Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్ సుహాసినీ..! మనసుల్ని చెమ్మగిల్లజేసే ఓ అనురాగ స్రవంతి…!!

July 28, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారాన్ని పొందిన గుండెల్ని పిండేసే ఆర్ద్రతా పూర్వక సినిమా ఈ స్రవంతి … మరో ఆమె కధ . మరో అంతులేని కధ . క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సినిమాలలో స్వాతి , ఈ స్రవంతి , సీతారామయ్య గారి మనుమరాలు సినిమాలంటే నాకెంతో ఇష్టం . హృదయంతో చూసే సినిమాలు . హౄదయాలను తట్టే సినిమాలు .

ఈ సినిమాకు షీరో సుహాసినే . ఇది ఆమె కధే . స్రవంతి అంటే నిరంతరం పారుతూ , సాగుతూ , మలుపులు తిరుగుతూ ముందుకు పోతూనే ఉండటం . ప్రవాహం… మనందరి జీవితాలు అంతే . తిరనాళ్ళల్లో మనం నడవక్కరలేదు . జనం తోపిడిలో మనకు తెలియకుండానే ముందుకు పోతుంటాం . అలాగే జీవితంలో కాలం , విధి , సంఘటనలు మనల్ని ముందుకు తోసేస్తూ ఉంటాయి . స్రవింపచేస్తాయి .

Ads

అయితే ఆ సాగటం నవ్వుతూనా లేక నిత్యం రోదిస్తూనా లేక ఉసూరుమంటూనా అనేదే ముఖ్యం . ఎన్ని కష్టాలు రానీ సుఖాలు రానీ మొహం మీద నవ్వు తొలగకుండా నవ్వుతూ నవ్విస్తూ ముందుకు సాగే వాడు అదృష్టవంతుడు .

ఈ సినిమా నవ్వు మీదే . నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలిరా అనే పాట లాంటిదే ఈ సినిమాలో హీరో మోహన్ కధ . పాత్ర పేరు చిరంజీవి . పేరే చిరంజీవి కానీ కేన్సర్ వ్యాధితో త్వరలో చనిపోనున్నానని తెలిసిన వాడు .

అందుకే నిరంతరం సిధ్ధంగా ఉంటాడు . ప్రత్యేకంగా నవ్వుల రాత్రి అని ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాడు . ఆ క్రమంలో తాను పనిచేసే ఆఫీసులోనే పని చేసే ఇంట్రావర్ట్ అయిన సుహాసినిని రాటు తేలేలా ప్రభావితం చేస్తాడు . అలా ప్రభావితం అయిన స్రవంతి త్వరలో చనిపోతాడని తెలిసినా చిరంజీవిని పెళ్లి చేసుకుని , అతనికి తోడయి ఒంటరి అయిపోతుంది .  అయినా నవ్వుతూ అదే ఆఫీసులో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తుంది .

ఆ ఆఫీసుకే ఒక భార్యను పోగొట్టుకున్న శరత్ బాబు మేనేజరుగా వస్తాడు . స్రవంతి నెమ్మదితనం , మంచితనం ఆకర్షిస్తాయి . అతనికి పోలియో ఎఫెక్టయిన ఒక కూతురు . ఆ పిల్లకు తల్లిగా రామ్మని కోరుతాడు . అంగీకరించి పెళ్లి చేసుకుంటుంది . ఇద్దరినీ బాగా చూసుకుంటూ చిరంజీవిని కూడా మరచిపోదు .

శరత్ బాబు ఎలా అయితే మొదటి భార్య ఫొటోని ఉంచుతాడో అలాగే సుహాసిని కూడా తన మొదటి భర్త ఫొటోని ఉంచుతుంది . శరత్ బాబుకి మగహంకారం వచ్చేస్తుంది . మగాధిపత్యం తన్నుకు వస్తుంది . అతనిలో మానవ సహజమైన అసూయ , అసూయ నుండి క్రోధం పుడతాయి . దూరం చోటుచేసుకోవటం ప్రారంభం అవుతుంది . ఈలోపు చిరంజీవి ముసలి తల్లిదండ్రులు వస్తారు . శరత్ బాబుకి ఇంకా అసహనం పెరుగుతుంది .

చినుకు చినుకు గాలి వాన అయి స్రవంతి బొట్టు చెరిపేసుకుని శరత్ బాబుని విసర్జించి ముసలి జంటకు తల్లి అవుతుంది . శరత్ బాబు కూతురు కూడా నువ్వే కావాలంటూ సుహాసిని వద్దకు వచ్చేస్తుంది . ముగ్గురికీ తల్లి అవుతుంది . ఇదీ కధ . చాలా సీన్లలో హృదయం ఉన్న మనుషుల కళ్ళు చెమర్చుతాయి .

హేట్సాఫ్ టు క్రాంతికుమార్ , సుహాసిని . అగ్ర తాంబూలం వీరిద్దరికే . స్వాతి సినిమాలో ఎగ్రెసివ్ . ఈ సినిమాలో ఎడాప్టివ్ , ఎకామడేటివ్ . ముఖ్యంగా పేథాస్ ఉన్న సీన్లలో బాగా నటించింది . వీరిద్దరి తర్వాత మెచ్చుకోవలసింది చిరంజీవి పాత్రలో మోహన్ని , సుహాసిని నానమ్మ నిర్మలమ్మని . ఇద్దరూ అద్భుతంగా నటించారు .

ఆ తర్వాత పి యల్ నారాయణ , గుమ్మడి , అంజలీదేవిలను . ఆ తర్వాత శరత్ బాబు , అతని కూతురుగా నటించిన పిల్ల . సినిమాలో ముచ్చెర్ల అరుణ , శుభలేఖ సుధాకర్ కూడా ఉన్నారు .

వేటూరి చక్కటి సాహిత్యాన్ని అందించారు . నవ్వుతూ వెళ్ళిపో నువ్వుగా మిగిలిపో పువ్వుగా రాలిపో తావిగా మిగిలిపో పాట చాలా చాలా బాగుంటుంది . సినిమాలో రెండు సార్లు వస్తుంది . మరో శ్రావ్యమైన పాట మౌనం ఆలాపనా మధురం ఆరాధనా . చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు చక్రవర్తి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు ఎంత గొప్పగా పాడారో ! తప్పక ఆస్వాదించవలసిందే .

ఇంత గొప్ప సినిమా తమిళంలోకి కూడా రీమేక్ అయింది . రేవతి అనే టైటిలుతో రీమేక్ చేయబడిన ఈ సినిమాలో రేవతియే టైటిల్ పాత్రను పోషించింది . తమిళ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ మన తెలుగు సినిమా మాత్రం హృదయాన్ని తట్టే సినిమా అని మాత్రం చెప్పగలను .

ఇది అనంత జీవన స్రవంతి అనే ముగింపు సందేశంతో ముగిసే ఈ సినిమా యూట్యూబులో ఉంది . An unmissable , emotional , inspiring , shero-oriented movie . తప్పక మనసుతో చూడండి ఆస్వాదించాలనుకుంటే . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions