సీరియళ్లను వదిలేస్తే వినోద చానెళ్లలో హ్యూమర్ బేస్డ్ షోలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు… పూర్ అండ్ డర్టీ టేస్ట్ అయినా సరే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్సట్రా జబర్దస్త్ తదితర షోలు కాస్తోకూస్తో రేటింగ్స్ సంపాదిస్తున్నాయంటే ఈ ఆసక్తే కారణం… వేరే దిక్కులేకపోవడం మరో కారణం… మాటీవీ వాడు ఏ షో రేటింగులను ఎలాగైనా అటూఇటూ మార్చగలడేమో గానీ, అత్యంగా ఘోరంగా ఫ్లాపబడిన కామెడీ స్టార్స్ అనే షో గతిని మాత్రం మార్చలేకపోయాడు… సేమ్, జీతెలుగు అదిరింది షోతో నష్టం నషాళానికి అంటింది… ఈ రెండు చానెళ్లూ హ్యూమరస్ షోల విషయంలో సూపర్ ఫ్లాపర్స్…
ఇప్పుడు సరదాగా చెప్పుకునేది హేమిటంటే..? ఈటీవీ జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసి, జీతెలుగులో అదిరింది షో ఎత్తిపోయి, యూట్యూబ్‌లో స్టాండప్ కామెడీ నవ్వులపాలైపోయి, రాజకీయాలు వర్కవుట్ గాక ఖాళీగా ఉంటున్న నాగబాబు ఇప్పుడు స్టార్‌మాటీవీలో అడుగుపెట్టాడు… పెట్టాడు కదా, ఎవరో జడ్జికి మూడింది అని అనుకుంటూనే ఉన్నారు అందరూ… అనుకున్నట్టే పడింది దెబ్బ… ఫాఫం, శ్రీదేవి ఎగిరిపోయింది… ఒకప్పటి హీరోయిన్, అవకాశాల్లేక, వచ్చిన అవకాశాలు ఫలించక సినిమారంగానికి దూరదూరంగా ఉంటోంది… ఏదో ఈ జడ్జి స్థానంలో కూర్చుని, నవ్వడానికి కూడా బాగా ప్రయాసపడేది… ఏం లాభం..? ఇప్పుడు అదీ హాంఫట్… వెళ్లగొట్టేశారు…
Ads
ఈ నాగబాబు అంటేనే జడ్జిలకు, యాంకర్లకు దడ… అప్పట్లో అదిరింది షో చేసేవాడు కదా… ఆ స్కిట్లు నవ్వు పుట్టించేవి కావు… దాంతో అకారణంగా యాంకర్ సమీరను తీసిపారేసి… రవి, భానుశ్రీ, శ్రీముఖిలను తెచ్చారు… ఏమైంది..? కొన్నాళ్లకు ఆ షో మొత్తానికే ఎత్తిపోయింది… ఇప్పుడు కామెడీ స్టార్స్ షో నుంచి శ్రీదేవిని వెళ్లగొట్టారు కదా… మరి లాఫింగ్ స్టార్ అని కొలవబడే నాగబాబు వచ్చాక ఈ షో రేటింగ్స్ ఏమైనా ఉద్దరించబడ్డాయా..? నో… లాస్ట్ వీక్ బార్క్ రేటింగ్స్‌లో మరీ రెండుకు పడిపోయింది… చాలా దయనీయమైన రేటింగ్స్, మాటీవీ బోల్డంత సిగ్గుపడే రేటింగ్స్… మరి శ్రీదేవిని పంపించేసి, బాగుపడింది ఏమిటట..?
నిజానికి సరుకులో నాణ్యత ఉండాలే గానీ… జడ్జిలు, యాంకర్లు ఎవరుంటేనేం..? కాస్త అడిషనల్ వాల్యూ వస్తుందేమో గానీ, రుచి కుదరాల్సింది అసలు వంటలో కదా..! ఆమధ్య మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నుంచి హీరోయిన్ తమన్నాను తీసిపారేశారు, యాంకరిణి అనసూయను పెట్టారు… ఏమైంది..? షో మరింత దెబ్బతిన్నది… అనవసరంగా లీగల్ నోటీసులు, మన్నూమశానం… అసలు షోలో దమ్ముండాలి కదా… జబర్దస్త్ షోలో నాగబాబు వెళ్లిపోయాక బోలెడుమందిని జడ్జి కుర్చీలో కూర్చోబెట్టి ప్రయోగాలు చేశారు… అలా స్కిట్లు చూస్తూ పకపకా నవ్వండి చాలు, అంతకుమించి ఉద్దరించేది ఏమీ ఉండదు, చిన్నాచితకా పంచులు ముందుగానే చెప్పేసి, స్కిట్లు దెబ్బతీసే పని రోజా చూసుకుంటుంది అన్నారు… కొందరికి అది కూడా చేతకాలేదు… ఇప్పుడు సింగర్ మనో ఆ కుర్చీలో కాస్త కుదురుకున్నాడు…
అసలు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏముంటుంది..? టీవీ షోలు అంటేనే స్క్రిప్టెడ్ అండ్ ఎడిటెడ్ యవ్వారం కదా… ఏది ఏమిటో ముందే ఫిక్సయిపోతుంది… మొన్నటిదాకా ఢీ షోలో పూర్ణ అనే హీరోయిన్ ఓ జడ్జి… అప్పుడప్పుడూ కంటెస్టెంట్ల మీద హఠాత్తుగా ప్రేమ పెరిగి, వాళ్ల బుగ్గలు కొరికేది… నిజానికి అక్కడంతా ప్రియమణిదే హవా… ఆమెది హగ్గుల డ్యూటీ… ఇప్పుడు పూర్ణను తీసిపారేశారు… మరో మలయాళీ హీరోయిన్ నందిత శ్వేతను పట్టుకొచ్చారు… హేమిటో… కామెడీ ఏమిటంటే..? అప్పట్లో ఓంకార్ హోస్టుగా మాటీవీలో డాన్స్ ప్లస్ అని ఓ డాన్స్ షో వచ్చేది… ఢీని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఏవో పిచ్చి కామెడీ స్కిట్లు ట్రై చేశారు గానీ వర్కవుట్ కాలేదు… అందులో ఏకంగా ఆరుగురు జడ్జిలు… యానీ, రఘు, యశ్, బాబా, ముమైత్, మోనాల్… చివరకు ఏమైంది..? రేటింగ్స్ సాధించలేక ఫట్ అని పేలిపోయింది షో… నిజానికి కామెడీ అంటే… యాంకర్లు, జడ్జిలను బట్టి రేటింగ్స్ మారతాయి అనే వెర్రి భ్రమ…!!
Share this Article