత , చలపతిరావు , కోవై సరళ , తనికెళ్ల భరణి , నర్రా  ప్రభృతులు నటించారు .

ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది విలన్ కాస్ట్యూమ్స్ కృష్ణని . మనకు రాజనాల దగ్గర నుండి నూతన్ ప్రసాద్ దాకా చాలామంది విలన్లు ఉన్నారు . ఒక ప్రత్యేక బాణీతో నటించేవాడు కాస్ట్యూమ్స్ కృష్ణ . ఈ సినిమాలో కూడా విభిన్నంగా , చాలా బాగా నటించాడు .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , భువనచంద్ర వ్రాసిన పాటల్ని దర్శకుడు కె సదాశివరావు చక్కగా చిత్రీకరించారు . ఉన్న అయిదు పాటలూ హీరోహీరోయిన్ల మీదే . హే పాపా హే పాపా హే పాపా , ఓ సఖియా నా చెలియా , ఓ ప్రియతమా , గిల్లు గిల్లు చెంప గిల్లు అంటూ సాగుతాయి .

గిల్లు గిల్లు చెమ్మగిల్లు పాటలో సౌందర్యను ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం, మనకు తెలిసిన సౌందర్యం ఈమే కదా మొదట్లో తను సైతం అన్నట్టుగా…

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . సౌందర్య , జయసుధ అభిమానులు మరలా చూడొచ్చు . It’s an action movie with political overtones .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!
  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!
  • డేటా సెంటర్లు వద్దు… కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?
  • పాకిస్థాన్ ప్రతీకార ఆశలపై నీళ్లు … గుమ్మరించింది ఇండియా కాదు, శ్రీలంక !!
  • చైత్ర ! బిగ్‌బాస్ పైత్యానికి బలి … 4 రోజులకే ఇద్దరు ఔట్ ఏమిట్రా !!
  • అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions