Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పదహారేళ్ల వయస్సు కాదు… పదమూడేళ్లకే షీరోగా శ్రీదేవి తొలి సినిమా…

July 27, 2024 by M S R

బేబీ శ్రీదేవి కుమారి శ్రీదేవి అయి షీరోగా నటించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ అనురాగాలు సినిమా . హిందీలో శక్తి సామంత తీసిన అనురాగ్ అనే సినిమాకు రీమేక్ మన అనురాగాలు సినిమా . హిందీలో హేమాహేమీలు నటించారు . అశోక్ కుమార్ , రాజేష్ ఖన్నా , నూతన్ , వినోద్ మెహ్రా , మౌసమీ ఛటర్జీలు నటించారు .

మన తెలుగులో శ్రీదేవి , కొత్త నటుడు రవికాంత్ , నాగభూషణం , శుభ , రాజబాబు , అల్లు రామలింగయ్య , శ్రీధర్ , రమణమూర్తి , ఝాన్సీ ప్రభృతులు నటించారు . ప్రధాన పాత్ర మాస్టర్ నటరాజుది .

శ్రీదేవి అంధురాలి పాత్ర వేసింది . ఒక కోటీశ్వరుడి మనమడు ఆమెకు దగ్గర అవుతాడు . ఆ చిన్న పిల్లవాడు తాను చనిపోతూ తన కళ్ళను శ్రీదేవికి దానం చేస్తాడు . క్లుప్తంగా ఇదీ కధ . కె యస్ రామిరెడ్డి దర్శకుడు . హిందీ సినిమాకు మక్కీకిమక్కీగా తీసారు . హిందీ కలర్లో ఉండటం , మౌసమీ గ్లామరస్ గా ఉండటం , రాజేష్ ఖన్నా , అశోక్ కుమార్లు వంటి హేమాహేమీలు నటించటం వలన హిందీ సినిమా సక్సెస్ అయింది . మన తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్లో ఉండటం , శ్రీదేవి గ్లామరస్ గా ఉండకపోవటం వలన సక్సెస్ కాలేదు .

Ads

సినిమా బాగానే తీసారు . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . బయట హిట్ కాలేదు . ఈ సినిమా మళయాళంలో రాగం టైటిల్ తో , కన్నడంలో చిరంజీవి టైటిల్ తో రీమేక్ చేసారు . ఈ భాషల్లో ఎలా ఆడిందో నాకు తెలియదు . అసలు మన తెలుగు సినిమా ఉన్నట్లు కూడా జనానికి తెలియదేమో !

జాబిల్లి వెలిగె చల్లని వేళ (హేపీ, శాడ్ మూడ్స్)… కొండంత దేవుడు… మ్రోగించకోయి మురళి… నీ కళ్లలోన వెలిగిస్తాను… తోడు లేదు, నాకెవరూ లేరు… ఇవీ పాటలు.

సినిమా యూట్యూబులో ఉంది . శ్రీదేవి అభిమానులు చూడవచ్చు . శ్రీదేవి గ్లామరస్ గా కనిపించకపోయినా , హీరోయిన్ గా 13 సంవత్సరాల వయసులో మొదటి సినిమా అయినా బాగా నటించింది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు… BY దోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions