గతంలో ఏమైనా వచ్చాయో, లేదో తెలియదు కానీ, 2012లో హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్’ సినిమా Sperm Donation గురించి విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇచ్చింది. ‘వీర్యదానం’ అనే అంశాన్ని సాధారణీకరించేలా చేసేందుకు చాలా ఉపయోగపడింది. ఆ సినిమాను ఆ తర్వాత ‘నరుడా డోనరుడా’ పేరిట తెలుగులో, ‘ధారాళ ప్రభు’ పేరిట తమిళంలో తీశారు. తెలుగులో ఫ్లాప్, తమిళంలో యావరేజ్‌గా ఆ సినిమాలు నిలిచాయి.
ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ‘మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా కూడా Sperm Donation గురించి జనం చర్చించుకునేలా చేసింది. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్, నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరో అలాంటి కథను అంగీకరించడం మేలిమి అడుగు.
ఇలాంటి సినిమాలు చూశాక సహజంగానే మీమ్స్ మొదలవుతాయి. ‘మామా! నేను కూడా Sperm Doner అయిపోతా’ అనే బ్యాచ్ ఒకటి తయారవుతుంది. ‘Sperm Donation’ అంటే కూర్చున్న చోట కాసులు కురిపించే పని అనే ఆలోచన పుడుతుంది. దాని చుట్టూ బోలెడన్ని అపార్థాలు, అపోహలు ఉంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానమే ఈ పోస్ట్. Sperm Count తక్కువగా ఉండి, సంతానం లేని దంపతులకు ఈ విధానం ఓ వరం. వైద్య చరిత్రలో గొప్ప పరిణామం. కాబట్టి ఏమాత్రం సిగ్గూ పడకుండా మొత్తం చదవండి. తెలియని వారికి తెలియజెప్పండి.
Ads
* * *
* Sperm Donation అనేది లాభదాయక వ్యాపారమా?
అస్సలు కాదు. మౌలికంగా మాట్లాడితే వైద్య రంగమే వ్యాపారం కాదు. అదొక సేవ. ఆ వైద్యానికి ముడిపడ్డ వీర్యదానం వ్యాపారం కాదు. చాలా దేశాల్లో Sperm Donersని ముందుగా ఇంటర్వ్యూ చేస్తారు. వారిలో ఈ పని పట్ల సేవా దృక్పథం, ఆశావాదతత్వం లేకపోతే రిజెక్ట్ చేస్తారు. Sperm Donationని కేవలం వ్యాపారంలా చూడటం సరైన పద్ధతి కాదు.
* ఎవరైనా Sperm Donersగా మారొచ్చా?
అస్సలు సాధ్యపడదు. మొత్తం 100 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అనుమతి లభిస్తుంది. అది కూడా అనేక పరీక్షలు చేశాకే నిర్ణయిస్తారు.
* ఆరోగ్యంగా ఉన్న అందరూ Sperm Donation చేయొచ్చా?
సాధ్యం కాదు. రక్తదానంలాగా ఆరోగ్యంగా కనిపించే అందరూ వీర్యదానం చేయడం కుదరదు. ఆ వ్యక్తి కుటుంబ చరిత్ర ఏమిటి? వంశపారంపర్యంగా వచ్చే రోగాలు ఏమైనా ఉన్నాయా? అతనికి శారీరక, మానసిక రోగాలు ఏమైనా ఉన్నాయా? అతని హార్మోనులు ఎలా పనిచేస్తున్నాయి? అతనికేమైనా సుఖవ్యాధులు ఉన్నాయా? అతనికి మానసిక సమస్యలేమైనా కనుగొన్నారా.. ఇలా అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తారు. అవన్నీ పరిగణలోకి తీసుకున్నాకే అతని వీర్యదాతగా పనికి వస్తాడా లేదా అని నిర్ణయిస్తారు.
* అందమైన, దృఢమైన, ఎత్తైన వాళ్లు మాత్రమే Sperm Doners అవుతారా?
ఇది పూర్తిగా అబద్ధం. శారీరకంగా దృఢంగా, అందంగా ఉన్నంత మాత్రాన Sperm Donationకి పనికి వస్తారనేది ఎవరూ నిర్ధారించలేరు. అందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే! అయితే దృఢమైన, అందమైన బిడ్డలు కావాలని దంపతులు కోరినప్పుడు అలాంటి Donors కోసం చూస్తుంటారు. కాబట్టి సహజంగా అలాంటి వారికి డిమాండ్ ఉంటుంది.
* Sperm Donersగా మారినవారు జీవితాంతం అదే పనిలో ఉండొచ్చా?
18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారిని Sperm Donersగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారిని ఆపేసి కొత్తవారిని తీసుకుంటారు. కొంతమంది 50 ఏళ్లదాకా కూడా ఉంటారు. ఆ తర్వాత వారిని కొనసాగిస్తే పుట్టే పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తాయని భావించి వారిని ఆపేస్తారు.
* Sperm Donation చేసేవారి లైంగిక జీవితం ఇబ్బందికరంగా మారుతుందా?
అలా ఏమీ లేదు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. Sperm Donation చేసే రెండు రోజుల ముందు నుంచి అతను మరొకరికితో కలవకూడదని నిబంధన పెడతారు. అదొక్కటి మినహాయిస్తే వ్యక్తిగత జీవితంలో మరే సమస్యా ఉండదు.
* Sperm Doner ద్వారా పుట్టినవారంతా అతని సంతానమేనా?
ఇది చాలా చర్చనీయాంశమైన విషయం. అన్నాదమ్ముళ్లది రక్తసంబంధం. మరి మనం మరొకరికి రక్తం ఇస్తే వాళ్లు మన రక్తసంబంధీకులు అవుతారా? అది కేవలం దానం. అలాగే వీర్యదానంలో కూడా దాతకు పిల్లల మీద ఏ హక్కూ ఉండదు. ఆ బిడ్డను కన్న తల్లే ఆ బిడ్డ తల్లి, ఆమె భర్తే ఆ బిడ్డ తండ్రి. Sperm Donersకి ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులూ రావు. ఆ విషయం ముందే స్పష్టంగా చెప్తారు. పైగా ఎవరి కోసం Sperm వాడారో కూడా అతనికి చెప్పరు. కాబట్టి బయట ఆ పిల్లలను అతను ఎప్పటికీ గుర్తించలేడు. (కొన్ని దేశాల్లో సడలింపులు, మినహాయింపులు ఉన్నట్టున్నాయి)…
* Sperm Donation వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందా?
అలా జరుగుతుంది అనేందుకు ఏ ఆధారం లేదు. అదంతా అపోహ మాత్రమే!
* Sperm Donation వల్ల లైంగిక వ్యాధులు వస్తాయా?
అలా ఎప్పటికీ జరగదు. Sperm Donationలో లైంగిక చర్యకు ఆస్కారమే లేదు. అలాంటప్పుడు లైంగిక వ్యాధులు వచ్చే అవకాశమే లేదు.
* Sperm Donation వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?
ఇది కూడా అపోహే! రక్తం ఇవ్వడం వల్ల బలం ఎలా తగ్గిపోదో, వీర్యం ఇవ్వడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం తగ్గదు.
* Sperm Donersకి బాగా డబ్బులు వస్తాయా?
ఇది నిజం కాదు. Sperm Count ఎక్కువగా ఉన్నవారు కొంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తే చేయవచ్చు. కానీ Sperm Donation Centres దాతలకు తగ్గ పారితోషికాన్ని ఫిక్స్ చేసి ఉంటాయి. దానికి ఒప్పుకుంటేనే వారు అంగీకరిస్తారు. కొందరు స్వచ్ఛందంగా వచ్చి Sperm Donation చేస్తున్నారు. ఇదొక సేవలా భావిస్తున్నారు. సంతానం లేని వారికి సంతానం అందించే సాధనంలా చూస్తున్నారు.
* ‘గేలు Sperm Donation చేయకూడదా?
ఇది అపోహ కాదు కానీ, చాలా దేశాల్లో వారు Sperm Donation చేయకూడదన్న నిషేధం ఉంది. కొన్నిచోట్ల వారూ చేస్తున్నారు. FDA (Food and Drug Administration) నిబంధనల ప్రకారం ఈ నిషేధం అమల్లో ఉంది. * * * – విశీ
Share this Article