Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్నేహ అంటే అంత ప్రేమ ఏమిటి..? ఇంద్రజ మీద ఈ నిర్లక్ష్యం ఏమిటి..?

October 11, 2022 by M S R

సాధారణంగా ఈటీవీలో ఏవేవో ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటయ్… మరీ కమర్షియల్ ప్రమోషన్ అవసరం అనుకుంటేనే మెయిన్ పేజీలో ఓ వార్త రాస్తుంది… ఆమధ్య మౌనరాగం సినిమా గురించి ఏదో రాసినట్టు గుర్తు… పర్లేదు, యమున ఒంటి చేత్తో లాగిస్తోంది… ఈటీవీలో జనం చూసే రెండుమూడు సీరియళ్లలో అదీ ఒకటి… మిగతా సీరియళ్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు… ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్’ అని ఓ కొత్త షో స్టార్ట్ చేస్తోందట… ప్రమోట్ చేసుకుంటోంది… ఈనాడులో మాజీ హీరోయిన్ స్నేహ ఇంటర్వ్యూ ఒకటి రాశారు…

బహుశా వీళ్లే రాసేసి పబ్లిష్ చేసి ఉంటారు… పేలవమైన ప్రశ్నలు, నాసిరకం జవాబులు… పత్రికల్లో, సినిమా పేజీల్లో ఇంటర్వ్యూలు అంటేనే పెద్ద డంపింగ్ బాగోతం… కానీ ఈ ఇంటర్వ్యూ వంటిది ఈనాడులో ఎప్పుడూ చూడలేదు… అసలు అది సినిమా పేజీలో టీవీల వార్తలే వేయదు… సరే, ఇప్పుడు స్నేహ ఇంటర్వ్యూ ఎందుకు వేసిందీ అంటే…? కొత్తగా స్టార్ట్ చేసిన మిస్టర్ అండ్ మిసెస్ షోకు ఆమె జడ్జిగా చేయబోతోందట… ఆ ఘనతకు గాను ఆమె ఇంటర్వ్యూ…!!! ఫాఫం ఈనాడు… (నవ తెలంగాణ అనబడే ఓ ఎర్రపత్రికలోనూ ఈ సీరియల్ ప్రారంభం మీద వార్త కనిపించింది…)

అసలు ఒక టీవీ షోకు జడ్జిగా చేస్తే అది గ్రేట్‌నెసా..? ఇదే తెలుగు టీవీల్లో బోలెడు మంది బోలెడు షోలకు జడ్జిలుగా వస్తుంటారు, పోతుంటారు… యాంకర్ ఓంకార్ అయితే ఓసారి ఏదో డాన్స్ షోకు వరుసగా అయిదుగురు జడ్జిలను కూర్చోబెట్టాడు… మొన్నామధ్య జీతెలుగులో ఓ మ్యూజిక్ షోకు నలుగురు జడ్జిలు… వాళ్లు గాకుండా మెంటార్ల పేరిట మరికొందరు…

Ads

టీవీ షోకు జడ్జిగా ఉండటం గ్రేటర్, గ్రేటెస్ట్ అయితే… మరి ఇదే ఈటీవీలో ఇంద్రజ కీలకమైన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు జడ్జిగా చేస్తోంది కదా… ఎప్పుడూ ఏమీ రాయలేదు ఎందుకు..? నిజానికి ఈటీవీ నడుస్తున్నదే ఆ షోలతో… పైగా ఆమెకు ప్రజాదరణ దక్కింది… ఇదే ఈటీవీకి అప్పుడప్పుడూ లైలా, ఖుష్బూ, సదా… రెగ్యులర్‌‌గా పూర్ణ, ప్రియమణి జడ్జిలుగా వస్తూనే ఉంటారు… వీళ్లలో ప్రియమణి టాప్…

mister and misses

అప్పుడే అయిపోలేదు… ఈ మిస్టర్ అండ్ మిసెస్ షోకు మరో జడ్జి శివబాలాజీ అట… ఎక్కడో విన్నట్టుంది కదా… అవును, గతంలో తెలుగు సినిమాల్లో కూడా కనిపించాడు… లైట్… డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ గెస్టుగా లాంచింగ్ షోకి రావడం అత్యంత అరుదైన విశేషమట… ఎలా..? బాలయ్య వంటి హీరోయే అన్‌స్టాపబుల్ అని ఓటీటీ షో చేస్తున్నాడు… సూపర్ హిట్… రాబోయే రోజుల్లో అందరూ టీవీలు, ఓటీటీల బాటే…

కొన్ని షోలను మల్లెమాల వాళ్లు నిర్మిస్తే… ఆలీతో సరదాగా, వావ్, పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటివి జ్ఞాపిక వాళ్లు నిర్మిస్తారు… దీనికి వెన్నెముక అనిల్ కడియాల, కంటెంట్ చూసుకుంటూ సహకరించేది భార్య ప్రవీణా… ఈమె నిన్న ఎక్కడో మాట్లాడుతూ ‘‘పది జంటలు, రకరకాల టాస్క్‌లు’’ అని చెప్పింది… ఇదేమీ కొత్తది కాదు, మిగతా టీవీలు తమ సీరియళ్ల జంటలతో రకరకాల ఆటలు, పాటల షోలు చేసి, అలిసిపోయాయి…

ఈటీవీ కొత్త సినిమాలను కొనదు, వేయదు… ఆ సీరియళ్లను ఎవరూ చూడరు… సో; ఫిక్షనల్ పార్ట్ వీకున్నర… తన బలం నిజానికి రియాలిటీ షోలు, అవీ చీపుగా ఆర్గనైజ్ చేసేవి కావాలి తనకు… ఇప్పుడు అవేవీ జనం చూడటం లేదు… అందుకే వావ్ 1.69, పాడుతా తీయగా 1.81, క్యాష్ 2.24, ఢీ 2.02 రేటింగులు పొందాయి గత బార్క్ జాబితాలో… దారుణమైన రిజల్ట్… అందుకే ఈటీవీ థర్డ్ ప్లేసులో కొట్టుకుంటోంది…

సుమ షోలంటే జనానికి మొనాటనీ వచ్చేసింది… అదింకా ఈటీవీకి అర్థం కావడం లేదు… ఆమెదేముంది..? మరో పదేళ్లు పైబడినా చేస్తూనే ఉంటానంటుంది… ఎస్పీ చరణ్ వాళ్ల నాన్న ఖ్యాతిని ఖరాబు చేస్తూనే ఉన్నాడు… ఢీ అనబడే డాన్స్ షో ఎప్పుడో గతి తప్పింది… ఇప్పుడిక ఈ కాపీ షోలకు ఎగబడుతోంది ఈటీవీ…

రవికిరణ్, సుష్మా… పవన్, అంజలి… సందీప్, జ్యోతి… హృతేష్, ప్రియ… శ్రీవాణి, విక్రమ్… మధు, ప్రియాంక… ప్రీతమ్, మానస… సిద్దు, విష్ణుప్రియ… రాకేశ్, సుజాత… విశ్వ, శ్రద్ధ జంటలు అట… వీరందరూ భార్యాభర్తలు కారు… మరి ఏ జంటలు అనుకోవాలి..? అలాంటప్పుడు మిస్టర్లు వోకే, మిసెస్ అనే పేరు ఎలా పెట్టబడింది..? వీరిలో విష్ణుప్రియ, విశ్వ, రాకేష్ తెలిసిన పేర్లు… మిగతావాళ్లు ఎవరో…

చివరగా :: ఈ షోకు యాంకర్ శ్రీముఖి అట… ఫాఫం… మొదట్లో బాగానే చేసేది… ఏజ్ పైనబడేకొద్దీ… (ఆంటీ అంటే ఏమంటుందో…) కయ్య కయ్య అరవడమే యాంకరింగు అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది… మనసు పెడితే మంచి యాంకర్… కానీ అరుపులతో డబ్బులొచ్చి పడుతుంటే మనసు పెట్టాల్సిన ఖర్మ తనకేల…?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions