Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీ ఆఫ్ కాలేదు – వింటోంది, చూస్తోంది, రికార్డ్ చేస్తోంది… అన్నీ !!

September 10, 2026 by M S R

.

నిద్ర వస్తోంది… రాత్రి పొద్దుపోయింది… టీవీ ఆఫ్ చేసేశాం, రిమోట్ పక్కన పడేశాం… పడుకున్నాం… అయిపోలేదు… టీవీ ఆఫ్ కాలేదు… అది తన పని తాను చేస్తోంది… ఇంట్లోని డివైజ్‌లను స్కాన్ చేస్తోంది… తనలోని మైక్ ఆన్‌లోనే ఉంది… అన్నీ వింటోంది…

ఇదీ ఓ సంచలన వార్త… ఫేక్, క్రియేటెడ్ సోషల్ వార్త కాదు… ఓ అధ్యయనం వార్తే… ఓసారి వివరంగా చెప్పుకుందాం… మన ఎల్జీ స్మార్ట్ టీవీ మనపై స్పయింగ్ చేస్తున్నది నిజమేనా..? ప్రస్తుత టెక్ యుగంలో ఏదైనా సాధ్యమే కదా…

Ads

మన ఇంట్లో టీవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. రిమోట్‌తో ఓ బటన్ నొక్కాం… స్క్రీన్ ఆరిపోయింది. ఇక టీవీ పని అయిపోయిందనుకుంటాం. ఇంట్లో మనం మాట్లాడుకునే మాటలు టీవీకి ఏమి సంబంధం అనుకుంటాం. కానీ… టీవీ స్క్రీన్ మాత్రమే ఆఫ్ అయిందేమో? టీవీ లోపలున్న కంప్యూటర్ మాత్రం మేల్కొనే ఉందేమో?

ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ టీవీల గురించి కొత్తగా తలెత్తుతున్న ప్రశ్న. LG స్మార్ట్ టీవీలపై Gamers Nexus, Level1Techsతో పాటు స్వతంత్ర సెక్యూరిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో బయటపడిన కొన్ని అంశాలు నిజంగానే ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం మాత్రం టెక్నాలజీ యుగంలో మనం ఇంట్లోకి తెచ్చుకున్న పరికరాలను మరోసారి ఆలోచించేలా చేస్తోంది.

మీ టీవీకి మీ ఇంట్లో ఎన్ని డివైజ్‌లు ఉన్నాయో తెలుసు… దానికి అన్నీ తెలుసుకునే సామర్థ్యం ఉంది. ఫోన్, కంప్యూటర్, ప్రింటర్, స్మార్ట్ హోమ్ డివైజ్… మీ ఇంటి Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన పరికరాలను స్మార్ట్ టీవీ గుర్తించగలదు. చుట్టుపక్కల ఉన్న Wi-Fi నెట్‌వర్క్‌ల పేర్లు, వాటి సిగ్నల్ బలం వంటి సమాచారాన్ని కూడా గుర్తించగల సామర్థ్యం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఉన్న ఒక టీవీ… ఇంట్లోని టెక్నాలజీ కుటుంబం గురించి ఓ చిన్న మ్యాప్ తయారు చేసుకున్నట్టే కదా! ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించినా, ఇందులో మరో కోణం ఉంది. స్మార్ట్ టీవీకి ఈ రకమైన network scanning సామర్థ్యం ఉండటం పూర్తిగా అసాధారణమైన విషయం కాదని LG చెబుతోంది. స్మార్ట్ టీవీలోని కొన్ని ఫీచర్లు సరిగ్గా పనిచేయడానికి networkలోని ఇతర devicesను గుర్తించడం అవసరమవుతుందని కంపెనీ వివరిస్తోంది.

అంటే… ఇది ఒక్క LG కథ కాదు. స్మార్ట్ టీవీ అనే పరికరం అసలు స్వరూపం గురించిన కథ. టీవీ కేవలం టీవీగా ఎప్పుడో మిగిలిపోలేదు! ఒకప్పుడు టీవీ అంటే యాంటెన్నా పెట్టుకుని ఛానళ్లు చూసే పెట్టె. ఇప్పుడు?

Netflix ఉంది. YouTube ఉంది. OTT apps ఉన్నాయి. మొబైల్‌తో connectivity ఉంది. Bluetooth ఉంది. Wi-Fi ఉంది. Voice control ఉంది. Personalised recommendations ఉన్నాయి. మీరు ఏం చూస్తున్నారు అన్నది అర్థం చేసుకునే సాంకేతికత కూడా ఉంది. దానినే Automatic Content Recognition — ACR అంటారు.

సులభంగా చెప్పాలంటే… మీరు చూస్తున్నది ఏ కార్యక్రమం? ఏ సినిమా? ఏ ప్రకటన? అనే విషయాన్ని టీవీ సాంకేతికంగా గుర్తించగలదు. ఇది ఎందుకు అవసరం? మీకు నచ్చిన కంటెంట్‌ను సూచించడానికి. అలాగే advertising ecosystemకు viewing behaviour గురించి సమాచారం విలువైనదే.

ఇక్కడే privacy ప్రశ్న మొదలవుతుంది. మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారు. కానీ… టీవీ కేవలం మీకు కనిపించే స్క్రీన్ మాత్రమేనా? లేక మీరు ఏం చూస్తున్నారో కూడా తెలుసుకునే digital device? LG మాత్రం ACR వంటి optional features user consent ఆధారంగానే పనిచేస్తాయని చెబుతోంది. వినియోగదారు అనుమతి ఇవ్వని సందర్భాల్లో ACR డేటాను advertising purposes కోసం ఉపయోగించబోమని కంపెనీ స్పష్టం చేసింది. కానీ కంపెనీలు ఎప్పుడూ నిజాల్ని చెప్పవు కదా… అందుకే సందేహం, అందుకే ఆందోళన…

lg tv

ఇప్పటి వరకు network scanning, ACR వరకు బాగానే ఉంది. కానీ పరిశోధకులు చేసిన మరో demonstration ఇప్పుడు ఈ కథను ఒక్కసారిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓ compromised LG TV microphone ద్వారా audio capture చేయగలదని పరిశోధకులు చూపించారు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… టీవీ స్క్రీన్ standbyలో ఉన్నట్టుగా కనిపిస్తున్న సమయంలో కూడా ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పరిశోధకులు తెలిపారు. Internet connection లేకపోయినా captured audio స్థానికంగా నిల్వ చేయగలిగిందని, తిరిగి internetకు కనెక్ట్ అయిన తర్వాత దాన్ని బయటకు పంపే అవకాశం ఉందని కూడా వారి పరీక్షలు సూచించాయి.

ఇక్కడే ఒక punch line వస్తుంది. మనకు టీవీ నిద్రపోతోందనిపించింది… పరిశోధకులు మాత్రం అది పూర్తిగా నిద్రపోలేదని చూపించారు! ఇది వినగానే ఎవరికైనా భయం రావడం సహజమే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన మలుపు ఉంది. అంటే… LG టీవీ అందరి మాటలు రికార్డు చేస్తోందా?

ప్రస్తుతానికి అలా తేల్చేయలేకపోవచ్చు… పరిశోధకులు చూపించింది ఒక compromised televisionలో audio-capture సామర్థ్యాన్ని. అంటే ముందుగా టీవీపై దాడి చేసి, దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న పరిస్థితిలో ఏం చేయవచ్చో వారు demonstration ద్వారా చూపించారు.

ఇది ప్రతి LG టీవీ ప్రస్తుతం మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి మాటను రికార్డు చేస్తోందనడానికి సాక్ష్యం కాదు. ఇది చాలా కీలకమైన తేడా. ఒక ఇంటి తలుపుకు తాళం ఉంది. కానీ ఆ తాళంలో security flaw ఉందని ఓ security researcher చూపించాడు. అంతే. దాని అర్థం ప్రతి ఇంట్లోకి దొంగలు ఇప్పటికే వచ్చేశారని కాదు.

కానీ… తలుపు బలహీనంగా ఉందని తెలిసిన తర్వాత మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఉండలేం. LGపై వచ్చిన ఈ పరిశోధనను కూడా అదే కోణంలో చూడాలి. LG ఏం చెబుతోంది? కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది.

LG వివరణ ప్రకారం voice data సాధారణంగా రికార్డు చేయదు. Remoteలో voice button నొక్కినప్పుడు లేదా వినియోగదారు ముందుగానే Far-Field Voice Recognitionను activate చేసి ఉంటే, “Hi LG” వంటి wake word గుర్తించిన సందర్భాల్లో voice processing జరుగుతుంది. Wake word గుర్తించకపోతే local audio processing తర్వాత ఆ డేటా తొలగించబడుతుందని కంపెనీ చెబుతోంది.

అసలు భయం LG కాదు… మన ఇళ్లలోకి వచ్చిన ‘స్మార్ట్’ పరికరాలన్నీ! ఈ కథలో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించే విషయం ఇదే. మన ఇంట్లోకి స్మార్ట్ టీవీ వచ్చింది. తర్వాత స్మార్ట్ స్పీకర్. స్మార్ట్ కెమెరా. స్మార్ట్ వాచ్. స్మార్ట్ డోర్‌బెల్. స్మార్ట్ లైట్. ప్రతి పరికరం internetకు కనెక్ట్ అయింది.

ప్రతి పరికరానికి ఏదో ఒక sensor ఉంది. ఏదో ఒకటి వింటుంది. ఏదో ఒకటి చూస్తుంది. ఏదో ఒకటి గుర్తిస్తుంది. ఏదో ఒకటి మన usage patternను అర్థం చేసుకుంటుంది. మన ఇల్లు క్రమంగా ‘స్మార్ట్’ అవుతున్న కొద్దీ… మన ప్రైవసీ మాత్రం ఎంత ‘స్మార్ట్’గా మిగులుతోంది?

సో, మనం డిజిటల్ బజారులో బరిబాతల బతుకుతున్నాం…

మనకు TV OFF అంటే screen black. కానీ modern smart deviceకు OFF, standby, sleep, connected standby… ఇవన్నీ ఒకటే కావు. కొన్ని సందర్భాల్లో TV పూర్తిగా విద్యుత్ నుంచి విడిపోకుండా కొన్ని smart functions అందుబాటులో ఉంచుతుంది.

Voice recognition, network connectivity వంటి features enabledగా ఉంటే స్క్రీన్ కనిపించకపోయినా TVలోని కొన్ని systems పనిచేస్తుండవచ్చు. అందుకే… స్క్రీన్ నల్లగా మారింది కాబట్టి పరికరం పూర్తిగా మౌనంగా మారిపోయిందని అనుకోవడం సాంకేతికంగా సరైనది కాదు….

చివరగా… మన బెడ్‌రూముల్లో కూడా స్మార్ట్ ఫోన్లు, ఇతర స్మార్ట్ డివైజెస్ బోలెడు… అవి వింటున్నాయి, అవి చూస్తున్నాయి… అవి రికార్డు కూడా చేస్తున్నాయా..? ఇదే కదా ఈ కథనం చదివాక కలిగే ఆందోళన..!! మరో అధ్యయనం అవసరం !!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీవీ ఆఫ్ కాలేదు – వింటోంది, చూస్తోంది, రికార్డ్ చేస్తోంది… అన్నీ !!
  • జియోథర్మల్ పవర్ ! ఇండియాలో తొలి ప్రయోగం ! కొత్త ఎనర్జీ సోర్స్ !!
  • KCR ‘మైల దారి’ … గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది !!
  • KBC … దేవియో ఔర్ సజ్జనో… బిగ్‌బీ ఇక సెలవు తీసుకుంటాడట !!
  • ‘‘అంత బిజీ అయితే- థియేటర్ వెళ్లి సినిమా ఎవడు చూడమన్నాడు’’
  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions