.
నిజమే… రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ మీద నాన్ – బీజేపీ ఇండి కూటమికే నమ్మకం పోయింది…
పోయింది కాబట్టే… కొత్తగా ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందనే చర్చకు తెరలేచింది… మమత తనే ముందుకొచ్చి అందరూ అంగీకరిస్తే పగ్గాలు చేపట్టడానికి నేను రెడీ అని ప్రకటించింది…
Ads
దాంతో కూటమిలో కయ్యం మొదలైంది,.. ఎస్, ఆమే సమర్థురాలు అని మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన ఎన్సీపీ, ఠాక్రే శివసేన చెప్పేశాయి… అంటే రాహుల్ నాయకత్వం పట్ల స్పష్టమైన తిరస్కృతి అది…
ఆర్జేడీ అదే మాట… ఎస్పీ అదే మాట… నార్త్ ఇండియాకు సంబంధించి ఇవి ముఖ్యమైన పార్టీలు… కానీ కాంగ్రెస్ అంగీకరిస్తుందా..? నెవ్వర్… రాహుల్ పల్లకీని ఇతర నాన్- బీజేపీ పక్షాలు కలిసి మోయాలే తప్ప… తను వేరే నేతల నాయకత్వంలో పనిచేయడు… కాంగ్రెస్ ఆ పనిచేయనివ్వదు…
ఇండి కూటమిలోని మరో బలమైన పార్టీ డీఎంకే ఇంకేమీ స్పందించినట్టు లేదు… ఒకవైపు ఆప్ ఈసారి తమ పోటీ విడిగానే ఉంటుందని తేల్చి చెప్పేసింది… ఇదే మమత తను మాట్లాడితే ఐక్యత అంటుంది తప్ప తనేమీ నిర్మాణాత్మకంగా ఆ దిశలో పనిచేయదు…
మొన్నటి జనరల్ ఎలక్షన్లలో బెంగాల్‌లోని మొత్తం సీట్లకు పోటీచేసింది… వేరే దిక్కులేక కాంగ్రెస్, సీపీఎం కలిసి మరో కూటమిగా పోటీచేశాయి… 29 టీఎంసీ గెలిస్తే, 12 బీజేపీ గెలిచింది… కాంగ్రెస్ ఒకటి, దశాబ్దాలపాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం చేతులెత్తేసింది… అసలు ఇండి కూటమి మీటింగుల్నే ఆమె పెద్దగా పట్టించుకోదు, ఇప్పుడు ఆమెకు ఏకంగా పగ్గాలే ఇవ్వాలట…
కేరళలో మరో పూర్తి భిన్నమైన దృశ్యం… అదే కాంగ్రెస్ కూటమి ఒకవైపు, లెఫ్ట్ కూటమి మరోవైపు తలపడ్డాయి… కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచగా లెఫ్ట్ చేతులెత్తేసింది… ఓచోట నెయ్యం, మరోచోట కయ్యం… సో, విపక్ష ఐక్యతకు ప్రధానమైన థ్రెడ్ లేకుండా పోయింది…
నిజానికి నార్తరన్ బెల్ట్‌లో ఈసారి జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించిందీ అంటే… నాన్- బీజేపీ వోటు చీలకుండా సీట్లను సర్దుబాటు చేసుకోవడం… కొన్ని రాష్ట్రాల్లో అది సాధ్యం కాలేదు… ఇక ఇప్పుడు ఏకంగా రాహుల్ నాయకత్వానికే కాంగ్రెసేతర విపక్షాలు ఎసరు పెడుతున్నాయి…
జాతీయ స్థాయిలో పరిశీలిస్తే… బీజేపీ తరువాత పెద్ద పార్టీ కాంగ్రెసే… అది విపక్ష పగ్గాల్ని వేరే ప్రాంతీయ నేతకు ఎందుకు అప్పగిస్తుంది..? సపోజ్, ఒకవేళ మమతకే పగ్గాలు ఇస్తారనీ, రేప్పొద్దున బీజేపీ దెబ్బతిని, నాన్- బీజేపీ కూటమి గనుక మెజారిటీ సీట్లు గెలిచిందనే అనుకుందాం… అప్పుడు ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారు మమతే అవుతుంది…
దానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా..? అందుకని ఈ విపక్ష కూటమి పగ్గాల్ని మమతకు అప్పగించడానికే అది ఇష్టపడదు, సుముఖంగా ఉండదు… అప్పుడే బెంగాల్ కాంగ్రెస్ నేతలు స్టార్ట్ చేశారు, మమతను ముందుకు తోయడం బీజేపీ కుట్ర అని..!
ఇప్పుడే కూటమిలో నాయకత్వ మార్పిడి మీద చర్చ మొదలైంది కదా… ఇక ఆ స్వరాలు ఇంకా బలం పెంచుకుంటాయి రానురాను… మహారాష్ట్రలో నాన్- బీజేపీ కూటమి ఘోర పరాజయమే రాహుల్ నాయకత్వం మీద అపనమ్మకాన్ని బాగా పెంచి, ఈ చర్చకు, ఈ సొంత కూటమి కయ్యానికి దారితీసింది…
ఏ కూటమి వైపూ మొగ్గినట్టు కాదు బీఆర్ఎస్, వైసీపీ… అందుకే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండి కూటమి కయ్యం పెద్ద చర్చనీయాంశం కావడం లేదు… పైగా ప్రస్తుత స్థితిలో బీఆర్ఎస్, వైసీపీ అవసరాలు వేరు… అవి నేరుగా బీజేపీతో తలపడటానికి సిద్ధంగా లేవు… సో, జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీకే సానుకూలతను పెంచుతున్నాయి… ఒకవేళ జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయిపోయి, మధ్యంతర ఎన్నికలకు గనుక బీజేపీ వెళ్తే..!?
Share this Article