Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సౌత్ వాయిస్..! రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ అడుగులు…!!

April 18, 2026 by M S R

.

సౌత్ వాయిస్..! అవును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరిస్తూ… దక్షిణాది గొంతుగా ఎమర్జవుతున్నాడు… వుమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ ఎపిసోడ్లలో బీజేపీ గత పుష్కరకాలంలో ఎన్నడూ లేనంతగా భంగపడగా, పొలిటికల్ సెట్ బ్యాక్ కాగా… ఒక రీజనల్ పొలిటిషియన్‌గా ఎక్కువ ఫాయిదా పొందింది మాత్రం రేవంత్ రెడ్డే… అటు ఎఐసీసీ హైకమాండ్ ధోరణికి భిన్నంగా వెళ్లకుండానే… తను వ్యక్తిగతంగా గాకుండా ఎక్స్‌పోజ్ అవుతూ, జాతీయ స్థాయిలో ‘సౌత్ వాయిస్’గా గుర్తింపుపొందుతున్న తీరు గమనార్హం…

అనుకోకుండా తనకు దొరికింది చాన్స్… డీఎంకే స్టాలిన్ తరహాలో రఫ్‌గా, రూడ్‌గా వ్యవహరించలేదు… బిల్లులు తగులపెడతాం, ఊరూరా మంటలు రేపుతాం అనే భాష కాదు… ఎస్,కేంద్రం ఆలోచనలతో మా సౌత్ స్టేట్స్‌కు నష్టం జరుగుతుంది, మేం ఈ పద్ధతిని ఒప్పుకోం అంటూనే… ఓ ప్రతిపాదన పెట్టాడు కేంద్రం ఎదుట… ‘‘50 శాతం సమానంగా పెంచండి, కానీ 25 శాతం మీరు అనుకున్నట్టుగా, మరో 25 శాతం జీఎస్డీపీ ఆధారంగా… దీనివల్ల సౌత్‌కు ఎక్కువ సీట్లు వస్తాయి, పనితీరుకు మార్కులు వేసినట్టూ ఉంటుంది’’…

Ads

ఒక వ్యక్తి- ఒక వోటు అనే భారతీయ ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్పూర్తిలో ఈ ప్రతిపాదన ఇముడుతుందా లేదానేది వేరే విషయం… కానీ దక్షిణాది సీఎంలకు లేఖలు రాసి, కలిసికట్టుగా కేంద్రం ధోరణికి అడ్డుకట్ట వేద్దాం అని పిలుపునివ్వడంతో సైలెంటుగా ఓ ఫాయిదా పొందాడు… ఇన్నేళ్లూ సౌత్ వాయిస్ అంటే చెన్నై స్టాలిన్ మాత్రమే నార్తరన్ స్టేట్స్ దృష్టిలో… కానీ ఇప్పుడు మోడీ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు ఆల్టర్నేట్ మోడల్ సూచించడంతోపాటు… సౌత్ నుంచి మరో బలమైన వాయిస్ వినిపిస్తోంది అని నార్త్ ఇండియా గుర్తించేట్టు చేసుకోగలిగాడు…

తన హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించేవాళ్లు ఉంటారు, సమర్థించేవాళ్లు ఉంటారు… కానీ ఆ వాయిస్ గుర్తించకుండా ఉండలేకపోయింది బీజేపీ… అందుకే ఇదే సౌత్ నుంచి తేజస్వి సూర్యను ఉసిగొల్పింది… తన ప్రసంగంలో తెలంగాణ విభజన పట్ల కొన్ని తిక్క వ్యాఖ్యలు చేయడం ఎలా ఉన్నా… ప్రధానంగా తను టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డినే…

రేవంత్

తనకు చంద్రబాబుతో, డీకే శివకుమార్‌తో, స్టాలిన్‌తో సత్సంబంధాలున్నాయి… తను అవసరాలకు, పరిస్థితులకు తగినట్టు మారగలడు… రేప్పొద్దున డీలిమిటేషన్ మళ్లీ తెరమీదకు వస్తే… సీట్లలో సౌత్‌కు గనుక అన్యాయం జరిగే పక్షంలో (543 సీట్ల నంబర్ మారకపోతే సౌత్‌కు తీవ్ర నష్టం…) దక్షిణాదిలో మంటలే… అప్పుడు రేవంత్ రెడ్డి ‘ప్రతిఘటన పోరాటంలో’ కీలకపాత్రలోకి వస్తాడు… సౌత్ స్టేట్స్ ప్రధాన పార్టీల నాయకులందరినీ కూడగట్టగలడు… నిన్నామొన్నటి ‘యాక్షన్’ ఒక రిహార్సల్… అంతే…

సౌత్, నార్త్ అనే తేడా వచ్చినప్పుడు జాతీయ పార్టీలకు ఎటు ఉండాలో తేల్చుకోలేని సంకట స్థితి ఎదురవుతుంది… పైగా చంద్రబాబు, పినరై విజయన్, స్టాలిన్, కేసీయార్, సిద్ధరామయ్యల శకం ముగిసింది… ఇప్పుడు లోకేష్, ఉదయనిధి, కేటీయార్ కాలం… ఈ స్థితిలో రేవంత్ రెడ్డికి ‘స్ట్రాంగ్ సౌత్ వాయిస్’గా ఎమర్జ్ కావడానికి అనుకూలత లభిస్తుంది…

ఏ చాన్స్ తను వదులుకోడు… తన ప్రజెన్స్‌ను ప్రత్యర్థులు గుర్తించేలా చేసుకుంటాడు… అందుకే కదా మొన్నటి కేరళ ఎన్నికల్లో పినరై విజయన్ బాగా ఉడుక్కుని, వరుసగా కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చింది… నిన్న పార్లమెంటులో బీజేపీ కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది… రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే పొరపాటే..!!

రేవంత్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions