.
బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి మళ్లీ శ్రీదేవి భర్త బోనీకపూర్ ఎందుకు కెలుకుతున్నాడు..? అది గతం గతః … ఒకవేళ ఏ ఇంటర్వ్యూలోనో, చాట్‌లోనో ఆ ప్రశ్న వచ్చినా సరే అవాయిడ్ చేయాల్సింది…
అవును, గతంలో సాక్షాత్తూ రాజమౌళే చెప్పాడు… ఏమనీ..? ఒక హోటల్ ఫ్లోర్ అంతా తమవాళ్లకే కావాలందనీ, అప్పటి ఆమె డిమాండ్‌కు రెండు రెట్లు మించి పారితోషికం, అంటే 10 కోట్లు అడిగిందనీ, అందుకే రమ్యకృష్ణను ఆ పాత్రకు తీసుకున్నామనీ..!
Ads
తరువాత సాక్షాత్తూ శ్రీదేవే రాజమౌళి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పింది… రాజమౌళి కూడా నాలుక కర్చుకుని తాను అలా అనకుండా ఉండాల్సిందని లెంపలేసుకున్నాడు… సో, అక్కడే కంట్రవర్సీకి తెరపడాలి… కానీ మళ్లీ బోనీకపూర్ గోకుతున్నాడు… అది అనవసరం…
బాహుబలి నిర్మాత యార్లగడ్డ శోభు శ్రీదేవికి మరీ తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడనీ, పైగా శ్రీదేవి ఏవేవో గొంతెమ్మ కోరికలు కోరినట్టుగా రాజమౌళికి చెప్పి… ఆమెకూ, రాజమౌళికీ నడుమ దూరం పెంచాడని బోనీకపూర్ వివరణ… అలాగే తమకు అనుకూలమైన షెడ్యూల్స్ పెట్టాలని మాత్రమే శ్రీదేవి చెప్పిందట…
ఇక్కడ ఓ సందేహం… రాజమౌళి నిజంగానే శివగామి పాత్రకు శ్రీదేవి ఉంటే బాగుంటుందని అనుకున్నది నిజం… శ్రీదేవిని అభిమానిస్తాడనేది నిజం… అలాంటప్పుడు శోభు యార్లగడ్డ ఏదో చెప్పగానే నమ్మేశాడా..? బాహుబలి బడ్జెట్‌లో శ్రీదేవి అడిగిన రెమ్యునరేషన్ (ఒకవేళ ఆమె డబుల్ అడిగినా సరే) అడ్జస్ట్ చేయడం పెద్ద కథేమీ కాదు…
పైగా ఒకసారి శ్రీదేవి కావాలీ అని రాజమౌళి అన్నాక… ఇక నిర్మాతలు ఏవో కుంటిసాకులు చెప్పినా తను వినడు… అవసరమైతే తనే నేరుగా డీల్ చేస్తాడు… అందుకని బోనీకపూర్ చెప్పేది కూడా సందేహాస్పదమే… ఏమో, యార్లగడ్డ శోభుయే శ్రీదేవి బదులు రమ్యకృష్ణ ఆ పాత్ర చేస్తే బాగుంటుందనీ, చెప్పిన బడ్జెట్‌కు ఒప్పుకుంటుందనీ అనుకున్నాడేమో…
కానీ ఏమాటకామాట… ఆ పాత్రలో రమ్యకృష్ణ బాగానే చేసింది సరే గానీ శ్రీదేవి గనుక ఆ పాత్ర చేసి ఉంటే వాల్యూ యాడిషన్ జరిగి ఉండేది… శ్రీదేవి ఇమేజ్ అది… ఆ వివాదం ఎప్పుడో ముగిసిపోయింది… శ్రీదేవి ఏవో గొంతెమ్మ కోరికలు కోరిందని రాజమౌళి చెప్పినా ప్రేక్షకులు నమ్మలేదు… దాంతో శ్రీదేవికి వచ్చిన నష్టమూ లేదు…
ఆమె కూడా సింపుల్‌గా తను గొంతెమ్మ కోెరికల నటిని ఐఉంటే పెద్ద పెద్ద దర్శకులతో చేసి ఉండేదాన్నా..? ఎవరైనా ఏమైనా ప్రచారం చేసుకుంటే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాననీ హుందాగా బదులిచ్చింది… అలా రాజమౌళి విజ్ఞత మీద కొట్టింది దెబ్బ… అందుకే రాజమౌళి ఆమెకు సారీ చెప్పి తన విలువను కాపాడుకున్నాడు…
తను మళ్లీ బాహుబలి నిర్మాతల్ని తనను ఎందుకు మిస్‌గైడ్ చేశారని అడిగాడో లేదో తెలియదు, తవ్వడం వేస్టని వదిలేశాడో గానీ… ఆ కథకు అప్పట్లోనే ఎండ్ కార్డ్ పడింది… ఆమె మరణించిన ఇన్నేళ్లకు బోనీకపూర్ తవ్వడంతో బయటపడేవి పెంకాసులే తప్ప ఇప్పుడు ఒరిగేది ఏముంది..?
Share this Article