ఈమధ్య సినిమా స్టోరీల సైట్లు, చానెళ్లు మాత్రమే కాదు… మెయిన్ స్ట్రీమ్ కూడా శ్రీలీల పేరు జపిస్తోంది… ఐతే ఈ భజనకు ఆమె అనర్హురాలు మాత్రం కాదు… సినిమాల్లో ఒక్క చిన్న పాత్ర కోసం ఎన్నెన్నో వేషాలు వేసి, కష్టాలు పడి, ఎందరినో సంతృప్తిపరచాల్సిన సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలున్నయ్… అయితే హీరోయిన్ వేషాలు లేదా ప్రధానపాత్రలు… వావ్… చిన్న విషయమేమీ కాదు… (అంతటి వరలక్ష్మి శరత్ కుమార్ చేతిలో కూడా ఆరే సినిమాలున్నాయి, పైగా ఆమె హీరోయినేతరం…)
ఆమె గురించి ఇంకా చెప్పుకుందాం గానీ… తెలుగు ప్రజలు బాగా ఓన్ చేసుకున్న నటి సాయిపల్లవితో ఓ పోలిక వస్తోంది తరచుగా… ఇద్దరి మధ్య తేడా ఏమిటనేదీ చర్చకు వస్తోంది కూడా… నిజానికి ఇద్దరినీ ఒక్క గాటన కట్టలేం… సాయిపల్లవి నటనలో శ్రీలీలకన్నా చాలా బెటర్, సీనియర్… ఆమెకు సినిమాల్లో నటించాలంటే కొన్ని పద్ధతులున్నయ్, ఎక్స్‌పోజింగ్‌కు నో… హీరో పక్కన దేభ్యం మొహం వేసుకుని నటించడానికి, ప్రాధాన్యం లేని పాత్రల్లో చేయడానికి కూడా నో…
ఆమె బయట జీవితం కూడా ఆదర్శాలతో కూడి ఉంటుంది… మళ్లీ మళ్లీ వాటి గురించి చెప్పుకోవడం అనవసరం… ఆమె గురించి సగటు ప్రేక్షకుడికి తెలుసు… కాకపోతే లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యాంసింగరాయ్ సినిమాలు వరుసగా కొట్టేయడంతో కుంగిపోయినట్టుంది… హీరోయిన్ సెంట్రిక్ కథలు కోరుకుంది, నటించే సత్తా ఉంది, కానీ అలాంటి కథలేమీ రాలేదు ఇక… దాంతో ఎవరికీ కనిపించకుండా మాయం అయిపోయింది… సైట్లు, చానెళ్లు ఆమె గురించి రాయడమే మరిచిపోయాయి… కాదు, అవాయిడ్ చేశాయి… అంతేకదా, ఎక్కడా కనిపించకుండా పోతే, చేతిలో ఒక్క సినిమా లేకపోతే రాయడానికి ఏముంటుంది..?
Ads
మరీ ఎంత దారుణం అంటే… ఆమధ్య మళ్లీ ఆమె వార్తల్లోకి వచ్చింది… శివ కార్తికేయతో కూడా ఏదో తమిళ సినిమా చేస్తోంది… కమల్‌హాసన్ సొంత సినిమా అది… ప్రేక్షకులకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద… సినిమా ప్రారంభ కార్యక్రమం మీద తెలుగు మీడియా అస్సలు పట్టించుకోలేదు… కొందరైతే ఆమె ఉన్న ఫోటోను కూడా అవాయిడ్ చేసి పబ్లిష్ చేశారు… మీడియా సాయిపల్లవిని అవాయిడ్ చేయడం అనేది కొనసాగుతున్నట్టు లెక్క… అప్పుడప్పుడూ పెయిడ్ ఇంటర్వ్యూలు మెయింటెయిన్ చేస్తుంటే మీడియా ఆమెను లైవ్‌లో ఉంచుతుంది… కానీ ఆమె తత్వం అది కాదు, ఆమెకు అనవసరం కూడా…
శ్రీలీలతో ఆమె పోలిక డాన్స్ విషయంలో వస్తుంది… సాయిపల్లవి అప్పట్లో ఏదో టీవీ డాన్స్ కంపిటీషన్ షో కోసం స్టెప్పుల్లో శిక్షణ తీసుకుంది… అంతే తప్ప ఆమె శాస్త్రీయ నృత్యకారిణి కాదు, కానీ డాన్స్ మాస్టర్ భాషలో చెప్పాలంటే ఆమె డాన్స్ చేస్తుంటే నెమలి డాన్స్ చేస్తున్నట్టే ఉంటుంది… అది నిజం కూడా… నటన, నాట్యం ఆమె బలాలు… ఎప్పుడైతే శ్రీలీల తెలుగుతెరను తన స్టెప్పులతో దున్నేయడం మొదలుపెట్టిందో ఇక సాయిపల్లవి డాన్స్ మరుగునపడిపోయింది… పైగా ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు… మరోవైపు శ్రీలీల తన డాన్సులతో, ఒకేసారి ఎనిమిది సినిమాలు చేస్తూ విజృంభిస్తోంది…
సాయిపల్లవితో పోలిస్తే శ్రీలీల ఎక్స్‌పోజింగ్‌కు వ్యతిరేకమేమీ కాదు… నటన అంత ఇంప్రెసివ్ కాకపోయినా నాట్యంలో సాయిపల్లవికి దీటుగా చేస్తుంది… కమర్షియల్ సినిమాల ఆఫర్లు వచ్చేకొద్దీ ఒప్పేసుకుంటూ… గాలి ఉన్నప్పుడే తూర్పారబట్టుకోవాలనే పెద్దల మాట పాటిస్తోంది అక్షరాలా… ఆమె డాక్టరీ చదివింది… సాయిపల్లవి కూడా డాక్టరే… సాయిపల్లవిది మంచి మనసు… సేమ్, శ్రీలీల కూడా… ఇద్దరు దివ్యాంగ పిల్లల్ని దత్తత తీసుకుంది… కాకపోతే అందం, ఆకర్షణల్లో సాయిపల్లవికన్నా శ్రీలీల కాస్త బెటర్… శ్రీలీల చెల్లెలు పాత్రలు సహా ఏ ఆఫర్ వచ్చినా సై అంటోంది… కానీ సాయిపల్లవి అప్రధాన పాత్రల్ని అంగీకరించదు… సినిమాల్ని విడిచిపెట్టేసే సిట్యుయేషన్ వచ్చినా సరే, తను పెట్టుకున్న పరిమితుల్ని దాటి బయటికి రాదు… కానీ శ్రీలీల కొంత లిబరల్…
ఆమె 2019 నుంచీ ఫీల్డ్‌లో ఉంది… కానీ కన్నడంతో స్టార్ట్… తరువాత 2020లో పెళ్లిసందడిలో మెరిసింది… అప్పటి సూపర్ హిట్ సినిమా పెళ్లిసందడిని రిపీట్ చేయడానికి పెళ్లిసందD పేరిట ఏదో సినిమా తీశాడు కదా… సినిమా అట్టర్ ఫ్లాప్… కానీ శ్రీలీల మీద ఇండస్ట్రీ కన్నుపడింది… తరువాత రవితేజ సినిమా ధమాకాలో బుక్కయింది… ఆమె డాన్స్, ఎనర్జీ, ఆ స్టెప్పులు చూసి ప్రేక్షకులు ఆ సినిమాను హిట్ చేశారు… ఆ సినిమాకు ఆమే బలం… ప్రత్యేకించి పల్సర్ పాట సూపర్ హిట్… నిజానికి ఆమెలోని డాన్సర్‌ను పూర్తి స్థాయిలో బయటికి తీసుకురాలేదు ఏ దర్శకుడూ… ఐనా ఇంత త్వరగా ఈ ప్లేసు సంపాదించడం అంటే మాటలు కాదు…
ఆమె పుట్టింది అమెరికా… మిచిగాన్… కానీ ఇండియన్ పేరెంట్స్, పైగా తెలుగు పేరెంట్స్… పెరిగింది బెంగుళూరు… తల్లి గైనకాలజిస్టు, తండ్రి ఇండస్ట్రియలిస్ట్, విడిపోయారు… విడిపోయాక పుట్టింది శ్రీలీల… ఒకవైపు డాక్టరీ చదువుతూనే మరోవైపు సినిమాల్లోకి అడుగుపెట్టింది ఆమె… ఇదీ ఆమె నేపథ్యం… మరి సాయిపల్లవితో ఎందుకు పోలిక వస్తోంది అంటే… వీళ్లిద్దరు తప్ప మరే హీరోయిన్ డాన్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా ఉండదు… అందరూ సమంత టైప్ ఊ అంటావా, ఊఊ అంటావా టైపే… ఇద్దరూ మంచి డాన్సర్లు, డాక్టర్లు, ఇద్దరినీ తెలుగు పరిశ్రమ ఓన్ చేసుకుంటోంది కాబట్టి పోలిక వస్తుంది… మరీ ముఖ్యంగా సాయిపల్లవి తమిళియన్… శ్రీలీల పక్కా తెలుగు…!! చివరగా ఒక్కమాట… సాయిపల్లవితో గానీ శ్రీలీలతో గానీ దీటుగా డాన్స్ చేయగల హీరో లేడు తెలుగులో…!! బన్నీ, జూనియర్ కొంత బెటర్…!!
Share this Article