Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టైటిల్‌లోనే పెద్ద గందరగోళం… సినిమా విజయం భజగోవిందం…

June 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. ఎస్ పి భయంకర్ ఒక పేరు కాదు . ఎస్ పి పాత్ర ANR , భయంకర్ పాత్ర కృష్ణంరాజు . ఇదేదో భయంకర్ అనే ఎస్పీ సినిమా అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు ఆరోజుల్లో .

సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం కల వి బి రాజేంద్రప్రసాద్ స్వంత సినిమా . ఆయనే దర్శకుడు . పైగా మళయాళంలో హిట్టయిన పోస్టుమార్టం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా .

Ads

ఈ మళయాళం సినిమా ఎంత హిట్టయిందంటే తమిళంలో వెల్లాయ్ రోజా (1983) గా , కన్నడంలో ధర్మాత్మాగా (1988) , హిందీలో తహకీకాత్ (1993) టైటిలుతో తీసారు . అంతటి సినిమాను అంతటి నిర్మాత కం దర్శకుడు అంతగా సక్సెస్ చేయలేకపోయారు .

ఓ ఊళ్ళో చర్చి ఫాదర్ మాటంటే చాలా గౌరవం . ఆ ఊళ్ళోనే భయంకర్ అనే ఆవేశపరుడు ఉంటాడు . తన చెల్లెలు గర్భవతి అవటానికి చర్చి ఫాదరే కారణమని భావించి ఫాదర్ని గాయపరుస్తాడు . భయంకర్ చెల్లెల్ని ఆ ఊళ్ళోనే ఉండే ఒక ధనవంతుడు తన కొడుకుని ప్రేమిస్తుందని హత్య చేస్తాడు . ఆ తర్వాత చర్చి ఫాదర్ని , కొడుకుని కూడా చంపేస్తాడు .

చర్చి ఫాదర్ తమ్ముడు ఎస్పీ . ఈ కేసుని పరిశోధించి అసలు హంతకుడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు . ఆ పెనుగులాటలో విలన్ చనిపోతాడు . భయంకర్ విడుదలయి ప్రియురాలు విజయశాంతిని పెళ్లి చేసుకుంటాడు . ఇదీ కధ టూకీగా .

విశాఖపట్నం చుట్టుపక్కల ఔట్ డోర్ షూటింగ్ చేసారు . అక్కినేని ద్విపాత్రాభినయం చేసారు . ఫాదర్ , ఎస్పీ పాత్రలను పోషించారు . ఫాదర్ కాక ముందు పూర్వాశ్రమంలో శ్రీదేవి ప్రియురాలిగా ఓ పాటలో తళుక్కుమంటుంది .

కోట శ్రీనివాసరావు ఆకు రౌడీగా ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు . ఇతర ప్రధాన పాత్రల్లో సురేష్ ,గీత , హేమసుందర్ , గొల్లపూడి , పి యల్ నారాయణ , జీవా , రాళ్ళపల్లి , డబ్బింగ్ జానకి , రమాప్రభ , సంయుక్త , సిల్క్ స్మిత , ప్రభృతులు నటించారు .

మాటల్ని పాటల్ని ఆచార్య ఆత్రేయ వ్రాసారు . ఆత్రేయ డైలాగులకూ ఏమొచ్చెలే అనే డైలాగ్ కూడా ఉంటుంది కృష్ణంరాజుకు . తన మీద తనే జోక్ వ్రాసుకున్నారు ఆత్రేయ . పాటలు బాగుంటాయి . హైలైట్ సిల్క్ స్మిత కస్సుకస్సుమంటోంది వయసు పాటే . స్మిత , కృష్ణంరాజుల మీద ఉంటుంది . అక్కినేని , శ్రీదేవిల మీద కానీ కానీ కానీ రాతిరి కానీ అంటూ సాగే డ్యూయెట్ అందంగా చిత్రీకరించారు .

అన్ని డ్యూయెట్లనీ అందంగా చిత్రీకరించారు రాజేంద్రప్రసాద్ . ఆజా దేఖో మజా అంటూ సాగే ఓ ఖవాలీ పాట అక్కినేని , గొల్లపూడిల మీద ఉంటుంది . గొల్లపూడి పాత్ర కాస్త అతిగా ఉంటుంది . వస్తూ వస్తూ ఏం తెచ్చావ్ అంటూ సాగే పాట సురేష్ , గీతల మీద కూడా బాగుంటుంది . ఒక్కసారి చూసుకుంటా అంటూ సాగే డ్యూయెట్ కృష్ణంరాజు , విజయశాంతిల మీద హుషారుగా ఉంటుంది .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని అక్కినేని , కృష్ణంరాజు అభిమానులు చూడవచ్చు . కృష్ణంరాజు బాగా నటించారు . గ్లామర్ స్పేసుని ఒక్క పాటలో కనిపించే అతిలోకసుందరి , కాసేపు కనిపించే సిల్క్ స్మిత సినిమా అంతా కనిపించే విజయశాంతి బాగానే ఫిల్ చేసారు . రమాప్రభ పాత్ర కూడా బాగుంటుంది . మొత్తం మీద చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions